Putin Vs Musk : పుతిన్ తనతో యుద్ధం చేసేదాకా వదిలి పెట్టేలా లేడు ఎలన్ మస్క్ ! ఈ ట్వీట్లు చూస్తే నవ్వాపుకోలేరు
రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో యుద్ధానికి రావాలని అదే పనిగా సవాల్ చేస్తున్నారు ఎలన్ మస్క్. ఈ సారి ఆయన మరో ఆఫర్ ఇచ్చారు. తన పుర్ర చేత్తోనే పోరాటం చేస్తానని పుతిన్ ముందుకు రావాలన్నారు.
ఉక్రెయిన్‌పై తన మానాన తాను యుద్దం చేసుకుంటూంటే పుతిన్‌పై తొడ కొడుతున్నారు టెస్లా చీఫ్ ఎలన్ మస్క్. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడం ఆయనకు నచ్చలేదు. అలా నచ్చని కోట్లాది మంది ప్రపంచ ప్రజల్లో ఆయన కూడా ఒకరు. కానీ ఆయన అందరిలా సామాన్యుడు కాదు. ప్రపంచ కుబేరుడు. అందుకే ఉక్రెయిన్‌కు తాను చేయగలిగినంత సాయం చేస్తున్నాడు. ఉక్రెయిన్‌లో తన స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తూ నాటో కూడా చేయని సాయం చేశాడు. ఇప్పుడు ఉక్రెయిన్ కోసం తానే స్వయంగా యుద్దం చేస్తానంటున్నాడు. ఇప్పుడు మస్క్ హడావుడి ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.
మూడు రోజుల కిందట... రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఫేస్ టూ ఫేస్ తేల్చుకుందాం రమ్మంటూ ఎలన్ మస్క్ సవాల్ చేశారు. అయితే మస్క్‌ది పుతిన్ రేంజ్ కాదని.. ఆయన కింద ఉన్న వారు స్పందించడం ప్రారంభించారు. మా బాస్‌కే ఛాంలెజ్ విసురుతావా ? అంటూ కౌంటర్ ఎటాక్ స్టార్ చేశారు. తేల్చుకుందారం రమ్మంటూ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌పై రష్యా ఆధీనంలోని చెచెన్యా రిపబ్లిక్ హెడ్ రమ్‌జాన్ కేడీరోవ్ స్పందించారు. " ఎలన్ మస్క్ ! ఒకవేళ బాక్సింగ్ రింగులో మీరు తలపడితే.. అసలే స్పోర్ట్స్‌మాన్‌లా ఉండే పుతిన్ దెబ్బకు నీలో ఉన్న దయ్యం ఎగిరిపోతుంది" అంటూ కౌంటర్ ఇచ్చాడు.
Telegram post by Ramzan Kadyrov, head of Chechen Republic! pic.twitter.com/UyByR9kywq
— Elona Musk (@elonmusk) March 15, 2022
పుతిన్ లాంటి స్ట్రాంగ్ పర్సన్‌తో నువ్వు యుద్ధం చేయాలంటే నువ్వు మరింత బలంగా మారాలి. ఇలా ఎలోనాగా ఉంటే సరిపోదు. నీకు కావాలంటే రష్యాలో ఉన్న మిలిటరీ ట్రైనింగ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పిస్తాను. అప్పుడు నువ్వు ఎలానా నుంచి ఎలన్‌గా మారవచ్చని సెటైర్ వేశాడు. వెంటనే ఎలన్ మస్క్ రిప్లయ్ ఇచ్చాడు. అలాంటి శిక్షణ తీసుకోవడం నాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు నాతో పోరాడటానికి పుతిన్ భయపడితే.. నాది లెఫ్ట్ హ్యాండ్ కాకపోయినా సరే పుతిన్‌తో పుర్రచేయితో పోరాటానికి తాను రెడీ అని సవాల్ చేశాడు.
అయితే ఎలన్ మస్క్ అంతటితో ఊరుకోలేదు. ఈ ట్వీట్‌ను పోస్ట్ చేసే సమయంలో తన డీపీ పేరును సైతం ఎలోనా మస్క్‌గా మార్చేసుకున్నారు. పరిస్థితి చూస్తూంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్‌తో పాటు.. టెస్లాపైనా ఓ కన్నేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసేప్రకటనల కన్నా ఇప్పుడు మస్క్ చేసే ప్రకటనలే వైరల్ అవుతున్నాయి.