అన్వేషించండి

Physical Relations Before Marriage: ఇద్దరి సమ్మతితో శారీరక సంబంధం - బెడిసికొడితే రేప్ కేసా? - సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నాక, అది బెడిసికొట్టినంత మాత్రాన అత్యాచారం కింద కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Supreme Court Advises Caution In Physical Relations:  వివాహానికి ముందు శారీరక సంబంధాలు ,నమ్మకం విషయంలో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలతో నమోదైన ఒక అత్యాచార కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దు 

వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు పూర్తిగా అపరిచితులు  అని, అలాంటి సమయంలో శారీరక సంబంధాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది.  మేము పాతకాలపు ఆలోచనల వాళ్లమేమో కానీ.. పెళ్లికి ముందు శారీరక సంబంధంలోకి ఎలా వెళ్తారో మాకు అర్థం కావడం లేదు అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. జీవితంలో ముఖ్యమైన బంధం ఏర్పడకముందే ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని, అప్రమత్తత అవసరమని ధర్మాసనం హితవు పలికింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక బంధం 
  
ఈ కేసులో బాధితురాలు, నిందితుడు 2022లో ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను ఢిల్లీ, దుబాయ్‌లలో ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఏకాంత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే, ఆమె వివాహంపై అంత కట్టుబడి ఉంటే పెళ్లికి ముందే అతనితో కలిసి దుబాయ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. వివాహానికి ముందే అంత దూరం ప్రయాణించడం చూస్తుంటే అది పరస్పర సమ్మతితో కూడిన సంబంధంగానే కనిపిస్తోందని అభిప్రాయపడింది.       

సమ్మతితో కూడిన సంబంధం vs అత్యాచారం 

పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నాక, అది బెడిసికొట్టినంత మాత్రాన అత్యాచారం కింద కేసులు పెట్టడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. కేవలం శారీరక వాంఛ తీర్చుకోవడానికే, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా మోసపూరితంగా హామీ ఇస్తేనే అది రేప్ కిందకు వస్తుందని వివరించింది. సమ్మతితో కూడిన సంబంధాలు విఫలమైనప్పుడు వాటిని నేర శిక్షలకు గురిచేయడం నేర న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
  
ఈ కేసును విచారణ చేసి శిక్షలు విధించే కన్నా, ఇరుపక్షాలను మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వివాహం విషయంలో ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లి అయిందని, మళ్ళీ వేరే వివాహం చేసుకున్నాడని తెలుస్తున్నందున, ఇరుపక్షాల వాదనలను బుధవారం మరోసారి వింటామని పేర్కొంటూ కేసును వాయిదా వేసింది. వ్యక్తిగత సంబంధాలు బెడిసికొట్టినప్పుడు చట్టాన్ని ఆయుధంగా వాడటం కన్నా, సంయమనం పాటించాలని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.                       

    

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget