By: Ram Manohar | Updated at : 01 Jan 2023 11:46 AM (IST)
విదేశీ ప్రయాణికుల విషయంలో కెనడా కూడా అప్రమత్తమైంది.
Covid 19 Canada:
కొవిడ్ టెస్ట్ తప్పనిసరి..
చైనాలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రోజూ లక్షలాది మంది కొవిడ్ బారిన పడుతున్నారు. మృతుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది. చైనాలో పరిస్థితులు చూసి ప్రపంచమంతా భయపడుతోంది. మరోసారి కొవిడ్ సునామీ తప్పదేమో అని ఆందోళన చెందుతోంది. ఒక్కో దేశమూ అప్రమత్తమవుతున్నాయి.విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కెనడా కూడా ఈ దేశాల జాబితాలో చేరిపోయింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా పెడుతోంది. ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులెవరైనా తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని తేల్చి చెప్పింది. చైనాతో పాటు హాంగ్‌కాంగ్, మకావ్ దేశాల నుంచి
వచ్చే ప్రయాణికులు కరోనా పరీక్ష చేయించుకోవాలని వెల్లడించింది. జనవరి 5వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. కెనడాకు వచ్చే ముందు టెస్ట్ చేయించుకుని నెగటివ్ రిపోర్ట్‌ను చూపించాల్సి ఉంటుంది. అలా అయితేనే...ఫ్లైట్ ఎక్కనిస్తారు. ఇక మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ల ట్రావెల్ హిస్టరీని ఆరా తీస్తున్నారు అధికారులు. గత 10 రోజుల్లో చైనా, హాంగ్‌కాంగ్, మకావ్ దేశాలకు ఎవరైనా పర్యటించారా అని సమాచారం సేకరిస్తున్నారు. ఈ హిస్టరీ ఉన్న వాళ్లను క్వారంటైన్‌కు పంపనున్నారు. అయితే...రోడ్డు మార్గం ద్వారా వచ్చే వాళ్లకు మాత్రం ఈ రూల్స్ వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు బ్రిటన్ కూడా ఇదే తరహాలో నిబంధనలు విధించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల కొవిడ్ టెస్ట్ రిపోర్ట్ అడుగుతోంది. జనవరి 5 నుంచి ఈ రూల్ ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఫ్రాన్స్ కూడా చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తోంది. 48 గంటల ముందే కరోనా టెస్ట్ చేయించుకోవాలని తేల్చి చెప్పింది.
భారత్‌లోనూ..
చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో ఫ్లైట్ ఎక్కే ముందే ఈ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్‌ని Air Suvidha పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయా ట్విటర్ వేదికగా ప్రకటించారు. "చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే వాళ్లు RT PCR టెస్ట్‌లు కచ్చితంగా చేయించుకోవాలి. 2023 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది" అని ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇండియాకు వచ్చాక ఎయిర్‌పోర్ట్ వద్ద కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ చూపించాలన్న రూల్ ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఇక్కడ టెస్ట్ చేశాక పాజిటివ్ వస్తే నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కానీ... ఇప్పుడు ఫ్లైట్ ఎక్కే ముందే...పోర్టల్‌లో రిపోర్ట్ అప్‌లోడ్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !
TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు
Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌గా భారతి హోళికేరి
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !