Congress Meeting: భారత్ జోడో యాత్రకు రెడీ అవుతున్న కాంగ్రెస్, అక్కడి నుంచే మొదలు
Congress Meeting: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
Congress Meeting:
రోజుకు 25 కిలోమీటర్ల పాదయాత్ర
ఉనికిని కాపాడుకునేందుకు...కాంగ్రెస్ చేయని ప్రయత్నమంటూ లేదు. భాజపాను ఢీకొట్టేందుకు గట్టిగానే శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే దేశమంతా యాత్ర నిర్వహించనుంది. "భారత్ జోడో యాత్ర" పేరిట చేపట్టనున్న ఈ యాత్రపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా ఆగస్టు 23న సమావేశం కానున్నారు. ఢిల్లీలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ అధ్యక్షత వహించనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమై...కశ్మీర్‌లో ముగియనుంది ఈ యాత్ర. ఈ ఏడాది మేలోఉదయ్‌పూర్‌లోని చింతన్ శివిర్ వద్ద "భారత్ జోడో యాత్ర"కు (Bharat Jodo Yatra) సంబంధించిన ప్రకటన చేశారు అధినేత సోనియా గాంధీ. 5 నెలల పాటు సాగనున్న ఈ యాత్ర 12 రాష్ట్రాల్లో జరగనుంది. మొత్తం 3,500 కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు. రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ..ఈ పాదయాత్రలు, ర్యాలీలు సహా పబ్లిక్ మీటింగ్స్‌లోనూ పాల్గొననున్నారు. ఈ ఏడాది జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. కోల్పోయిన తన ప్రాభవాన్ని మళ్లీ సాధించాలంటే...ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది హస్తం పార్టీ. అందుకే...ఈ యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
Sh. Krishna @Allavaru briefing members of @IYCLadakh before flagging off 'Bharat Jodo Yatra' Bike Rally organised under the leadership of Sh. Smanla Dorje Nurboo, President PYC Ladakh@IYC @srinivasiyc @PuneetPariya @smanladakh @NubuTundup @waresnal_yousuf @lundup_dorjai @tsepag pic.twitter.com/nveg4p1YPC
— Ladakh Youth Congress (@IYCLadakh) August 15, 2022
Bharat Jodo Yatra 🇮🇳❤️
— Ladakh Youth Congress (@IYCLadakh) August 12, 2022
Bike Rally by Youth Congress Ladakh
🏍🏍🏍🏍🏍
Date- 13th Aug 2022
📍Khalaste to Kharu 📍
🔛6 Villages, 1 City, 146Kms 🔛 pic.twitter.com/uc5gnJ7wsT
"Bharat Jodo" Yatra headed by our esteemed Leader, Sh. Rahul Gandhi ji. pic.twitter.com/RqLIZpdYoa
— Tambaram AIPC (@TambaramAIPC) August 21, 2022
నెక్స్ట్ ఎలక్షన్సే టార్గెట్..
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా ప్రభావం చూపించాలని చాలా గట్టి సంకల్పంతో ఉంది కాంగ్రెస్. ఆగస్టు 22 న రాహుల్ గాంధీ...పలువురు నిపుణులు, సంస్థలను మీటింగ్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. సలహాలు, సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా తదుపరి ఎన్నికల ప్రణాళికలు రచించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. భారత్ జోడో యాత్ర గురించీ వారితో చర్చించే అవకాశముంది. విభిన్న రంగాలకు చెందిన వారితోనూ రాహుల్ గాంధీ సమావేశమవుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు చర్చలు మొదలు పెట్టినట్టు సమాచారం. సోషల్ యాక్టివిస్ట్ మేధా పటేకర్ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నట్టు సమాచారం. నిరుద్యోగం, రైతుల సమస్యలు, దేశ ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టనుంది కాంగ్రెస్. భారత్ జోడో యాత్రకు సంబంధించి ప్రత్యేక లోగో, వెబ్‌సైట్‌కూడా ఏర్పాటు చేయనున్నారు.
Also Read: Mumbai Threat Message: 26/11 తరహా అటాక్ అంటూ మెసేజ్‌లు పంపిన వారిలో ఒకరు అరెస్ట్