News
News
X

Kisaan Parliament: ఎండ, వాన లెక్కేలేదు.. రద్దు చేసేవరకు తగ్గేదే లేదు!

దిల్లీ జంతర్ మంతర్ వద్ద రైతుల ఆందోళన మొదలైంది. పార్లమెంట్ సమావేశాలు నడుస్తోన్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దిల్లీ సరిహద్దుల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు.

FOLLOW US: 

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొద్ది నెలలుగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులు నేడు మరోసారి కదం తొక్కారు. ఈరోజు నుంచి దిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయున్నారు. కిసాన్ సంసద్ పేరుతో నిర్వహించే ఈ నిరసనకు సరిహద్దుల నుంచి అన్నదాతలు బస్సుల్లో ర్యాలీ వెళ్తున్నారు.

జంతర్‌ మంతర్‌ వద్ద కిసాన్‌ సంసద్‌ నిర్వహించుకునేందుకు దిల్లీ ప్రభుత్వం రైతులకు నిన్న అనుమతినిచ్చింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించింది. దీంతో గురువారం రైతులు సరిహద్దుల నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. ఇప్పటికే సింఘు సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున రైతులు గుమిగూడారు. పోలీసు ఎస్కార్ట్‌ నడుమ 200 మంది బస్సుల్లో వెళ్లి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టనున్నారు. 

భారీ భద్రత

అయితే, ఈ జంతర్‌మంత్‌ పార్లమెంట్‌కు కొద్ది మీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జంతర్‌మంతర్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బంది భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు సరిహద్దుల్లోనూ భద్రతను పెంచారు. టిక్రి సరిహద్దుల్లో ఆందోళనకు అనుమతినివ్వకపోవడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండేలా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

ఆందోళన..

ఆందోనల్లో పాల్గొనేందుకు భారత కిసాన్ యూనియన్ నేత రాకేశ్‌ టికాయత్‌ సింఘు సరిహద్దుకు చేరుకున్నారు 

" "గత 8 నెలలుగా మేం ఇక్కడ ఉద్యమం సాగిస్తున్నాం. శాంతియుతంగానే నిరసన చేపడుతూ ప్రభుత్వం ముందు మా డిమాండ్లు ఉంచాం. ఇప్పుడు జంతర్‌మంతర్‌ వద్ద కిసాన్‌ పార్లమెంట్‌ నిర్వహించతలపెట్టాం. ఇందుకోసం 5 బస్సుల్లో రైతులు అక్కడకు వెళ్లి ప్రతి రోజూ నిరసన చేస్తారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకు మేం అక్కడే ఉంటాం" "
-రాకేశ్ టికాయత్, బీకేయూ నేత

దాదాపు 8 నెలలుగా రైతుల ఉద్యమం సాగుతోంది. నూతనంగా తెచ్చిన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూరేలా ఈ చట్టాలు ఉన్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రైతులకు- అన్నాదాతలకు మధ్య చాలా సార్లు చర్చ జరిగింది. ప్రభుత్వం తెచ్చిన ఎలాంటి ప్రతిపాదనను రైతులు అంగీకరించలేదు. బేషరతుగా చట్టాలను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎండ, వాన, చలి ఇలా ఏది లెక్కచేయకుండా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 

Published at : 22 Jul 2021 01:36 PM (IST) Tags: Farmers agitation farmer protest farm laws delhi jantar mantar

సంబంధిత కథనాలు

APPSC Recruitment:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ!

APPSC Recruitment:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ!

Singareni Employees Bonus: సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ద‌స‌రా కానుక‌ ప్రకటన

Singareni Employees Bonus: సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్, ద‌స‌రా కానుక‌ ప్రకటన

పండగొచ్చేసింది - 78 రోజుల బోనస్, పేదలకు రేషన్ ఫ్రీ- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

పండగొచ్చేసింది - 78 రోజుల బోనస్, పేదలకు రేషన్ ఫ్రీ- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

ABP Desam Top 10, 28 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 28 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు!

పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు!

టాప్ స్టోరీస్

YSRCP WorkShop : ఆ 27 మంది ఎమ్మెల్యేలకూ డేంజర్ సిగ్నల్స్ - నేరుగా ఇచ్చేసిన జగన్ ! వారెవరంటే ?

YSRCP WorkShop :  ఆ 27 మంది ఎమ్మెల్యేలకూ డేంజర్ సిగ్నల్స్ -  నేరుగా ఇచ్చేసిన జగన్ !   వారెవరంటే ?

Godfather trailer: నేను ఉన్నంత వరకు ఆ కుర్చీకి చెద పట్టనివ్వను, అదరగొట్టిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్

Godfather trailer: నేను ఉన్నంత వరకు ఆ కుర్చీకి చెద పట్టనివ్వను, అదరగొట్టిన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్

AP Vs Telangana : విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?

AP Vs Telangana :  విద్యుత్ బకాయిలపై తెలంగాణకు ఊరట - కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు ఏమిటంటే ?

Byreddy Siddharth Reddy: వచ్చే ఎన్నికల్లో YCP ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న సిద్దార్థ్

Byreddy Siddharth Reddy: వచ్చే ఎన్నికల్లో YCP ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న సిద్దార్థ్