Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్‌లో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జూనియర్ కమిషన్‌డ్ ఆఫీసర్ (జేసీఓ) సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పిర్ పంజల్ రేంజ్ వద్ద జరిపిన కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ఈ ఘటన జరిగింది.
A junior commissioned officer (JCO) & four soldiers killed in action during a counter-terrorist operation in the Rajouri sector in the Pir Panjal ranges: Sources
— ANI (@ANI) October 11, 2021
ఏం జరిగింది?
జమ్ముకశ్మీర్ పూంఛ్ ప్రాంతంలో ముగ్గురు ముష్కరులు ఉన్నారనే సమాచారం భారత్ ఆర్మీకి వచ్చింది. వారిని పట్టుకునేందుకు భారత సైన్యం గాలింపు చేపట్టారు. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
ఇద్దరు ఉగ్రవాదులు హతం..
మరవైపు అనంత్‌నాగ్ జిల్లా ఖాగుండ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఉదయం మట్టుబెట్టాయి. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. బందిపొరా హాజిన్‌లో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు.
కాల్పుల కలకలం..
జమ్ముకశ్మీర్‌లో పౌరులపై ఇటీవల ఉగ్రవాదుల కాల్పులు ఎక్కువయ్యాయి. జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల కాల్పులు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. ఈ ఘటనతో జమ్ముకశ్మీర్‌లో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
దీంతో పోలీసులు ఉగ్ర ఏరివేత చర్యలు చేపట్టారు. బందిపొరాలో లష్కర్ ఏ తోయిబా(ఎల్ఈటీ) ఉగ్ర స్థావరాన్ని పోలీసులు ఛేదించారు. నైద్ఖాయ్కు చెందిన మహమ్మద్ షఫీ లోనే అలియాస్ సోను అనే వ్యక్తి హత్య కుట్రలో భాగమైన నలుగురు ఉగ్ర అనుచరులను అరెస్టు చేశారు.
Also Read: Corona Update: మరోసారి 20 వేలకు దిగువనే.. కొత్తగా 18,132 కరోనా కేసులు నమోదు
Also Read: కలెక్టర్ ఇంట్లో దొంగతనం.. లేఖ వదిలి వెళ్లిన దొంగలు, రాసింది చూసి విస్తుపోయిన అధికారి