Elections New Rules : ఐదు రాష్ట్రాల్లో ధూం..ధాం ప్రచారాల్లేని ఎన్నికలు... ఆంక్షలు పొడిగించిన ఈసీ !

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారాలపై ఈసీ ఆంక్షలు పొడిగించింది. ఫలితంగా ర్యాలీలు, బహిరంగసభలకు చాన్స్ లేకుండాపోయింది.

FOLLOW US: 

ఎన్నికలంటే అందరికీ కనిపించేది భారీ బహిరంగసభలు, ర్యాలీలు. ధూం..ధాంగా సాగే ప్రచారాలు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అవేమీ కనిపించే అవకాశం కనిపించడం లేదు.  దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతున్నందున ఐదు రాష్ట్రాల్లో రోడ్‌షోలు, పాదయాత్రలు, సైకిల్‌/బైక్‌ ర్యాలీలపై ఇదివరకే విధించిన నిషేధాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించిన సందర్భంగా ఎన్నికల ర్యాలీలపై విధించిన నిషేధం శనివారంతో ముగిసింది. కొనసాగించాలని ఈసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. 

Also Read: గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !

కేంద్ర ఆరోగ్య అధికారులు..ఐదు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నందున  ప్రచారాలపై కొన్నాళ్ల పాటు నిషేధం ఉంచడమే మేలనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలపై తాత్కాలిక నిషేధాన్ని ఈ నెల 22వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండోర్‌లలో నిర్వహించే సమావేశాలకు 300 మంది లేదా  హాలులో 50శాతం సామర్థ్యానికి మించకుండా చూసుకోవాలని రాజకీయ పార్టీలకు సూచించింది. 

Also Read: ఎలక్షన్ టైం కదా.. రైతులు కొట్టినా తియ్యని దెబ్బే..! ఉత్తరాది బీజేపీ ఎమ్మెల్యేకు ఎంత కష్టమో...?

ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌లలో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మార్చి 10న ఒకేసారి చేపడతారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే హడావుడిలో ఉన్నాయి. అదయిన తర్వాత ప్రచారబరిలోకి దిగాలనుకున్నారు. కానీ భారీ ప్రచారాలకు ఈ సారి అవకాశం లేకపోవడంతో పార్టీలన్నీ ఆన్‌లైన్ ప్రచారాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. యూపీలోనే ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్, గోవా,  ఉత్తరాఖండ్‌లో మాత్రం ఒకే దశలో జరగనున్నాయి. మణిపూర్‌లో  రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. 

Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!

Also Read: పంజాబ్ ఎన్నికల్లో భాజాపా- కెప్టెన్ దోస్తీ.. 101 శాతం విజయం తమదేనని ధీమా

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 15 Jan 2022 06:57 PM (IST) Tags: Election Commission of India EC Five state elections Electoral Commission Extension of Campaign Restrictions Campaign Restrictions Corona Impact on Elections

సంబంధిత కథనాలు

Venkaiah Naidu Farewell: 'మీ కౌంటర్లకు ఎదురు లేదు, మీ పంచ్‌లకు తిరుగు లేదు'- వెంకయ్యపై మోదీ ప్రశంసలు

Venkaiah Naidu Farewell: 'మీ కౌంటర్లకు ఎదురు లేదు, మీ పంచ్‌లకు తిరుగు లేదు'- వెంకయ్యపై మోదీ ప్రశంసలు

Breaking News Telugu Live Updates: రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ ఆమోదించిన స్పీకర్ పోచారం

Breaking News Telugu Live Updates: రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ ఆమోదించిన స్పీకర్ పోచారం

Rajasthan News: భక్తుల రద్దీతో ఆలయంలో తొక్కిసలాట- ముగ్గురు మృతి

Rajasthan News: భక్తుల రద్దీతో ఆలయంలో తొక్కిసలాట- ముగ్గురు మృతి

Rajagopal Reddy Resignation: రాజీనామా లేఖ సమర్పించిన రాజగోపాల్ రెడ్డి - వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం

Rajagopal Reddy Resignation: రాజీనామా లేఖ సమర్పించిన రాజగోపాల్ రెడ్డి - వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం

Corona Cases: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- 41 మంది మృతి

Corona Cases: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- 41 మంది మృతి

టాప్ స్టోరీస్

Constable Murder: నంద్యాలలో కలకలం - బీర్ బాటిల్స్‌తో దాడి, కత్తులతో పొడిచి కానిస్టేబుల్ దారుణ హత్య! 

Constable Murder: నంద్యాలలో కలకలం - బీర్ బాటిల్స్‌తో దాడి, కత్తులతో పొడిచి కానిస్టేబుల్ దారుణ హత్య! 

NTA JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

NTA JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల - రిజల్ట్, ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Sita Ramam Box Office Collection : 'సీతా రామం' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - ఓవ‌ర్సీస్‌లో హిట్టు! మరి, ఇండియాలో?

Sita Ramam Box Office Collection : 'సీతా రామం' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - ఓవ‌ర్సీస్‌లో  హిట్టు! మరి, ఇండియాలో?

Azadi Ka Amrit Mahotsav: ఆహారమే లేని దుస్థితి నుంచి ఆత్మనిర్భరత వరకూ, భారత్‌లో ఈ అద్భుతం ఎలా జరిగింది?

Azadi Ka Amrit Mahotsav: ఆహారమే లేని దుస్థితి నుంచి ఆత్మనిర్భరత వరకూ, భారత్‌లో ఈ అద్భుతం ఎలా జరిగింది?