అన్వేషించండి

Nalgonda Crime News: దేవరకొండలో లాకప్‌డెత్‌- స్థానిక ఎంపీటీసీ, ఎస్సై చుట్టూ తిరుగుతున్న వివాదం

Lockup Death At Chintapalli: అన్నదమ్ముల మధ్య ఉన్న భూవివాదం రాజకీయ జోక్యంతో స్టేషన్‌కు వెళ్లింది. ఇది ఇప్పుడు ఓ కుటుంబంలో విషాదం నింపింది.

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి పీఎస్‌లో లాకప్ దెత్ సంచలనంగా మారుతోంది. అన్నదమ్ముల భూముల పంచాయతీలో స్థానిక నాయకుల జోక్యం చేసుకోవడంతో వివాదం చావు వరకు వెళ్లింది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణమైన వ్యక్తి కాంగ్రెస్ నేతని ఓ వర్గం అంటుంటే కాదు ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ లీడర్‌గా మరికొందరు చెప్పుకుంటున్నారు. 

అన్నదమ్ముల మధ్య ఉన్న భూవివాదం రాజకీయ జోక్యంతో స్టేషన్‌కు వెళ్లింది. ఇది ఇప్పుడు ఓ కుటుంబంలో విషాదం నింపింది. పాలెం తండాకు చెందిన సూర్యనాయక్‌ అనే వ్యక్తికి తన సొదరిడితో భూ వివాదం ఉంది. ఇందులో స్థానిక ఎంపీటీసీ వసంత్‌ నాయక్‌ జోక్యం చేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయన జోక్యంతోనే సూర్యనాయక్‌ను పోలీసులు తీసుకెళ్లాలని చెబుతున్నారు. 

ఎంపీటీసీ ఒత్తిడితోనే సూర్యను తీసుకెళ్లిన పోలీసులు చావబాదారని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబం, ఆయన బంధువులు, చింతపల్లి ఎస్సై సతీష్‌రెడ్డి కొట్టిన దెబ్బలకు సూర్యనాయక్‌ స్టేషన్‌లోనే చనిపోయినట్టు చెబుతున్నారు. విషయాన్ని బయటకు పొక్కనీయకుండా పోలీస్‌ వాహనంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లారని అంటున్నారు. దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేసరికి చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారని చెబుతున్నారు. 

సూర్య చనిపోయిన విషయాన్ని బంధువులకు తెలియజేసి... వాళ్లు వచ్చే లోపు హడావుడిగా పోస్టుమార్టం చేయబోయని ఆరోపిస్తున్నారు బంధువులు. వారు వచ్చి ఆ ప్రక్రియను ఆపేశారని అంటున్నారు. ఎంపీటీసీ వసంత్‌ నాయక్‌ దగ్గరుండి ఎస్సైతో కొట్టించారని విమర్శిస్తున్నారు. ఇందులో సూర్య తప్పులేకపోయినా బీఆర్‌ఎస్‌ లీడర్‌ కొడుకున్న అన్న కారణంతోనే ఇదంతా చేయిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు కారణమైన ఎస్సై సతీష్‌ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget