Karnataka Politics: కర్ణాటకలో ముదురుతున్న రాజకీయం - పట్టు వీడని శివకుమార్ - ఏం జరగబోతోంది?
DK Shivakumar:కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం డీకే శివకుమార్ పూర్తి స్థాయి రాజకీయం చేస్తున్నారు. గతంలో హామీ ఇచ్చినట్లుగా పదవి ఇవ్వాలంటున్నారు.

Karnataka DK Shivakumar is doing full fledged politics for Chief Minister post: కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయం జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2.5 సంవత్సరాల పాలన ముగిసిన సమయంలో, డిప్యూటీ సీఎం డీకేఎస్ శివకుమార్ సపోర్టర్లు ఢిల్లీకి హైకమాండ్‌ను ఒత్తిడి చేస్తున్నారు. సిద్దరామయ్య 5 సంవత్సరాలు తానే ఉంటానని చెబుతున్నారు. కానీ శివకుమార్ అనుచరులు "పవర్ షేరింగ్ ఒప్పందాన్ని పాటించాలి" అంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులో ఉన్నారు . హైకమాండ్ కర్ణాటక ఎమ్మెల్యేలు, మంత్రులకు "అంతర్గత విషయాలపై బహిరంగంగా మాట్లాడవద్దని" ఆదేశాలు జారీ చేసింది. ఈ గందరగోళం మధ్య రెండు క్యాంపులు ఎమ్మెల్యేల మద్దతును సాధించేందుకు పోటీ పడుతున్నాయి.
2.5 సంవత్సరాల రొటేషనల్ ఫార్ములా?
2023 మేలో కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత, సిద్దరామయ్య, డీకేఎస్ శివకుమార్ మధ్య సీఎం పదవికి తీవ్ర పోటీ జరిగింది. హైకమాండ్ సిద్దరామయ్యను సీఎంగా చేసి, శివకుమార్‌ను డిప్యూటీ సీఎంగా, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. అయితే, 2.5 సంవత్సరాల తర్వాత రొటేషనల్ సీఎం ఫార్ములా గురించి ఒప్పందం జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి. నవంబర్ 20, 2025న 2.5 సంవత్సరాలు పూర్తయ్యాయి, దీంతో శివకుమార్ క్యాంప్ ఒత్తిడి పెంచింది. సిద్దరామయ్య ఈ ఫార్ములాను ఖండించి, "నేను పూర్తి 5 సంవత్సరాలు సీఎంగా ఉంటాను" అని ప్రకటించారు.
నవంబర్ 20-21 తేదీల్లో 10-15 మంది ఎమ్మెల్యేలు, మంత్రి ఎన్. చలువరాయస్వామి సహా శివకుమార్ అనుచరులు ఢిల్లీకి వెళ్లి, హైకమాండ్‌ను కలిశారు. వారు "పవర్ షేరింగ్ ఒప్పందాన్ని పాటించాలి, శివకుమార్‌ను సీఎంగా చేయాలి" అని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో సిద్దరామయ్య క్యాంప్ బెంగళూరులో సమావేశాలు నిర్వహించి, మద్దతును బలోపేతం చేసుకుంది.
"All 140 MLAs are eligible to become ministers, CM. They can become everything...CM has said that he will complete 5 years. I wish him all the best. We will all work with him."
— BhikuMhatre (@MumbaichaDon) November 21, 2025
Is DKS getting sarcastic? If so....it's a big trouble for Karnataka CONgress. Rest...If U Know U know. pic.twitter.com/LH1cMXzvKq
పార్టీ అధ్యక్షుడు ఖర్గే బెంగళూరులో ఉండటంతో స్పెక్యులేషన్లు మరింత పెరిగాయి. ఖర్గే, సిద్దరామయ్య, శివకుమార్‌తో మాట్లాడినట్లు చెబుతున్నారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తామని అటు సిద్ధరామయ్య, ఇటు శివకుమార్ కూడా ప్రకటించారు. సిద్దరామయ్య క్యాంప్‌లో 70-80 మంది ఎమ్మెల్యేలు, శివకుమార్ క్యాంప్‌లో 50-60 మంది ఉన్నట్లు అంచనా. రెండు వర్గాలు ఎమ్మెల్యేల మద్దతును సాధించేందుకు లాబీ చేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. శివకుమార్ తనకు పీసీసీ చీఫ్ పదవి వద్దని చెబుతున్నారు. పార్టీ హైకమాండ్ మాత్రం.. సీఎం మార్పు విషయంలో సుముఖంగా లేదని చెబుతున్నారు. కానీ సిద్ధరామయ్యను ఎలా సంతృప్తి పరుస్తారన్నదే కీలకం.





















