China-Taiwan Conflict: మా దేశాన్ని మేం రక్షించుకుంటాం, ఏం చేసినా తలొగ్గం - చైనాకు తైవాన్ వార్నింగ్
China-Taiwan Conflict: మా దేశాన్ని మేమే కాపాడుకుంటామంటూ చైనాకు తైవాన్ వార్నింగ్ ఇచ్చింది.
China-Taiwan Conflict:
తైవాన్ హెచ్చరిక...
తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే మిలిటరీ డ్రిల్స్‌తో టెన్షన్ పెడుతోంది. దాదాపు 71 ఫైటర్ జెట్‌లను తైవాన్ వైపుగా మొహరించింది. యుద్ధం తప్పదేమో అన్న ఆందోళనా మొదలైంది. ఈ క్రమంలోనే తైవాన్ కూడా చైనాకు గట్టి బదులిచ్చేందుకు సిద్ధమవుతోంది. చైనాపై పోరాటం చేసేందుకు దేశమంతా కసరత్తు చేస్తోంది. తైవాన్ ఆర్మీ ఆయుధాలు, రేడార్‌లను సిద్ధం చేసుకుంటోంది. అమెరికా నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా ఇదో హాట్ టాపిక్ అయింది. అయితే...ఇంతలోనే చైనా మాట మార్చింది. కేవలం మిలిటరీ డ్రిల్స్ మాత్రమే నిర్వహిస్తున్నామంటూ బుకాయిస్తోంది. తమను అపార్థం చేసుకుంటున్నారని చెబుతోంది. అమెరికా ఈ పరిణామాలను పరిశీలిస్తోంది. అయినా తైవాన్ మాత్రం యుద్ధానికి సిద్ధమే అని స్పష్టం చేసింది. తైవాన్ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. "మా దేశ రక్షణ కోసం అంతా ఒక్కటవుతాం" అని వెల్లడించింది. తమ దేశ గగనతలంలో చైనాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు తిరుగుతున్నాయని, తమ ఎయిర్ స్పేస్‌లోకి వచ్చాయని తెలిపింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది. ట్విటర్ వేదికగా ఈ విషయం వెల్లడించింది.
71 PLA aircraft and 9 PLAN vessels around Taiwan were detected by 6 a.m.(UTC+8) today. R.O.C. Armed Forces have monitored the situation and tasked CAP aircraft, Navy vessels, and land-based missile systems to respond these activities. pic.twitter.com/oZbmPZcDib
— 國防部 Ministry of National Defense, R.O.C. 🇹🇼 (@MoNDefense) April 9, 2023
"తైవాన్ మా దేశం. ఇదే మా ఇల్లు. ఎంతో అందమైన ప్రాంతమిది. ఈ నేలతో మాకు ఎంతో అనుబంధముంది. అణువణువునా మా జ్ఞాపకాలు నిండి ఉన్నాయి. మా ఇంటిని మేం రక్షించుకునేందుకు కలిసి కట్టుగా పోరాడతాం"
- తైవాన్ రక్షణ శాఖ
ఇప్పటికే తైవాన్...చైనాకు వార్నింగ్ ఇచ్చింది. "మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయండి" అంటూ హెచ్చరించింది. ఎంత ఒత్తిడి తెచ్చినా, ఏం చేసినా తలొగ్గం అని స్పష్టం చేసింది.
#Taiwan is our homeland, and no matter where we go or what we encounter, she is always charming and beautiful. Every story on this land is etched in our memories. We, #ROCArmedForces, are fighting with all our heart to defend our homeland and to protect our home together. pic.twitter.com/oI2eply6N6
— 國防部 Ministry of National Defense, R.O.C. 🇹🇼 (@MoNDefense) April 9, 2023
అమెరికా వల్లే ఇదంతా..?
వరసగా మూడు రోజుల పాటు తైవాన్‌ను టార్గెట్ చేస్తూ మిలిటరీ విన్యాసాలు చేపట్టనుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. ఈ మధ్యే తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్వెన్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చారు. ఆ వెంటనే చైనా ఈ ప్రకటన చేసింది. తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని ఖండిస్తోంది డ్రాగన్. తైవాన్, అమెరికా మధ్య మైత్రిపై మండి పడుతోంది. అందుకే...తైవాన్ అధ్యక్షుడు అమెరికా వెళ్లి రాగానే మిలిటరీ విన్యాసాలు చేస్తామంటూ హెచ్చరించింది. యుద్ధ సన్నద్ధతకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేయనున్నట్టు స్పష్టం చేసింది. సౌత్, నార్త్, ఈస్ట్ తైవాన్లలోనే ఈ ప్రదర్శనలు నిర్వహించనుంది. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే చేస్తోంది డ్రాగన్. తైవాన్ తమదే అని చైనా ఎప్పటి నుంచో క్లెయిమ్ చేసుకుంటోంది. అమెరికాతో అంటకాగితే ఆకస్మిక దాడులు చేస్తామంటూ చైనా గతంలోనే తైవాన్‌ను హెచ్చరిచింది. గతేడాది ఆగస్టులో అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ తైవాన్‌లో పర్యటించారు. అప్పటి నుంచి చైనా ఆగ్రహంగానే ఉంది. ఇప్పుడు ఏకంగా మిలిటరీ డ్రిల్స్ చేస్తున్నామంటూ ప్రకటించింది.
Also Read: US Visa Hike: స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ పెంచిన అమెరికా, అప్పటి నుంచే అమల్లోకి