అన్వేషించండి

SUV దూకుడు కంటిన్యూ చేస్తున్న టాటా - Sierra EV నుంచి కొత్త Nexon వరకు 4 మోడళ్లు రెడీ

2026లో భారత్‌లో టాటా మోటార్స్‌ 4 కొత్త SUVలను లాంచ్‌ చేయనుంది. ఇందులో 3 ఎలక్ట్రిక్‌ మోడళ్లు, 1 పెట్రోల్‌ SUV ఉన్నాయి. Sierra EV, Punch EV ఫేస్‌లిఫ్ట్‌, Avinya, కొత్త Nexon వీటిలో కీలకం.

Tata SUVs 2026 India: భారత ఆటో మార్కెట్‌లో టాటా మోటార్స్‌ దూకుడు తగ్గేలా కనిపించడం లేదు. 2025లో వరుసగా వచ్చిన కొత్త లాంచ్‌లతో మంచి ఊపులో ఉన్న టాటా, అదే జోరును 2026లో కూడా కొనసాగించేందుకు భారీ ప్లాన్స్‌ సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవడమే లక్ష్యంగా టాటా నాలుగు కొత్త SUVలను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇందులో మూడు ఎలక్ట్రిక్‌ SUVలు, ఒక ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌ (ICE) మోడల్‌ ఉండటం విశేషం.

Tata Sierra EV

టాటా ఐకానిక్‌ Sierra పేరుతో ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అదే Sierraని పూర్తిగా ఎలక్ట్రిక్‌ రూపంలో 2026 ప్రారంభంలో లాంచ్‌ చేయడానికి టాటా సిద్ధమవుతోంది. ఈ Sierra EV, Harrier EVతో చాలా అంశాల్లో పోలిక కలిగి ఉండనుంది. రెండు బ్యాటరీ ఆప్షన్లతో రానున్న ఈ SUV, ఒక్కసారి చార్జ్‌ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ ఇవ్వగలదని అంచనా. డిజైన్‌, ఇంటీరియర్‌లో ప్రత్యేకమైన టచ్‌లతో ICE వెర్షన్‌ నుంచి స్పష్టంగా భిన్నంగా ఉండనుంది.

Tata Punch EV Facelift

భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్‌ కార్లలో Punch EV ఒకటి. ఇప్పుడు దీనికి ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను 2026 రెండో లేదా మూడో త్రైమాసికంలో తీసుకురావాలని టాటా భావిస్తోంది. కొత్త Punch EVలో బయట లుక్‌లో మార్పులు, ఇంటీరియర్‌లో అప్‌డేట్స్‌ ఉంటాయి. అంతేకాదు, పెద్ద బ్యాటరీ ఆప్షన్‌ ఇవ్వడం ద్వారా రేంజ్‌ను మరింత మెరుగుపరచే అవకాశం ఉంది. నగర వినియోగదారులకు ఇది మరింత ఆకర్షణీయంగా మారనుంది.

Tata Avinya

టాటా నుంచి రాబోతున్న అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్‌ సిరీస్‌ Avinya. జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (Jaguar Land Rover)కు చెందిన EMA ప్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్న ఈ మోడల్‌ 2026లో భారత్‌లో అడుగుపెట్టనుంది. ముందుగా స్పోర్ట్‌బ్యాక్‌ డిజైన్‌తో Avinya లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. తరువాత SUV, MPV తరహా బాడీ స్టైల్స్‌ కూడా రావొచ్చు. ప్రీమియం సెగ్మెంట్‌లో టాటాకు ఇది గేమ్‌ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది.

New Tata Nexon

టాటా విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న Nexonకు మూడో తరం వెర్షన్‌ కూడా రెడీ అవుతోంది. అంతర్గతంగా ‘Garud’ అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న ఈ SUV, 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలో లాంచ్‌ కావచ్చు. పూర్తిగా కొత్త డిజైన్‌, రివైజ్‌ చేసిన ఇంటీరియర్‌తో పాటు, ఇంజిన్‌, ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలోనూ మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో రేంజ్‌ పెంపుపై కూడా టాటా దృష్టి పెట్టింది.

మొత్తానికి, 2026 టాటా SUVల ఏడాదిగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని క్యాష్‌ చేసుకునేలా టాటా వ్యూహం సిద్ధం చేసుకుంది. Tata SUV కొనాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ సంవత్సరం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Honda CBR1000RR-R Fireblade: 2026, 2027 మోడళ్ల మధ్య తేడాలేంటి? కొత్తగా ఏ మారింది?
కొత్త లుక్‌తో తిరిగొచ్చిన హోండా ఫైర్‌బ్లేడ్.. బరువు తగ్గించి, టార్క్ పెంచిన కంపెనీ!
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!
Vehicle VIP Number: 9999, 0001 వంటి ఫ్యాన్సీ నంబర్లు పొందడం ఎలా? Parivahan పోర్టల్‌లో అప్లై చేసుకునే విధానం ఇదిగో
మీ కారు లేదా బైక్‌కు VIP నంబర్ కావాలా? ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి!
Maruti Car Diwali Offers: మారుతి కార్లపై నవంబర్ ఆఫర్లు.. Wagon R, Alto K10 సహా చాలా మోడళ్లపై రూ.1.51 లక్షల వరకు డిస్కౌంట్లు!
మారుతి కార్లపై భారీగా పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.51 లక్షల వరకు ప్రయోజనాలు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget