అన్వేషించండి

Baby in Well : ఈ పసికందు మృత్యుంజయుడు - కోతి బావిలో పడేసినా.. ప్రాణాలు కాపాడిన డైపర్ !

Monkey throws baby into well:ఓ కోతి .. తన కోతి చేష్టలతో పిల్లవాడి ప్రాణం మీదకు తెచ్చింది. చివరికి ఆ పిల్లవాడి డైపర్ ప్రాణాల్ని కాపాడింది.

Diaper keeps 20 day old baby from drowning:  అద్భుతాలు సినిమాల్లోనే జరుగుతూ ఉంటాయి.  కానీ కొన్ని నిజంగానే జరుగుతాయి. అలాంటి ఘటనే ఇది. ఇరవై ఏళ్ల చిన్నారిని డైపరే కాపాడింది. 

ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లా సియోని గ్రామంలో ఊహించని అద్భుతం జరిగింది. మృత్యువు అంచుల్లోకి వెళ్లిన ఒక 20 రోజుల పసికందు కేవలం తను వేసుకున్న డైపర్  కారణంగా ప్రాణాలతో తిరిగి వచ్చింది.  సునీత అనే మహిళ తన పసిబిడ్డకు పాలు ఇస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన కోతుల గుంపు ఆమెపై దాడి చేసింది. ఈ క్రమంలో ఒక కోతి ఆమె ఒడిలోని పసిబిడ్డను బలవంతంగా లాక్కెళ్లి ఇంటి పైకప్పు మీదికి పారిపోయింది. భయాందోళనకు గురైన తల్లి, గ్రామస్థులు కేకలు వేస్తూ కోతిని వెంబడించడంతో, కంగారుపడ్డ ఆ కోతి పక్కనే ఉన్న ఒక లోతైన బావిలోకి చిన్నారిని విసిరేసి పారిపోయింది.

పసిబిడ్డ బావిలో పడటంతో అంతా ప్రాణాలు పోయాయని భావించారు. కానీ, అద్భుతమనేలా ఆ పసికందు నీటిలో మునగకుండా పైనే తేలుతూ కనిపించింది. వెంటనే గ్రామస్థులు బకెట్ సాయంతో చిన్నారిని బయటకు తీశారు. దాదాపు పది నిమిషాల పాటు చిన్నారి నీటిపై తేలియాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై స్థానిక నర్సు రాజేశ్వరి  పాపకు వేసిన డైపర్ లోపల గాలి ఉండటం వల్ల అది ఒక  లైఫ్ జాకెట్ లా పనిచేసిందని, దానివల్ల పాప నీటిలో మునిగిపోకుండా తేలిందని వివరించారు. డైపరే ఈ చిన్నారి ప్రాణాలను కాపాడిందని ఆమె పేర్కొన్నారు.

బావి నుంచి బయటకు తీసిన సమయంలో శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటాన్ని గమనించిన నర్సు రాజేశ్వరి, వెంటనే సీపీఆర్  అందించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం చిన్నారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమయానికి నర్సు అక్కడ ఉండటం, డైపర్ కారణంగా చిన్నారి తేలడం వల్లే పునర్జన్మ లభించిందని తండ్రి అరవింద్ రాథోడ్ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.     

 ఈ ఘటన స్థానిక అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తమ ప్రాంతంలో కోతులు, అడవి జంతువుల దాడులు నిత్యకృత్యంగా మారాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. జనావాసాల్లోకి అడవి జంతువులు రాకుండా చర్యలు తీసుకోవాలని, చిన్నపిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


 

 

టాప్ హెడ్ లైన్స్

Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
Embed widget