అన్వేషించండి

Automatic Car Tips: ఆటోమేటిక్ కారును మాన్యువల్ కారులా నడిపి ఈ తప్పులు చేయవద్దు.. ఇవి పాటిస్తే మీ గేర్‌బాక్స్‌ సేఫ్

Automatic Car Tips: చాలామంది ఆటోమేటిక్ కార్లను మాన్యువల్ కార్లలాగే నడపడం ప్రారంభిస్తుంటారు. ఇలా చేయడం నివారించడానికి, మీరు కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటించాలి.

చాలాకాలం పాటు మాన్యువల్ కారు నడిపిన వారు ఆటోమేటిక్ కారుకు మారినా.. డ్రైవింగ్ స్టైల్ పాత తరహాలోనే ఉండటం సహజం. కానీ ఆటోమేటిక్ కారును మీరు మాన్యువల్ కారులా నడిపితే నష్టం తప్పదు. ఈ టిప్స్ పాటిస్తే మీ గేర్‌బాక్స్‌ సేఫ్ గా ఉంటుంది. లేకపోతే కారులో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

మనం తరచుగా మాన్యువల్ కార్లను నడిపిన పాత అలవాట్లను ఆటోమేటిక్ కార్ల విషయంలోనూ పాటిస్తుంటాం. కానీ అలా చేయడం కారుకు ఏమాత్రం సరికాదు. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు మెల్లగా గేర్‌బాక్స్, ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ను దెబ్బతీస్తాయి. అది మీ ఖర్చులను మరింత పెంచుతుంది. మీ కారు లైఫ్ టైం పెంచుకోవడానికి, భారీ ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి మీరు చేయకూడని ఆ 5 తప్పుల గురించి ఇక్కడ అందిస్తున్నాం. 

వెహికల్ న్యూట్రల్‌లో ఉంచడం.. 
చాలా మంది ఇంధనం ఆదా అవుతుందనే ఉద్దేశంతో కారు న్యూట్రల్‌లో వేస్తుంటారు. అయితే ఆటోమేటిక్ కార్లలో ఇంజిన్ నడుస్తున్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌కు ఆయిల్ సరిగ్గా అందుతుంది. న్యూట్రల్‌లో ఉంచడం వల్ల లూబ్రికేషన్ తగ్గి, కొంత కాలం తరువాత గేర్‌బాక్స్ ఓవర్ హీట్ అయ్యి దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఈ అలవాటును వెంటనే మార్చుకోవాలి.

బ్రేక్ నొక్కకుండా గేర్ షిఫ్ట్ చేయడం
అతి ముఖ్యమైన విషయం బ్రేక్ నొక్కకుండా గేర్ షిఫ్ట్ చేయవద్దు. డ్రైవ్ అయినా లేదా రివర్స్ (R) అయినా, ఎప్పుడూ బ్రేక్ నొక్కి పట్టుకున్నాకే షిఫ్ట్ చేయాలి. బ్రేక్ లేకుండా షిఫ్ట్ చేయడం వల్ల గేర్ సిస్టమ్‌పై ఒక్కసారిగా లోడ్ పడతుంది. రెగ్యూలర్ ఇలాగే చేస్తూపోతే గేర్ బాక్స్ పోతుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ ఆటోమేటిక్ కారును ఎక్కువ కాలం స్మూత్‌గా నడపవచ్చు.

నేరుగా పార్క్ మోడ్‌లో ఉంచడం
కారు కదులుతున్నప్పుడు నేరుగా పార్కింగ్ మోడ్‌లోకి మార్చడం మరొక తప్పిదం. కారు పూర్తిగా ఆగే వరకు 'P' మోడ్‌ను ఉపయోగించరాదు. ఇలా చేయడం వల్ల లోపల ఉండే పార్కింగ్ పిన్‌పై ఒక్కసారిగా ఒత్తిడి పడి, అది విరిగిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల భారీ రిపేర్ ఖర్చులు భరించాల్సి వస్తుంది.

ట్రాఫిక్‌లో పదే పదే న్యూట్రల్ చేయడం
ట్రాఫిక్‌లో ఉన్న సమయంలో మాటిమాటికీ న్యూట్రల్ (N), డ్రైవ్ మోడ్‌ల మధ్య మార్చడం మరో బ్యాడ్ ప్రాక్టిసింగ్ అవుతుంది. సిగ్నల్ సమయం తక్కువగా ఉంటే పదే పదే గేర్లు మార్చాల్సిన అవసరం లేదు. పదేపదే గేర్లు మార్చడం వల్ల ట్రాన్స్‌మిషన్‌లోని క్లచ్ ప్యాక్, ఇతర భాగాలు అనవసరంగా అరిగిపోతాయి.

లాంచ్ చేసే ప్రాసెస్ తప్పిదాలు
కొంతమంది డ్రైవర్లు యాక్సిలరేటర్ నొక్కి ఉంచి అకస్మాత్తుగా గేర్ వేస్తుంటారు. ఈ పద్ధతి ఆటోమేటిక్ కార్లకు అస్సలు సెట్ అవ్వదు. దీనివల్ల ట్రాన్స్‌మిషన్‌పై ఒక్కసారిగా కుదుపునకు గురవుతుంది. కాలక్రమేణా గేర్ స్లిప్ అవ్వడం వంటి సమస్యలు మొదలవుతాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
Farmhouse Files: నిజాం కంటే రిచెస్ట్‌గా కేసీఆర్ ఫ్యామిలీ, 111 జీవో భూముల్లోనూ ఫాం హౌస్‌లు: ఎంపీ చామల
నిజాం కంటే రిచెస్ట్‌గా కేసీఆర్ ఫ్యామిలీ, 111 జీవో భూముల్లోనూ ఫాం హౌస్‌లు: ఎంపీ చామల
Sandeep Reddy Vanga : వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్ రెడ్డి వంగా - సీఎం రేవంత్ 'స్పిరిట్' రిప్లై... డైరెక్టర్ వెరీ హ్యాపీ
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్ రెడ్డి వంగా - సీఎం రేవంత్ 'స్పిరిట్' రిప్లై... డైరెక్టర్ వెరీ హ్యాపీ
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
iPhone Voice Control: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
US Iran War Code 100: అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
Embed widget