Mamata Banerjee Chennai Visit: మమతా బెనర్జీ డ్రమ్స్ ఎంత బాగా వాయించారో చూశారా - వీడియో
Mamata Banerjee Chennai Visit: చెన్నైలో ఓ వేడుకకు హాజరైన మమతా బెనర్జీ డ్రమ్స్ వాయిస్తూ సందడి చేశారు.
Mamata Banerjee Chennai Visit:
గవర్నర్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రబ్బరు చెప్పులు వేసుకుని, సాదాసీదా చీర కట్టుకుని ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆమె ఉత్సాహం రెట్టింపవుతుంది. స్థానికంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగినా, ఉత్సవాలు నిర్వహించినా..దీదీ తప్పకుండా వెళ్తారు. అక్కడి వారిలో జోష్ నింపుతారు. ఆ మధ్య మమతా బెనర్జీ ఓ వేడుకకు వెళ్లి కోలాటం ఆడిన వీడియో వైరల్ అయింది. ఇప్పుడు మరో వీడియో వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ లా గణేషన్ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు మమతా తమిళనాడు వెళ్లారు. అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ వాద్యాలతో ఆమెకు ఆహ్వానం పలికారు. అందరికీ అభివందనం చేస్తూ ముందుకు వెళ్లిన దీదీ...ఆ డప్పులు కొట్టే వాళ్ల దగ్గరకు వచ్చి ఆగిపోయారు. కాసేపు వాళ్లను ఉత్సాహ పరిచారు. ఆ తరవాత తానే స్వయంగా ఆ డ్రమ్ వాయించారు. చుట్టు పక్కల వారంతా మమతా డ్రమ్ వాయించడాన్ని చూసి ఉత్సాహ పరిచారు. కాసేపయ్యాక ఆమె అందరికీ అభివాదం చేసి లోపలకు వెళ్లిపోయారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee plays a drum as she arrives at the family function of West Bengal Governor La Ganesan, in Chennai, Tamil Nadu pic.twitter.com/SB03cBS3zk
— ANI (@ANI) November 3, 2022
మోబ్రీ ఘటనపై విమర్శలు..
అంతకు ముందు గుజరాత్‌లో మోబ్రీ వంతెన కూలిపోవటంపై తీవ్రంగా స్పందించారు మమతా బెనర్జీ.
" మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనకు కారకులపై ఈడీ, సీబీఐ చర్యలు ఎందుకు చేపట్టలేదు.వాళ్లు కేవలం సామాన్యులపైనే తమ ప్రతాపం చూపిస్తారు. ప్రమాదం జరిగింది ప్రధాని సొంత రాష్ట్రంలో కనుకే నేను ఆయనను విమర్శిస్తున్నాను అనుకోవద్దు.
నేను రాజీకీయాల గురించి ఏదీ మాట్లాడబోను. రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఈ ఘటనపై నేను కామెంట్ చేయను. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పరిధిలో జ్యుడీషియల్ కమిటీ వేసి విచారణ జరిపించాలి. "
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్..
ఇక బంగాల్‌లో టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. మాణిక్ భట్టాచార్య.. ఈ కుంభకోణంలో అరెస్టయిన రెండో తృణమూల్ నాయకుడు.
బంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీని ఈ కేసులో జులైలో అరెస్టయ్యారు. పార్థ ఛటర్జీ సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీగా నగదు దొరికిన క్రమంలో ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అక్రమ నగదు లావాదేవీలకు
సంబంధించి దర్యాప్తు చేపట్టింది ఈడీ. ఇప్పటికే అరెస్టైన మాజీ మంత్రి పార్థ ఛటర్జీ వాట్సాప్ చాట్‌ను పరిశీలించగా ఈ కేసులో లంచాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే భట్టాచార్యపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: Bypoll Election 2022: ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్