![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Heeraben Modi Death: హీరాబెన్ మృతి పట్ల రాహుల్, నితీశ్ సహా ప్రముఖుల సంతాపం
Heeraben Modi Death: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
![Heeraben Modi Death: హీరాబెన్ మృతి పట్ల రాహుల్, నితీశ్ సహా ప్రముఖుల సంతాపం Congress Leader Rahul Gandhi, Bihar CM Nitish Kumar expresses condolences over demise of PM Modi's mother Heeraben Modi Heeraben Modi Death: హీరాబెన్ మృతి పట్ల రాహుల్, నితీశ్ సహా ప్రముఖుల సంతాపం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/f2c0e9dfa29f00856db17405ee57d27b1672377483009218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heeraben Modi Death: ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ (100) మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖులు.. ప్రధాని మోదీ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో
మోదీ తల్లి హీరాబెన్ (100) రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్.మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
మాతృమూర్తి మరణంతో ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే దిల్లీ నుంచి గుజరాత్ చేరుకుని ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మరోవైపు ఈరోజు తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నారు.
Also Read: Heeraben Modi Death: హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి- తల్లికి మోదీ కన్నీటి వీడ్కోలు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)