By: Ram Manohar | Updated at : 30 Dec 2022 03:06 PM (IST)
18 మంది చిన్నారులను బలి తీసుకున్న దగ్గు మందు తయారీని అధికారులు నిలిపివేశారు.
Cough Syrup Deaths:
నోయిడాలో యూనిట్..
భారత్‌కు చెందిన సంస్థ తయారు చేసిన సిరప్ తాగి ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. దీనిపై కేంద్రం వెంటనే అప్రమత్తమైంది. పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ్ కీలక ప్రకటన చేశారు. ఈ మరణాలకు కారణమైన నోయిడాలోని మేరియన్ బయోటెక్ కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసినట్టు ప్రకటించారు. Central Drugs Standard Control Organisation (CDSCO) తనిఖీలు చేపట్టిన తరవాత తయారీ కార్యకలాపాలన్నీ ఆపివేయించారు. విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. CDSCO అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు విచారణను సమీక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. యూపీ డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు సీడీఎస్‌సీవో బృందం కూడా తయారీ యూనిట్‌లో తనిఖీలు నిర్వహించింది. ఆ సిరప్‌కు సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించారు. చంఢీగఢ్‌లోని రీజియనల్ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీకి పంపారు. దాదాపు 10 గంటల పాటు ఈ తయారీ యూనిట్‌లో తనిఖీలు చేపట్టారు అధికారులు. ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య శాఖ ఇప్పటికే ఈ ఘటనపై చాలా సీరియస్‌గా ఉంది. ఆ దగ్గు మందు తాగడం వల్ల 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని మండి పడుతోంది. ఇటీవలే గాంబియాలోనూ ఇదే తరహా మరణాలు సంభవించాయి. ఆ ప్రభుత్వం కూడా ఇండియన్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందుపైనే ఆరోపణలు చేసింది. దీనిపై విచారణ కొనసాగు తుండగానే...ఉజ్బెకిస్థాన్‌లోనూ కలవరం మొదలైంది. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం విచారణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.
Following inspection by @CDSCO_INDIA_INF team in view of reports of contamination in cough syrup Dok1 Max, all manufacturing activities of Marion Biotech at NOIDA unit have been stopped yesterday night, while further investigation is ongoing.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 30, 2022
గతంలోనూ...
విచారణలో ప్రాథమికంగా తేలిన విషయం ఏంటంటే...ఏ సిరప్ అయితే తాగి చిన్నారులు మరణించారో...ఆ సిరప్‌ను భారత్ మార్కెట్‌లు విక్రయించడం లేదు. ఇక్కడ వినియోగించేందుకు పనికి రాని సిరప్‌లను విదేశాలకు తరలించి అక్కడ విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న
సమాచారం ఆధారంగా చూస్తే...ఆ కంపెనీ పేరు Marion Biotech. 2012లోనే ఈ కంపెనీ ఉజ్బెకిస్థాన్‌లో రిజిస్టర్ అయింది. ఈ సంస్థ తయారు చేసిన Dok-1 Max సిరప్ కారణంగానే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్నది అక్కడి ప్రభుత్వం వాదన. 21 మంది చిన్నారులు ఈ సిరప్ తాగగా...వారిలో 18 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది ఉజ్బెకిస్థాన్. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ నుంచి తయారైన నాలుగు రకాల దగ్గు, జలుబు మందులూ పిల్లల ప్రాణాలు తీశాయి. ఈ మైడెన్ ఫార్మా కంపెనీ మన దేశానికి
చెందినదే. పిల్లల మరణానికి కారణమైన ఆ నాలుగు మందులు ఇక్కడ తయారైనవే. గాంబియాలో 66 మంది పిల్లల మరణంతో ఇండియాలో తయారైన ఆ నాలుగు మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధించింది. WHO ప్రకటించిన వారం రోజులకే...దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. హరియాణాలోని మైడెన్ ఫార్మా కంపెనీకి చెందిన ప్లాంట్‌ను మూసేసింది ప్రభుత్వం. అంతే కాదు. ఈ సిరప్ ఉత్పత్తిని ఇప్పటికిప్పుడు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: Vande Bharat Event: దీదీకి మరోసారి నిరసన సెగ- సభలో 'జై శ్రీరాం' నినాదాలు!
Stocks to watch 03 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - SBI, ITC మీద ఓ కన్నేయండి
ABP Desam Top 10, 3 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Petrol-Diesel Price 03 February 2023: ఏపీలో భగ్గుమన్న చమురు ధరలు, తెలంగాణలో స్థిరంగా రేట్లు
Gold-Silver Price 03 February 2023: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు - సామాన్యుడు కొనే పరిస్థితే లేదు
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ సెషన్ 1 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!