కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో ఇదే! త్వరలోనే అధికారిక ప్రకటన?
Congress Manifesto 2024: కాంగ్రెస్ త్వరలోనే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది.
Congress Lok Sabha Elections Manifesto 2024: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ హామీలు అందులో చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా యువత, రైతుని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించినట్టు సమాచారం. ప్రస్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. అక్కడే ఈ మేనిఫెస్టోని విడుదల చేసేందుకు అవకాశాలున్నాయి. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, కనీస మద్దతు ధరపై చట్టం చేయడం, మహిళా రిజర్వేషన్‌లు, ముస్లింల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే సచార్ కమిటీ ఏర్పాటు లాంటి హామీలు ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఎగ్జామ్స్‌లో పేపర్ లీక్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకురానున్నట్టు సమాచారం. right to employment కూడా ఇందులో చేర్చనుంది. మధ్యప్రదేశ్‌లోని బదనావర్ ర్యాలీలో రాహుల్ గాంధీ ఈ ఎన్నికల హామీలను వెల్లడించే అవకాశముంది. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఉంటారని సమాచారం. ప్రస్తుతం ఈ మేనిఫెస్టోని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఒక్కసారి ఆమోద ముద్ర పడగానే అధికారికంగా విడుదల చేస్తారు. ఇందులో కీలకంగా 5 అంశాలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ కులగుణన గురించి ప్రస్తావిస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హామీ ఇచ్చింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే హామీ ఇచ్చే అవకాశాలున్నాయి.
మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..
30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
జాబ్ క్యాలెండర్
ఉచితంగా ప్రభుత్వ పరీక్షల దరఖాస్తులు
పేపర్ లీక్స్‌పై కఠిన చర్యలు
అగ్నిపథ్ స్కీమ్ రద్దు
మహిళలకి నెలనెలా రూ.6 వేల ఆర్థిక సాయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్
హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మహిళా జడ్జ్‌ల సంఖ్య పెంచడం
తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్‌ల విక్రయం
కుల ఆధారిత జన గణన
కనీస మద్దతు ధరని చట్టబద్ధం చేయడం
చిరంజీవి స్కీమ్ కింద ఆరోగ్య బీమా
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కి ప్రోత్సాహం
కాంగ్రెస్ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు అసోం ముఖ్యమంత్రి (Himanta Biswa Sarma) హిమంత బిశ్వ శర్మ. త్వరలోనే ఆ పార్టీ జాతీయ హోదా కోల్పోతుందని జోస్యం చెప్పారు. అంతే కాదు. పలు రాష్ట్రాల్లో కేవలం ఓ స్థానిక పార్టీగా మిగిలిపోతుందని స్పష్టం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో NDA 400 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఇక చరిత్రలోనే చదువుకోవాల్సి వస్తుందని సెటైర్లు వేశారు. ఆ పార్టీ పూర్తిగా పతనమైపోయిందని,జాతీయ నాయకత్వం అనేదే లేకుండా పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలకూ క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోందని స్పష్టం చేశారు. 2015 వరకూ కాంగ్రెస్‌లోనే హిమంత బిశ్వ శర్మ ఆ తరవాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయనకు పార్టీలో మంచి గౌరవమే దక్కుతోంది. అంతకు ముందు కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ... ఆ పార్టీపై విమర్శలు చేసే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు హిమంత శర్మ.
Also Read: మా ఇంట్లోనూ బోర్ ఎండిపోయింది, కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్