అన్వేషించండి

Dalai Lama: చైనాకు గట్టి షాక్ ఇచ్చిన దలైలామా, మంగోలియా బాలుడికి కీలక పదవి

Dalai Lama: టిబెటియన్ బుద్ధిజం లీడర్లలో మూడో అత్యున్నత పదవికి ఓ 8 ఏళ్ల బాలుడిని నియమించారు దలైలామా.

Dalai Lama:

ధర్మశాలలో కార్యక్రమం..

దలైలామా చైనాకు గట్టి షాకే ఇచ్చారు. బుద్ధిజంలో మూడో అత్యున్నత పదవికి మంగోలియాకు చెందిన ఓ 8 ఏళ్ల బాలుడిని నియమించారు. అమెరికాలో పుట్టి పెరిగిన మంగోలియా బాలుడికి ఈ పదవి కట్టబెట్టడం సంచలనంగా మారింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు దలైలామా. 600 మంది మంగోలియన్ల సమక్షంలో ఈ విషయం వెల్లడించారు. ఖల్కా జెస్టన్ దంపా...ఈ బాలుడి రూపంలో మళ్లీ జన్మించారని అన్నారు. పదో ఖల్కా జెస్టన్‌ దంపాగా బాలుడిని నియమిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం దలైలామా వయసు 87 ఏళ్లు. తదుపరి దలైలామా ఎవరు అన్న చర్చ ఎంతో కాలంగా కొనసాగుతోంది. దీనిపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టతనివ్వడం లేదు. ఈలోగా టిబెటన్ బుద్ధిజంలో కీలక పదవిగా భావించే స్థానంలో బాలుడిని కూర్చోబెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆ బాలుడితో దలైలామా కలిసి ఉన్న  ఫోటో వైరల్ అవుతోంది. ఈ బాలుడు...మంగోలియా పార్లమెంట్ మాడీ సభ్యుడి మనవడు అని అక్కడి మీడియా వెల్లడించింది. ఈ నిర్ణయంపై చైనా మండి పడుతున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా దలైలామా, చైనా మధ్య ఘర్షణ కొనసాగుతోంది. తమ ప్రభుత్వం గుర్తించిన వ్యక్తినే బుద్ధిజం లీడర్‌గా పరిగణిస్తామని తేల్చి చెబుతోంది. కానీ దలైలామా మాత్రం చైనా డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. 

చైనాపై వ్యతిరేకత...

చైనా తదుపరి దలైలామాను ఎన్నుకునే యోచనలో ఉందన్న వార్త అలా బయటకు వచ్చిందో లేదో...వెంటనే బుద్ధ సంఘాలు తీవ్రంగా విమర్శలు మొదలు పెట్టాయి. దలైలామా ఎంపిక విషయంలో చైనా జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశాయి. భారత్‌లోని బౌద్ధ సంస్థలన్నీ ఇదే మాటను ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల బౌద్ధ సంఘాలు చైనాకు వ్యతిరేకంగా నిరనసలూ చేపడుతున్నాయి. తన తరవాత ఎవరు ఆ పదవిలో ఉండాలన్నది దలైలామా మాత్రమే నిర్ణయిస్తారని తేల్చి చెప్పాయి. అయితే అటు చైనా మాత్రం తరవాతి దలైలామాను ఎంచుకునే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఈ విషయంలో రాజీ పడేదే లేదని తేల్చి చెబుతోంది. నిజానికి...టిబెట్‌ చైనాలో 
భాగమే అని డ్రాగన్ ఎప్పటి నుంచో మొండిగా వాదిస్తోంది. అందుకే...దలైలామా విషయంలో తమ నిర్ణయమే నెగ్గాలని భావిస్తోంది. ఇదే సమయంలో దలైలామా మాత్రం స్వతంత్ర టిబెట్‌ కోసం ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి దలైలామాను ఎంపిక చేసుకోవడంలో చైనా విఫలమైతే...టిబెట్‌ను దక్కించుకోవడమూ అంత సులభం కాదు. అందుకే అంత పంతంగా ఉంది డ్రాగన్. మరోవైపు లద్దాఖ్ నుంచి ధర్మశాల వరకూ బౌద్ధ సంఘాలు చైనా వైఖరిని తప్పు బడుతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థలన్నీ చైనాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దలైలామాను ఎంచుకునే హక్కు టిబెట్‌కే ఉంటుంది. ఈ మేరకు అమెరికా, టిబెట్ మధ్య ఓ ఒప్పందమూ కుదిరింది. చైనా మాత్రం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సమయంలో దలైలామా తీసుకున్న నిర్ణయం చైనాకు ఆగ్రహం కలిగించే అవకాశముంది. 

Also Read: సావర్కర్‌ను అవమానిస్తారా, మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం - రాహుల్‌పై ఠాక్రే ఆగ్రహం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan About Vizag Steel plant: జనసేన పోరాటంతో ఆగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన పోరాటంతో ఆగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ- పవన్ కళ్యాణ్
Telangana Assembly Session: తెలంగాణలో ఆసక్తిగా మారిన ఆదివారం అసెంబ్లీ ! వ్యూహాలకు పదునుపెట్టిన అధికార, విపక్ష పార్టీలు
తెలంగాణలో ఆసక్తిగా ఆదివారం అసెంబ్లీ ! వ్యూహాలకు పదునుపెట్టిన అధికార, విపక్ష పార్టీలు
Balakrishna: బాలయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరుదైన గౌరవం - భారతీయ చిత్ర పరిశ్రమలో ఫస్ట్ హీరోగా...
బాలయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరుదైన గౌరవం - భారతీయ చిత్ర పరిశ్రమలో ఫస్ట్ హీరోగా...
Telugu TV Movies Today: చిరంజీవి ‘స్టాలిన్’, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ to అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ వరకు - ఈ ఆదివారం (ఆగస్ట్ 31) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘స్టాలిన్’, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ to అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ వరకు - ఈ ఆదివారం (ఆగస్ట్ 31) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Advertisement

వీడియోలు

Rohit Sharma Undergo Bronco Test | హిట్ మ్యాన్ ను క్రికెట్ కు దూరం చేసేలా బీసీసీఐ | ABP Desam
PV Sindhu Lost World Championship | పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ ఓడిన సింధు | ABP Desam
Harbhajan Singh Sreesanth slapgate | ఐపీఎల్ చరిత్రలో కీలకమైన వీడియో లీక్ చేసిన లలిత్ మోదీ | ABP Desam
Ashwin on IPL Retirement and Dhoni | రెండు నెలల IPL కోసం..10నెలల వెయిటింగ్ నావల్ల కాదు | ABP Desam
Chiranjeevi Met his Adoni Fan | తన అభిమాని పిల్లల్ని చదివిస్తానని మాటిచ్చిన చిరంజీవి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan About Vizag Steel plant: జనసేన పోరాటంతో ఆగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన పోరాటంతో ఆగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ- పవన్ కళ్యాణ్
Telangana Assembly Session: తెలంగాణలో ఆసక్తిగా మారిన ఆదివారం అసెంబ్లీ ! వ్యూహాలకు పదునుపెట్టిన అధికార, విపక్ష పార్టీలు
తెలంగాణలో ఆసక్తిగా ఆదివారం అసెంబ్లీ ! వ్యూహాలకు పదునుపెట్టిన అధికార, విపక్ష పార్టీలు
Balakrishna: బాలయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరుదైన గౌరవం - భారతీయ చిత్ర పరిశ్రమలో ఫస్ట్ హీరోగా...
బాలయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరుదైన గౌరవం - భారతీయ చిత్ర పరిశ్రమలో ఫస్ట్ హీరోగా...
Telugu TV Movies Today: చిరంజీవి ‘స్టాలిన్’, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ to అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ వరకు - ఈ ఆదివారం (ఆగస్ట్ 31) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘స్టాలిన్’, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ to అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ వరకు - ఈ ఆదివారం (ఆగస్ట్ 31) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Maruti Hybrid Car: మారుతి చౌకైన హైబ్రిడ్ కారు రాబోతోంది, లీటరుకు 30 కిలోమీటర్లు నడుస్తుంది, ధర ఇంతే!
మారుతి సెన్సేషన్‌! లీటరుకు 30 కిలోమీటర్లు ఇచ్చే చౌకైన హైబ్రిడ్‌ కార్‌ రాబోతోంది
September 2025 Bank Holidays: సెప్టెంబర్ నెలలో సెలవుల సందడి.. 15 రోజుల వరకు బ్యాంకులకు సెలవులు.. పూర్తి జాబితా
సెప్టెంబర్‌లో సెలవుల సందడి.. 15 రోజుల వరకు బ్యాంకులకు సెలవులు.. పూర్తి జాబితా
Pressure Cooker : ప్రెషర్ కుక్కర్ ఎన్నేళ్లు వాడితే ప్రమాదం.. మార్చకపోతే పిల్లలు, పెద్దలకు వచ్చే ఆరోగ్య సమస్యలివే
ప్రెషర్ కుక్కర్ ఎన్నేళ్లు వాడితే ప్రమాదం.. మార్చకపోతే పిల్లలు, పెద్దలకు వచ్చే ఆరోగ్య సమస్యలివే
Kerala Cricket League: డొమెస్టిక్ క్రికెట్‌లో 12 బంతుల్లో 11 సిక్సర్లు.. ఐపీఎల్ బౌలర్‌ను సైతం ఉతికారేశాడు
డొమెస్టిక్ క్రికెట్‌లో 12 బంతుల్లో 11 సిక్సర్లు.. ఐపీఎల్ బౌలర్‌ను సైతం ఉతికారేశాడు
Embed widget