Telangana News: మద్యం మత్తులో దారుణం - ఏడేళ్ల బాలికను మంటల్లో విసిరేసిన తండ్రి, ఎక్కడంటే.?
Kamareddy News: మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. తన ఏడేళ్ల బాలికను మంటల్లో విసిరేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.
Father Threw her Daughter into The Fire in Kamareddy: ఓ వ్యక్తి మద్యం మత్తులో తన ఏడేళ్ల బాలికను మంటల్లోకి విసిరేసిన దారుణ ఘటన కామారెడ్డి (KamaReddy) జిల్లాలో ఆదివారం జరిగింది. బీర్కూరు (Birkur) మండలం బరంగెడ్డి (Baramgeddi) గ్రామానికి చెందిన దేశాయిపేట్ సాయిలుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో వారు ఇంటి పక్కనే ఆడుకుంటున్నారు. అదే సమయంలో వీరి ఇంటి పక్కనే ఉన్న గొట్టల గంగాధర్ గడ్డివాముకు నిప్పంటుకుంది. అయితే, సాయిలు కుమార్తె వల్లే ఇలా జరిగిందని గంగాధర్ ఆరోపించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయిలు కోపంతో తన కుమార్తె అంకిత(7)ను కాలుతున్న గడ్డి వాములోకి విసిరేశాడు. ఇది చూసి షాకైన గంగాధర్ వెంటనే అప్రమత్తమై, గడ్డివాములోకి దూకి పాపను రక్షించాడు. పాప కాళ్లు, చేతులకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం 108 వాహనంలో బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన సాయిలుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Also Read: Hyderabad News: న్యూ ఇయర్ వేడుకల వేళ భారీగా డ్రగ్స్ పట్టివేత - ఇద్దరు విద్యార్థుల అరెస్ట్