Saree No Entry : "చీర" దెబ్బకు దివాలా ! ఆ రెస్టారెంట్ శారీకి సారీ చెప్పకపోతే ఇక అంతే సంగతులు ...
చీర కట్టుకుని వస్తే తమ రెస్టారెంట్‌లోకి అనుమతి లేదని ఆ హోటల్ అడ్డుకుంది. బాధిత యువతి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే సీన్ మారిపోయింది.
గౌరవప్రదమైన వస్త్రధారణ అంటే మన దేశంలో మొట్ట మొదటగా ఏం చెబుతారు ?. పురుషులకైతే ప్యాంట్ , షర్ట్, మహిళలకైతే నిర్మోహమాటంగా చీర అనే చెబుతారు. చీర అనేది భారతీయ మహిళలకే సొంతమైన సంప్రదాయమైన వస్త్రధారణ. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. చీరకట్టుకుంటే తమ హోటళ్లలోకి రానివ్వబోమని నిర్మోహమాటంగా చెబుతున్నారు. ఇలా చెప్పిన ఓ రెస్టారెంట్ కథ ఇప్పుడు కంచికి చేరుతోంది.
Saree is not allowed in Aquila restaurant as Indian Saree is now not an smart outfit.What is the concrete definition of Smart outfit plz tell me @AmitShah @HardeepSPuri @CPDelhi @NCWIndia
— anita choudhary (@anitachoudhary) September 20, 2021
Please define smart outfit so I will stop wearing saree @PMishra_Journo #lovesaree pic.twitter.com/c9nsXNJOAO
Also Read : హైవేపై కండోమ్ కేసులో కళ్లుచెదిరే ట్విస్ట్.. సొరంగంలో శృంగార భోగాలు!
ఢిల్లీలో అక్విలా అనే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ కొన్ని పద్దతుల్ని పెట్టుకుంది. అంటే సంప్రదాయమైన వస్త్రధారణ ఉన్న వారినే అనుమతిస్తారన్నమాట. అంత వరకూ బాగానే ఉంది. కానీ వారి సంప్రదాయమైన వస్త్రధారణ జాబితాలో చీర లేదు. అదే ఇప్పుడు వివాదానికి కారణం అయింది. ఓ యువతి అక్విల్ హోటల్ ఎంట్రన్స్‌లో హోటల్ సిబ్బందిని చీర కట్టుతో ఉన్న వారిని ఎందుకు అనుమతించడం లేదు అని ప్రశ్నించింది. దానికి ఆ ఉద్యోగి "చీర స్మార్ట్ క్యాజువల్స్‌గా పరిగణించబడదు" అని సమాధానం చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Covaxin for kids: చిన్నారులకు కొవాగ్జిన్ టీకా.. శుభవార్త చెప్పిన భారత్ బయోటెక్
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన యువతి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన చీర ఇప్పుడు సంప్రదాయ దుస్తుల జాబితాలో లేదని .. అసలు సంప్రదాయ దుస్తులు అంటే ఏమిటని ఆమె ప్రశ్నించింది. ఆ సంప్రదాయ దుస్తులు.. గౌరవనీయమైన దుస్తులు ఏమిటో చెబితే తాను చీర కట్టుకోవడం మానేస్తానని ఆమె తన ట్వీట్‌లో ప్రకటించారు. అనితా చౌదరి అనే ఆ మహిళ ట్వీట్ వైరల్ అయిపోయింది. అనేక మంది ఇది భారతీయ, సంస్కృతి సంప్రదాయాలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నారు. రెస్టారెంట్‌పై విరుచుకుపడుతున్నారు. [tw]
Waise what are smart casuals? Are there stupid casuals too 😬? I hope people don't expect the gormint to solve this issue too. This can easily be fixed with market forces. Just boycott this shit place and give them poor ratings. I've seen people wearing torn pants. Smart casuals? https://t.co/TjEGuHgRJc
— कुशल मेहरा (@kushal_mehra) September 22, 2021
హోటల్‌లో ఎలాంటి డ్రెస్‌కోడ్‌తో రావాలనేది వారి ఇష్టం అని అయితే చీర కట్టును అనుమతించకపోవడం దారుణం అన్న అభిప్రాయాలు నెటిజన్లలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మంచి రెస్టారెంట్‌గా పేరున్న అక్విలాకు ఇప్పుడు రేటింగ్‌లు పూర్తిగా తగ్గిపోయాయి. గూగుల్‌లో ఒకటిన్నర శాతం.. జొమాటో రెండు శాతం మాత్రమేఉంటున్నాయి. సమీక్షల్లో అందరూ నెగెటివ్‌గా రాస్తున్నారు. తప్పు ఎక్కడ జరిగిందో కానీ ఆ రెస్టారెంట్ మాత్రం చీర దెబ్బకు కుదేలైపోతోంది.
— Shubhendu (@BBTheorist) September 21, 2021