Dubai Police Force Cyber Truck : టెస్లా సైబర్ ట్రక్స్‌తో దుబాయ్ పోలీసుల గస్తీ - ఎంత ఖరీదైన కారైనా ముందు వాళ్లు వాడాల్సిందే !
Cyber Truck : టెస్లా సంస్థ సైబర్ ట్రక్ కార్లను ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ దుబాయ్ పోలీసు విభాగం అప్పుడే వాటిని కొనుగోలు చేసి తమ పోలీసులకు ఇచ్చేసింది.
Dubai police are patrolling in cyber trucks : పోలీసులు జీపుల్లో గస్తీ తిరుగుతారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఫోర్డ్ కార్లు ఉపయోగిస్తారు. ఉన్నతాధికారులు అయితే లగ్జరీ కార్లు వాడుతారు. అమెరికాలో కూడా గస్తీ తిరగడానికి లగ్జరీ కార్లను వాడరు. కానీ దుబాయ్ పోలీసు వ్యవస్థ మాత్రం పూర్తిగా లగ్జరీ కార్లనే వాడతారు. బెంజ్, ఆడి సహా అన్ని లగ్జరీ కార్లూ దుబాయ్ పోలీస్ ఫోర్స్ దగ్గర ఉంటాయి. వాటిలోనే గస్తీ తిరుగుతారు. తాజాగా వారి వాహనాల జాబితాలో టెస్లా సైబర్ ట్రక్ కూడా వచ్చి చేరింది. ]
News : The Dubai Police General has added a Tesla Cybertruck to its fleet, making it the first police department to use this vehicle.
— Karata (@karatademada) June 16, 2024
This addition reflects Dubai's commitment to innovation in its police force.
📸 : DubaiPoliceHQ pic.twitter.com/r64oGoK9p3
సైబర్ ట్రక్ వాహనాలు ఇంకా పూర్తి స్థాయిలో రోడ్ మీదకు రాలేదు. కానీ దుబాయ్ పోలీస్ విభాగానికి మాత్రం టెస్లా ముందుగానే భారీ స్థాయిలో వాహనాలు సరఫరా చేసింది. వారు తమ అవసారలకు తగ్గట్లుగా అందులో సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని పోలీసింగ్ ప్రారంభించారు.
The Dubai Police announced that it is including a Tesla Cybertruck as part of its tourist luxury patrol fleet.pic.twitter.com/VvJwktuc1e
— Massimo (@Rainmaker1973) July 18, 2024
కొంత మంది దుబాయ్ వాసులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. టెస్లా కార్లకు ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అత్యంత ఖరీదుగా ఉండే టెస్లా కార్లు డ్రైవర్ లెస్ వాహనాలు. ఇప్పటి వరకూ విడుదల చేసిన వాహనాల కంటే భిన్నంగా సైబర్ ట్రక్ పేరుతో కొత్త వాహనాన్ని టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ప్రత్యేకంగా రూపొందింపచేశారు. ఆ వాహనానికి సైబర్ ట్రక్ అని పేరు పెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నడిచే వాహనంగా దీన్ని రూపుదిద్దారు.
టెస్లా సైబర్‌ట్రక్‌ను మొదటిసారిగా 2019లో బయట ప్రపంచానికి ప్రదర్శించారు. ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు. ఇప్పటి వరకూ కార్లను కొని బుల్లెట్ ఫ్ఱూఫ్‌గా మార్చుకుంటారు. కానీ ఇది బాడీ మొత్తం బుల్లెట్ ఫ్రూఫ్. పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. మూడు బ్యాటరీలతో ఈ కారు ఉంటుంది. అదే సమయంలో వేగవంతమైన కారుగా కూడా గుర్తింపు పొందుతోంది. ఒక్క సారి చార్జ్ చేస్తే ఏకంగా 800 కిలోమీటర్లు వెళ్తుందని టెస్లా ప్రకటించింది.
టెస్లా కంపెనీ మన దేశంలో కూడా ప్లాంట్ పెట్టడానికి చర్చలు జరుపుతోంది. కానీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. టెస్లా మామూలు కార్లే ఇప్పటి వరకూ మన దేశంలోకి రాలేదు. కొంత మంది ప్రత్యేక ఆసక్తితో దిగుమతి చేసుకున్నారు కానీ.. వాటికి రెట్టింపు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లాంట్ పెడితే టెస్లా కార్లకూ మన దేశంలో ఫుల్ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.