అన్వేషించండి

Supreme Court: మగాళ్లూ బుద్ధి తెచ్చుకోండి, ముస్లిం మహిళల భరణం విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Muslim Women: ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భరణం పొందేందుకు వాళ్లూ అర్హులేనని తేల్చి చెప్పింది.

Supreme Court on Muslim Women Alimony: ముస్లింల భరణంపై  సుప్రీంకోర్టు సంచలన తీర్పు చేసింది. విడాకులు తీసుకున్న ఓ ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందే హక్కు ఉందని తేల్చి చెప్పింది. Code of Criminal Procedure లోని సెక్షన్ 125 అందుకు అవకాశం కల్పిస్తుందని స్పష్టం చేసింది. విడాకుల తరవాత మహిళలు భరణం తీసుకునేందుకు అర్హులేనని వెల్లడించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టైన్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. భార్యతో విడాకులు తీసుకున్న తరవాత భరణం ఇవ్వాలని ఆదేశాలివ్వడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌ విచారించిన కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఆ పిటిషన్‌ని కొట్టి వేసింది. మతాలతో సంబంధం లేకుండా భరణం పొందే హక్కు ప్రతి మహిళకీ ఉంటుందని స్పష్టం చేసింది. భరణం అనేది ఏమీ విరాళం కాదని మండిపడింది. అది పెళ్లైన ప్రతి మహిళ హక్కు అని స్పష్టం చేసింది. 

"ఇంటిపట్టున ఉండే భార్య తమపైనే ఆధారపడి ఉంటుందన్న కనీస ఇంగితం కూడా కొంతమంది భర్తలకు ఉండడం లేదు. ఎమోషనల్‌గా కూడా అలాంటి మహిళలు భర్తపైనే ఆధారపడి ఉంటారు. ఇప్పటికైనా హౌజ్‌వైఫ్‌ల విలువని, వాళ్లెంత త్యాగాన్ని చేస్తున్నారో పురుషులు అర్థం చేసుకోవాలి"

- సుప్రీంకోర్టు

ఇంటిపట్టునే ఉండి పనులన్నీ చేసుకునే మహిళలను ఉద్దేశించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తలు తమ భార్యలకు ఆర్థిక సాయం అందించాల్సిన బాధ్యత ఉందని తేల్చి చెప్పింది. జాయింట్ బ్యాంక్ అకౌంట్‌లు మెయింటేన్ చేయాలనీ సూచించింది. వాళ్ల ఆర్థిక స్థిరత్వానికి భరోసా కల్పించాలని అభిప్రాయపడింది. ఈ తీర్పుని పలు పార్టీల నేతలు సమర్థిస్తున్నారు. ముస్లిం మహిళల హక్కులని కాపాడాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు.

"భర్తలందరూ తమ భార్యలకు ఆర్థికంగా తోడ్పాటునందించాల్సిన అవసరం, బాధ్యత ఉన్నాయి. జాయింట్ బ్యాంక్ అకౌంట్‌ ఉండి తీరాలి. వాళ్లకి ATM కార్డ్‌ల యాక్సెస్ కూడా ఇవ్వాలి. వాళ్ల ఆర్థికంగా నిలదొక్కుకునేలా అన్ని విధాలుగా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత భర్తలదే. మతాలతో సంబంధం లేకుండా అందరూ కచ్చితంగా భార్యకి భరణం ఇవ్వాల్సిందే"

- సుప్రీంకోర్టు

Also Read: Patanjali Products: పతంజలి ఉత్పత్తుల విక్రయాలు బంద్‌, సంచలన నిర్ణయం తీసుకున్న సంస్థ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Embed widget