FATF Black List: FATF బ్లాక్ లిస్ట్‌లో ఆ మూడు దేశాలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
FATF List: ఇరాన్, ఉత్తర కొరియా, మయన్మార్‌ను FATF బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది.
FATF Black List:
ఈ మూడు దేశాలు బ్లాక్ లిస్ట్‌లోనే..
Financial Action Task Force (FATF) రష్యాకు షాక్ ఇచ్చింది. సభ్యత్వం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మరి కొన్ని దేశాలను Black Listలో పెట్టింది. ఈ లిస్ట్‌లో ఇరాన్, ఉత్తర కొరియా, మయన్మార్‌లను చేర్చింది. ప్రపంచ దేశాలపై నిఘా ఉంచడమే ఈ సంస్థ విధి. మనీ లాండరింగ్‌తో పాటు ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారా అన్న కోణాల్లో నిఘా పెడుతుంది. ఆ మేరకు ఆయా దేశాలను బ్లాక్, గ్రే లిస్ట్‌లలో పెడుతుంది. ఫలితంగా...వాటికి IMF నుంచి రుణాలు అందవు. పలు దేశాల నుంచి ఆంక్షలనూ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే...మనీ లాండరింగ్ సహా ఉగ్రవాదులకు నిధులు అందించే విషయంలో ఇరాన్, ఉత్తర కొరియా, మయన్మార్ ప్రమాదకర స్థితిలో ఉన్నాయని తేల్చి చెప్పింది FATF.అందుకే బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. పారిస్‌లో జరిగిన సమ్మిట్‌లో ఈ నిర్ణయం వెల్లడించింది. యూఏఈ, టర్కీ, జోర్డాన్, సౌత్ ఆఫ్రికాతో పాటు మరో 20 దేశాలపై తాము నిఘా పెట్టినట్టు స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లో పాకిస్థాన్‌ను "Watch List" నుంచి తొలగించింది. ఇదే సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించీ ప్రస్తావించింది. ఉక్రెయిన్ ప్రజల పట్ల సానుభూతి తెలిపింది. రష్యా చేస్తున్న దాడిని ఖండించింది. అమాయక పౌరులను చంపుతున్నారని మండి పడుతోంది.
ఈ ఆంక్షలు తప్పవు..
FATF నిర్దేశించిన బ్లాక్, గ్రే లిస్ట్‌లలో ఉండే దేశాలకు International Monetary Fund (IMF) నుంచి రుణాలు దక్కవు. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), యూరోపియన్ యూనియన్ (EU) నుంచి ఆర్థిక సహకారమూ అందదు. అయితే మానిటరింగ్ లిస్ట్‌లో కొన్ని దేశాలను చేర్చుతుంది. గతేడాది అక్టోబర్ వరకూ పాకిస్థాన్‌లో ఈ లిస్ట్‌లో ఉంది. ఆ తరవాత తొలగించింది. ఈ లిస్ట్‌లో నుంచి తొలగించిన తరవాత పాకిస్థాన్ ఆర్థికంగా బలపడేందుకు కొన్ని చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. కానీ అవేవీ ఆ దేశాన్ని గట్టెక్కించలేకపోతున్నాయి. దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇదే సమయంలో FATF మయన్మార్‌కు వార్నింగ్ ఇచ్చింది. పలు కీలక విభాగాల్లో మనీ లాండరింగ్ జరుగుతోందని సంకేతాలొస్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ చర్యలు తీసుకోనంత వరకూ బ్లాక్ లిస్ట్‌లోనే ఉంచాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. యూఏఈ విషయంలో మాత్రం కొంత మేర సంతృప్తి వ్యక్తం చేసింది. గతేడాది ఫిబ్రవరితో పోల్చి చూస్తే...చాలా వరకూ మెరుగు పడిందని తెలిపింది.
FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) రష్యా సభ్యత్వాన్ని రద్దు చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ భద్రత, సమగ్రతకు రష్యన్ ఫెడరేషన్ చర్యలు ఆమోదయోగ్యంగా లేవని FATF తెలిపింది. ఈ మేరకు రష్యా సభ్యత్వాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు FATF ఓ ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధం కొనసాగించడం ఎఫ్ఏటీఎఫ్ సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైమ్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) శుక్రవారం రష్యా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. "రష్యన్ ఫెడరేషన్ చర్యలు భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన FATF ప్రధాన సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి" అని ప్యారిస్ ఆధారిత గ్రూప్ ఎఫ్ఏటీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా సభ్యత్వాన్ని రద్దు చేయాలని గత ఏడాది ఉక్రెయిన్ పలుమార్లు కోరింది. రష్యా ఇప్పుడు సస్పెండ్ అయినప్పటికీ సభ్యదేశంగా ఉంటుంది.