అన్వేషించండి

Bhagat Singh Koshyari: రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర గవర్నర్- వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి!

Bhagat Singh Koshyari: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

Bhagat Singh Koshyari: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది.  ఈ విషయమై గవర్నర్ కోష్యారీ తన సన్నిహితులతో మాట్లాడినట్లు సమాచారం. ఛత్రపతి శివాజీపై గవర్నర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్, శివసేన (ఠాక్రే వర్గం)లు.. గవర్నర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.

మరో వివాదం

ఈ వివాదంతో ఉక్కిరిబిక్కిరైన గవర్నర్.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. 26/11 ముంబయి ఉగ్రదాడుల అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించే సమయంలో గవర్నర్ తన పాదరక్షలను తీయలేదని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. 

" గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మహారాష్ట్రను, ఇక్కడి సంస్కృతిని, చిహ్నాలను పదేపదే అగౌరవపరుస్తున్నారు. తన పాదరక్షలను తొలగించి, ఉగ్రదాడుల అమరవీరులకు గౌరవం ఇవ్వాలని సీఎం ఏక్‌నాథ్ శిందే గుర్తు చేసి ఉండాల్సింది. "
-సచిన్ సావంత్, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (MPCC) ప్రధాన కార్యదర్శి

నవంబర్ 26న దక్షిణ ముంబయిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద కోష్యారీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇదీ వివాదం

ఛత్రపతి శివాజీ ఐకానిక్ పర్సనాలిటీ అయినా అదంతా పాత రోజుల్లోనని...ఇప్పటి ఐకానిక్ పర్సనాలిటీస్ వేరే ఉన్నారని గవర్నర్ ఇటీవల అన్నారు. ఔరంగాబాద్‌ లోని డాక్టర్ బాబాసాహెబ్ అండేక్కర్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలోనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

" ఒకప్పుడు భారత్‌లో ఐకాన్‌ లాంటి వ్యక్తులెవరంటే నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ అని సమాధానం ఇచ్చేవారు. కానీ...మహారాష్ట్ర ఈ విషయంలో ప్రత్యేకం. ఇక్కడ ఎంతో మంది గొప్ప వ్యక్తులున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఒకప్పటి ఐకాన్. కానీ ఇప్పుడు అంబేడ్కర్‌, నితిన్ గడ్కరీ ఆ స్థాయిలో ఉన్నారు.                                               "

-  బీఎస్ కోష్యారీ, మహారాష్ట్ర గవర్నర్

ఈ వ్యాఖ్యలతో మహారాష్ట్రలోని విపక్షాలన్నీ గవర్నర్‌పై విమర్శల దాడి మొదలు పెట్టాయి. విపక్షాలతో పాటు సీఎం శిందే నేతృత్వంలోని శివసేన వర్గం కూడా ఆయనను విమర్శించాయి.

Also Read: Viral Video: స్టన్నింగ్ వీడియో- బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సు ఎక్కించాడు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP DesamNagoba Jathara Padayathra | ప్రారంభమైన మెస్రం వంశీయుల గంగాజల పాదయాత్ర | ABP DesamPawan Kalyan vs BR Naidu | టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరేలా చేసిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Kondapochamma Sagar Dam: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
Embed widget