Afghanistan Crisis: భారత్‌కు తాలిబన్ల లేఖ.. విమాన సర్వీసులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి
అఫ్గానిస్థాన్- భారత్ మధ్య కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని తాలిబన్లు డీజీసీఏకు లేఖ రాశారు.
భారత ప్రభుత్వంతో తాలిబన్ల సర్కార్ సంప్రదింపులు జరిపింది. రెండు దేశాల మధ్య కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని కోరింది. ఈ మేరకు అఫ్గాన్ పౌరవిమానయాన శాఖ లేఖ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు లేఖ రాసింది. తాలిబన్ల సర్కార్.. భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. ఈ లేఖను భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు సమాచారం.
Taliban's Islamic Emirate of Afghanistan writes to DGCA (Directorate General of Civil Aviation) to resume commercial flights to Afghanistan (Kabul). Letter under review by Ministry of Civil Aviation (MoCA).
— ANI (@ANI) September 29, 2021
India had stopped all commercial flight operations to Kabul post 15 Aug. pic.twitter.com/8LO96j6EkK
విమానాశ్రయం భద్రతపై పూర్తి భరోసా ఇస్తున్నామని తాలిబన్లు అన్నారు. ఆర్థిక సంకోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గట్టేక్కించేందుకు తాలిబన్లు ముమ్మర చర్యలు చేపట్టారు. గతవారం కూడా పలు దేశాలతో విమానయన సేవలను పునరద్ధరించాలని తాలిబన్లు విజ్ఞప్తి చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి