News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Droupadi Murmu President of India: నా ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీక: రాష్ట్రపతి తొలి ప్రసంగం

Droupadi Murmu President of India: రాష్ట్రపతిగా ఎన్నిక కావడం తన అదృష్టమని ద్రౌపది ముర్ము అన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు.

FOLLOW US: 
Share:

Droupadi Murmu President of India: చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి పీఠంపై గిరిపుత్రిక అధిరోహించారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు.

ఓ తెలుగు సీజేఐ.. రాష్ట్రపతి చేత ప్రమాణస్వీకారం చేయించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు, పార్లమెంటు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

" దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, హక్కులకు ప్రతీక అయిన పార్లమెంటులో ఇలా నిల్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను. దేశ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మీ నమ్మకం, మద్దతుతోనే ఈ కొత్త బాధ్యతలను నిర్వర్తించగలను. స్వతంత్ర భారతావనిలో పుట్టిన తొలి రాష్ట్రపతిగా నేను నిలిచాను. మన దేశ స్వతంత్ర పోరాట యోధుల విశ్వాసాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాను. రాష్ట్రపతి వరకు చేరుకోవడం నా వ్యక్తిగత విజయం కాదు. ఇది దేశంలోని పేద ప్రజల విజయం. పేదలు కలలు కనడమే కాదు.. ఆ కలలను సాకారం కూడా చేసుకోగలరు అనడనానికి నా విజయమే నిదర్శనం.  ఎన్నో దశాబ్దాలుగా అణగారిన వర్గాలైన పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. నన్ను మీ ప్రతినిధిగా చూడండి. ఎన్నో కోట్ల మంది మహిళల ఆకాంక్షలు, కలలకు నా ఎన్నిక ఓ ప్రతీక.                                   "
-ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి

Also Read: President Oath Ceremony: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం

Also Read: Droupadi Murmu President of India: రాష్ట్రపతికి శాలరీ ఎంతిస్తారు? ఆమె ఏ కార్‌లో ప్రయాణిస్తారు? ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

Published at : 25 Jul 2022 10:56 AM (IST) Tags: Draupadi Murmu draupadi murmu news Droupadi Murmu president draupadi murmu

ఇవి కూడా చూడండి

Telangana: బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని పెరుగుతున్న డిమాండ్

Telangana: బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని పెరుగుతున్న డిమాండ్

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

MLA Durgam Chinnaiah: రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

MLA Durgam Chinnaiah: రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

దేశ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యం, జెలెన్ స్కీకి పొలాండ్ ప్రధాని వార్నింగ్

దేశ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యం,  జెలెన్ స్కీకి పొలాండ్ ప్రధాని వార్నింగ్

Telangana: బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎమ్మెల్సీ కవిత

Telangana: బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎమ్మెల్సీ కవిత

టాప్ స్టోరీస్

IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?

IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్ 

Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్ 

Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?

Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?