Covid 19 Vaccine Export: భారత ఆరోగ్యమంత్రికి డబ్ల్యూహెచ్ఓ కృతజ్ఞతలు.. కారణమిదే
కేంద్ర ఆరోగ్యమంత్రి మనుసుఖ్ మాండవీయపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు కురిపించింది. టీకా ఎగుమతులకు భారత్ మళ్లీ పచ్చజెండా ఊపడమే ఇందుకు కారణం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ).. భారత ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయను ప్రశంసించింది. అక్టోబర్ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌లను ఎగుమతి చేయనున్నట్లు ఇటీవల భారత్ ప్రకటించడంపై డబ్ల్యూహెచ్ఓ కృతజ్ఞతలు తెలిపింది. ప్రపంచానికి టీకాలను ఎగుమతి చేస్తామని చెప్పి భారత్ ఉదారతను చాటిందని ఆరోగ్యసంస్థ పేర్కొంది.
Thank you Health Minister @mansukhmandviya for announcing #India will resume crucial #COVID19 vaccine shipments to #COVAX in October. This is an important development in support of reaching the 40% vaccination target in all countries by the end of the year. #VaccinEquity
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) September 21, 2021
కరోనా టీకా ఉత్పత్తి, వ్యాక్సినేషన్‌లో భారత్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. మన దేశాలు టీకాలు తయారైన సందర్భంలోనే పలు దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. ఏప్రిల్‌లో కరోనా రెండో దశ ప్రారంభం కావడం వల్ల 'వ్యాక్సిన్ మైత్రి'కి బ్రేక్ పడింది. .స్వదేశంలో వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టింది. ముందుగా స్వదేశీ అవసరాలను తీర్చిన తర్వాతే మళ్లీ ఎగుమతి చేస్తామని ప్రకటించింది. అయితే ఇటీవల వ్యాక్సినేషన్‌లో రికార్డ్ సృషిస్తోన్న భారత్.. మరోసారి టీకా ఎగుమతులకు ఓకే చెప్పింది.
Also Read:Saree No Entry : "చీర" దెబ్బకు దివాలా ! ఆ రెస్టారెంట్ శారీకి సారీ చెప్పకపోతే ఇక అంతే సంగతులు ...
అక్టోబర్ నెల నుంచి టీకాలు ఎగుమతి చేస్తామని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకటించారు. దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన టీకాలను వ్యాక్సిన్ మైత్రి, కొవాక్స్‌కు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read: Afghanistan Taliban Rule: 'ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి'.. ఐరాసకు తాలిబన్ల లేఖ