X

Congress News: కాంగ్రెస్‌లో యువరక్తం.. కన్హయ్య, మేవానీ చేరికతో 'హస్త'రేఖలు మారతాయా?

కన్హయ్య కుమార్, జిగ్నేశ్ మేవానీ.. చేరికతో కాంగ్రెస్‌ బలపడుతుందా? వాళ్లిద్దరికీ లాభం ఏంటి? 'టార్గెట్ 2024' కోసం కాంగ్రెస్ వ్యూహాలు ఏంటి?

FOLLOW US: 

కాంగ్రెస్.. 135  ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ. అయితే గత కొంతకాలంగా  కాంగ్రెస్ టైమ్ అంత బాలేదు. దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇన్నేళ్ల పార్టీ చరిత్రలో ఇంత ఘోరమైన పరిస్థితిని కాంగ్రెస్ ఎప్పుడూ ఎదుర్కోలేదనే చెప్పాలి. అయితే 2024 పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకోకపోతే కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఇది బాగా తెలిసిన పార్టీ అధినాయకత్వం కొత్త స్కెచ్ రెడీ చేసింది. మాటల తుటాలు పేల్చగలిగే యువకులు, దళిత నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది కాంగ్రెస్. మరి ఈ యువరక్తం కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తుందా?


యువ నేతలు..


జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడైన కన్హయ్య కుమార్, గుజరాత్‌కు చెందిన వడ్గాం స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ ఇటీవల కాంగ్రెస్‌ గూటికి చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు జిగ్నేశ్ మేవానీ మాత్రం సాంకేతిక కారణాల వల్ల పార్టీలో ఇంకా చేరనప్పటికీ మద్దతు ప్రకటించారు.


వీరద్దరి చేరికతో పార్టీలో కొత్త జోష్ వచ్చింది. ఎందుకంటే వీరిద్దరూ యువనాయకులు.. అంతకుమించి బలమైన వాగ్దాటి కలిగిన నేతలు. అయితే కన్హయ్య కుమార్.. కాంగ్రెస్‌లో చేరడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రధాన కారణమని సమాచారం. ఇటీవల కన్హయ్య కుమార్‌తో ప్రశాంత్ భేటీ అయ్యారు.


ప్రచారంలో జోష్..

దేశంలో త్వరలో ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో కన్హయ్య కుమార్, మేవానీ విస్తృతంగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రానున్న గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపైనే తాను పోటీ చేస్తానని మేవానీ స్పష్టం చేశారు.


అయితే వీరి ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు కలిగే లాభమేంటి? జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు పరిస్థితి మారుతుందా? పార్టీ చేరినందుకు వీరిద్దరికీ కలిగే ప్రయోజనమేంటి? ఈ మూడు అంశాలను పరిశీలిద్దాం.


కాంగ్రెస్‌కు ఏంటి?
జిగ్నేశ్ మేవానీ.. ప్రస్తుతం గుజరాత్‌లోని వడ్గాం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఆయన విజయం సాధించారు.


ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉంది. కానీ మేవానీకి మద్దతు పలికింది. ప్రతిగా మేవానీ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. 2016లో జరిగిన ఊనా ఘటన తర్వాత దళితులతో కలిపి మేవానీ ఎన్నో నిరసనలు చేశారు. గుజరాత్‌లో దళితుల భూ హక్కుల కోసం కూడా పోరాటం చేస్తున్నారు. 


సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) లెక్కల ప్రకారం.. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 53 శాతం దళితుల ఓట్లు దక్కాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఇది 67 శాతానికి పెరిగింది. ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), అగ్రకులాలు, ఆదివాసీల మద్దతు  కోల్పోయినప్పటికీ దళిత ఓట్లు కాంగ్రెస్ దక్కించుకోగలిగింది.అయితే కేవలం మేవానీ వల్లే ఇది జరిగిందని చెప్పడానికి లేదు.. సంస్థాగతంగా ఉన్న కాంగ్రెస్ బలం కూడా ఇందుకు ఓ కారణమే. అయితే మేవానీ మద్దతు కాంగ్రెస్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. అయితే జాతీయ స్థాయిలో జిగ్నేశ్ మేవానీకి అంత గుర్తింపు లేదు. గుజరాత్‌ను మినహాయిస్తే ఆయన దేశంలో అంత సుపరిచితులు కాకపోవడం కాస్త బలహీనాంశం. అందులోనూ మేవానీపై దళిత గుర్తింపు కంటే లెఫ్టిస్ట్ ముద్ర ఎక్కువగా ఉంది. 


కన్హయ్య కుమార్.. బిహార్ బెగుసరాయ్‌కు చెందిన సీపీఐ నేతల కుటుంబం నుంచి వచ్చిన నేత. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెగుసరాయ్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీకి చెందిన గిరిరాజ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆర్‌జేడీ అభ్యర్థి కంటే కన్హయ్య కుమార్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి.


పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన అనేక నిరసనల్లో ఆయన ప్రసంగించారు. అయితే బిహార్ ఎన్నికల ప్రచారంలో మాత్రం అంత చురుగ్గా వ్యవహరించలేదు.


గుజరాత్‌లో భాజపాకు దూరమవుతోన్న దళితులను దగ్గర చేసుకుంటూ మేవానీ రాజకీయంగా ఎదిగారు. అయితే కన్హయ్య కుమార్ మాత్రం.. భాజపాకు బలమైన సామాజిక వర్గమైన, ఆర్‌జేడీకి ప్రతికూల వర్గమైన భూమిహార్‌కు చెందిన నేత. కనుక ఎప్పుడైన బిహార్‌లో ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తే అగ్రవర్ణాల ఓట్లను తిరిగి కన్హయ్య కుమార్ ద్వారా దక్కించుకునే అవకాశం ఉంది.


అయితే అప్పటివరకు బెగుసరాయ్‌లో కన్హయ్య సాధించే గెలుపు లేదా ఓటమి.. ఆయనపైనే కాకుండా ఎన్‌డీఏ వ్యతిరేక పార్టీలపై కూడా ప్రభావం చూపిస్తుంది.జాతీయ స్థాయిలో..
పార్టీలో వీరి చేరిక వల్ల కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో ఏమైనా లాభం ఉంటుందా అన్న ప్రశ్నకు అసలు ఉండదు అని చెప్పలేం.. అలా అని ఎక్కువ ప్రభావం ఉంటుదని కూడా అంచనా వేయలేం.


అయితే ఈ యువనేతల చేరికతో కాంగ్రెస్‌లో కొత్త జోష్ మాత్రం వచ్చింది. ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వం గట్టిగా గళం విప్పే అవకాశం వచ్చింది.


హిందుత్వ సిద్ధాంతాలపై బలమైన గళం విప్పిన నేతలుగా మేవానీ, కన్హయ్యలకు పేరు ఉంది. ఇప్పటివరకు భాజపాపై కాంగ్రెస్ ఎదురుదాడి చేయలేదని వాదిస్తోన్న తృణమూల్ కాంగ్రెస్, ఎమ్‌ఐఎమ్, సమాజ్‌వాదీ పార్టీలకు వీరిద్దరూ సమాధానంగా మారనున్నారు. భాజపా వ్యతిరేక యువ ఓటర్లను ఆకర్షించి.. కమలం పార్టీకి కాంగ్రెస్ మాత్రమే దీటైన శక్తి అనే సందేశాన్ని వీళ్లు బలంగా వినిపించగల సమర్థులని విశ్లేషకులు అంటున్నారు.


ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది.. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు, నిర్ణయాల్లో యువనేత రాహుల్ గాంధీకి వీళ్లు మద్దతు పలికే అవకాశం ఉంది. కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే.. 2014లో భాజపాకు వచ్చిన ఓట్లను తనవైపు తిప్పుకోవాలి.


ఉదాహరణకు.. భాజపా ఆర్థిక విధానాల వల్ల నిరుత్సాహంగా ఉన్న యువ ఓటర్లు కూడా జాతీయ భద్రత విషయానికి వస్తే కమలం పార్టీకి జై కొడుతున్నారు. ఇలాంటి అంశాలు మేవానీ, కన్హయ్య కుమార్ వల్ల మారే పరిస్థితి లేదు.మేవానీ, కన్హయ్యలకు ఏంటి లాభం?


2022లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వడ్గాం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మేవానీకి మార్గం సుగమమైంది. ఒక వేళ ఆయన కాంగ్రెస్‌లో చేరకుంటే రానున్న ఎన్నికల్లో హస్తం పార్టీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేకపోలేదు. కానీ ఇప్పుడు మేవానీ.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు.


కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఆయనకు ఓ పెద్ద రాజకీయ వేదిక దొరికింది. ఆయన పోరాటాలను మరింత ఉద్ధృతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. కన్హయ్య కుమార్‌కు కూడా ఇది వర్తిస్తుంది.


చరిత్ర నుంచి ఇప్పటివరకు చాలా మంది వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థి సంఘం నేతలు కాంగ్రెస్‌లో చేరారు. జాతీయ స్థాయిలో రాణించిన వాళ్లు కూడా ఉన్నారు. సీపీఐ, సీపీఐ (ఎమ్) వంటి పార్టీల ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం ప్రస్తుతం కష్టం. కనుక కన్హయ్య కుమార్‌కు ఇది ఓ మంచి వేదిక కానుందని విశ్లేషకుల అభిప్రాయం.


Also Read: Afghanistan Crisis: భారత్‌కు తాలిబన్ల లేఖ.. విమాన సర్వీసులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండిTags: gujarat politics jignesh mevani kanhaiya kumar Congress Latest News

సంబంధిత కథనాలు

Minister Srinivas Goud: ఏడేళ్ల పసికూన దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి... ప్లీనరీ సక్సెస్ తో ప్రత్యర్థుల్లో గుబులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

Minister Srinivas Goud: ఏడేళ్ల పసికూన దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి... ప్లీనరీ సక్సెస్ తో ప్రత్యర్థుల్లో గుబులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Breaking News Live Updates: ముంబయి డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్ 

Breaking News Live Updates:  ముంబయి డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్ 

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Ritu Varma: ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Ritu Varma:  ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Sreemukhi Photos: ట్రెండీ లుక్ లో శ్రీముఖి.. ఫొటోలు వైరల్

Sreemukhi Photos: ట్రెండీ లుక్ లో శ్రీముఖి.. ఫొటోలు వైరల్

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన..