అన్వేషించండి

Kerala Exit polls: కేరళలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పేది ఒక్కటే - లెఫ్ట్ పార్టీలకు ఎగ్జిట్ - కాంగ్రెస్ కూటమికి పీఠం !

Kerala: కేరళలో ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇదే చెప్పాయి.

Kerala exit for Left parties:  కేరళలో  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి.   కేరళ రాజకీయ చరిత్రలో దశాబ్దాలుగా ఉన్న ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది అనే ఆచారాన్ని 2021లో ఎల్డీఎఫ్ (LDF) బ్రేక్ చేసింది. అయితే, 2026లో మళ్ళీ పాత సంప్రదాయమే పునరావృతం కాబోతోందని, ఈసారి యూడీఎఫ్ (UDF) అధికారంలోకి రావడం ఖాయమని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి.
  
 మళ్ళీ  మార్పు  దిశగా కేరళ ఓటరు! 

మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 71 . దాదాపు అన్ని ప్రముఖ సంస్థలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టాయి.
 
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని అర్థమవుతోంది.  Axis My India యూడీఎఫ్‌కు అత్యధికంగా 78-90 స్థానాలు అంచనా వేయగా,   People's Pulse 75-85 స్థానాలు,  Vote Vibe  70-80 స్థానాలు, Matrize  70-75 స్థానాలు లభిస్తాయని పేర్కొన్నాయి. మరోవైపు, అధికార ఎల్డీఎఫ్ (LDF) 49 నుండి 68 స్థానాల మధ్యే పరిమితం కావచ్చని ఈ సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమికి అత్యల్పంగా 0 నుండి 5 స్థానాల లోపే దక్కవచ్చని, ఇతరులు ఒకటి రెండు స్థానాలకే పరిమితమవుతారని ఈ అంచనాలు సూచిస్తున్నాయి. మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ 71ని దాటి యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ఆకర్షించిన కాంగ్రెస్ హామీలు

 వి.డి. సతీశన్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమికి ఈసారి ప్రజలు పట్టం కట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగం, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు , ప్రభుత్వ వ్యతిరేకత   యూడీఎఫ్ కు బాగా కలిసివచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా మూడవసారి ముఖ్యమంత్రి కావాలని ఆశించిన పినరయి విజయన్ కు ఈ ఫలితాలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపట్టిన కె-రైల్  వంటి ప్రాజెక్టులపై వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు కూటమి సీట్లను తగ్గించాయని అంచనా.   కేరళలో ఈసారి రికార్డు స్థాయిలో  81.2% మహిళా ఓటింగ్ నమోదైంది. మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి యూడీఎఫ్ వాగ్దానాలు వారిని ఆకర్షించినట్లు కనిపిస్తోంది.

బీజేపీ ఉనికి అంతంతమాత్రమే                        

రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో బీజేపీ (NDA) ఈసారి కేరళలో తన ఖాతాను పెంచుకోవాలని గట్టిగానే ప్రయత్నించింది. కొన్ని సర్వేలు 3 నుండి 5 సీట్లు రావచ్చని చెబుతుండగా, మరికొన్ని మాత్రం కేవలం ఒక్క సీటుకే   పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నాయి.
 
కేరళ ఓటర్లు ఎప్పుడూ విభిన్నంగా ఆలోచిస్తారు. 2021లో ఎల్డీఎఫ్ ను గెలిపించి చరిత్ర సృష్టించిన ప్రజలు, ఈసారి మళ్ళీ యూడీఎఫ్ కు అవకాశం ఇస్తారా లేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ లెఫ్ట్ పార్టీలకు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారా అనేది మే 4 న తేలిపోనుంది. 

టాప్ హెడ్ లైన్స్

Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
CM Vijay: సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
AP Local Body Elections: గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget