Viral Video: ట్రైన్ ఢీకొని ఏనుగుకి తీవ్ర గాయాలు, ట్రాక్‌పైనే విలవిలలాడి మృతి - గుండెని మెలిపెడుతున్న వీడియో
Elephant Death: అసోంలో ట్రాక్‌పై ఉన్న ఏనుగుని ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏనుగుకి తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితే కొట్టుమిట్టాడి అక్కడే మృతి చెందింది.
Elephant Dies on Railway Track: అసోంలో గుండెల్ని పిండేసే ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌పై ఓ ఏనుగు నరకయాతన అనుభవించి అక్కడే చివరకు ప్రాణాలు విడిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడం వల్ల ఏనుగుకి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్‌పై అటూ ఇటూ తిరుగుతుండగా ఉన్నట్టుండి రైల్ వచ్చి బలంగా ఢీకొట్టింది. అప్పటికే బ్రేక్ వేసేందుకు లోకోపైలట్ ప్రయత్నించాడు. అయినా ట్రైన్ స్పీడ్ కంట్రోల్ కాలేదు. బలంగా ఏనుగుని ఢీకొట్టింది. జులై 10వ తేదీన సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్‌లోని ఓ ప్రయాణికుడు ఏనుగుని వీడియో తీశాడు. అడుగు తీసి అడుగు వేయలేక చాలా ఇబ్బంది పడింది. దాదాపు రెండు నిముషాల పాటు కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది. తరవాత ట్రాక్‌పక్కనే సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు విడిచింది.
An elephant near was hit by Kanchenjunga Exp. Jagiroad was not the first one in the area. Two elephants had died earlier under similar circumstances. The area is not a part of a designated elephant movement zone. Its about time elephant occupancy study for such areas are taken… pic.twitter.com/bhORSGKbB4
— CEO Voice (@CeoVoice_) July 11, 2024
ట్రైన్ ఢీకొట్టడం వల్ల కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమైంది. విపరీతమైన నొప్పితో గట్టిగా హుంకరించింది. ఎలాగోలా ట్రాక్ దాటి అక్కడి నుంచి బయటపడాలని చూసింది. ఓ రెండు అడుగులు వేసి అక్కడే నిలిచిపోయింది. పట్టుతప్పి కింద పడిపోయింది. కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం అందించి ఉంటే ఏనుగు బతికి ఉండేదేమో అని చాలా మంది కామెంట్స్ పెట్టారు. అయితే అధికారులు ప్రాణం కాపాడేందుకు చికిత్స అందించారు. అయినా ఏనుగు మృతి చెందింది.