అన్వేషించండి

సూపర్ ట్యూస్‌డే ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ పోటాపోటీ - అధ్యక్ష ఎన్నికలకు ఇది టీజర్ మాత్రమే!

Super Tuesday: అగ్రరాజ్యంలో సూపర్ ట్యూస్‌ డే పోల్‌లో ట్రంప్‌, బైడెన్ మధ్య గట్టి పోటీ నెలకొంది.

Super Tuesday Polls: ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ ఎన్నికల హడావిడి మొదలైంది. మాజీ అధ్యక్షుడు డొనాల్‌ ట్రంప్‌, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అధ్యక్ష పోటీలో నిలబడే అభ్యర్థికి ప్రతినిధుల మద్దతు అవసరం. అయితే...ఈ రేసులో ఎవరు ఉండాలన్నది నిర్ణయించేదే Super Tuesday Primaries ఎన్నికలు. ఈ పోల్స్‌లో అటు ట్రంప్‌తో పాటు ఇటు బైడెన్ కూడా భారీ విజయం సాధించారు. చాలా వరకూ రాష్ట్రాల్లో ఇద్దరూ పోటాపోటీగా గెలుపొందారు. భారీగా ప్రతినిధుల మద్దతు సంపాదించుకున్నారు. దాదాపు 16 రాష్ట్రాల్లో ఈ సూపర్ ట్యూస్‌డే పోల్స్ జరిగాయి. ఈ ఎన్నికలతో ట్రంప్, బైడెన్ మధ్య గట్టి పోటీ తప్పదని స్పష్టమైంది. వర్జీనియా, నార్త్ కరోలినా, ఒక్లహోమా, టెన్నెస్సేలో ట్రంప్‌ క్లీన్ స్వీప్ చేస్తారని అంచనా వేస్తున్నారు. అటు జో బైడెన్‌కి కూడా ఇక్కడ భారీగానే ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. బైడెన్‌పై పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇజ్రాయేల్‌కి మద్దతునివ్వడంపై కొంత మంది మండి పడుతున్నారు. పలు చోట్ల బైడెన్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఈ నిరసనల మధ్యే పోల్ కొనసాగింది. 

Super Tuesday అంటే ఏంటి..?

సూపర్ ట్యూస్‌డే  ప్రైమరీ పోల్ అంటే...దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని ప్రతినిధులు అధ్యక్ష రేసులో అభ్యర్థులకు ఓటు వేస్తారు. ఏ ఇద్దరు ఈ రేసులో ఉండాలో డిసైడ్ చేసేదే ఈ ప్రైమరీ పోల్. దీన్నే primary and caucuses poll కూడా అంటారు. అలబామా, అలస్కా, అర్కన్సాస్, కాలిఫోర్నియా, మైనే, నార్త్ కరోలినా, టెక్సాస్, వర్జీనియా సహా పలు రాష్ట్రాల్లో ఈ పోలింగ్ జరిగింది. అధ్యక్ష ఎన్నికలకు ప్రీక్వెల్ లాంటివి ఈ పోల్స్. నామినేషన్‌లో ఎవరు గెలుస్తారు..అన్నదీ తేల్చేది ఇవే. 2020లో ఈ ప్రైమరీ పోల్స్‌లో జో బైడెన్ Bernie Sanders ని వెనక్కి నెట్టి 10 రాష్ట్రాల్లో విజయం సాధించారు. 2016లో డొనాల్డ్ ట్రంప్ 8 రాష్ట్రాల్లో గెలిచారు. ఈసారి కూడా బైడెన్‌కి గట్టి పోటీ ఇచ్చి ఈ రేసులో నిలబడ్డారు. 

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లే ఒబామా ఈ సారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారా..? Democratic Party తరపున జో బైడెన్ స్థానంలో ఆమె పోటీ చేయనున్నారా..? ఇటీవల అమెరికాలో జరిగిన ఓ పోల్‌లో ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని చాలా మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. Rasmussen Reports పోల్‌ జరగ్గా డెమొక్రాట్స్‌లో దాదాపు సగం మంది మిషెల్లే ఒబామాకి ఓటు వేశారు. ఈ సారి జో బైడెన్‌ని పక్కన పెట్టి మిషెల్లేకి అవకాశమివ్వాలని సూచించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కి బదులుగా ఇంకెవరిని బరిలోకి దింపితే బాగుంటుందని పోల్ జరిగింది. ఇందులో 48% మంది డెమొక్రాట్‌లు మిషెల్లో ఒబామా పేరు ప్రతిపాదించారు. 38% మంది వ్యతిరేకించారు. కేవలం 33% మంది మాత్రమే ఇది ఎన్నికల ఫలితాల్లో అలజడి సృష్టిస్తుందని వెల్లడించారు. జో బైడెన్‌తో పోల్చి చూస్తే..మిషెల్లే ఒబామాకి 20% ఓట్లు పోల్ అయ్యాయి. 

 Also Read: కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో ఇదే! త్వరలోనే అధికారిక ప్రకటన?

టాప్ హెడ్ లైన్స్

Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget