Chinese Woman: షాపింగ్ చేయడానికి తోడు కావాలా? అయితే ఈ అమ్మాయి కంపెనీ ఇస్తుంది - కానీ కండీషన్స్ అప్లై
Chinese Woman: చైనాలోని ఓ యువతి ఒంటరిగా ఫీల్ అవుతున్న వారికి తన టైమ్‌ని రెంట్‌కి ఇస్తోంది.
Chinese Woman Rents Time:
టైమ్‌ని రెంట్ ఇచ్చేస్తోంది..
కాస్త తెలివి ఉండాలే కానీ..సంపాదించడానికి ఉద్యోగమే ఉండాల్సిన అవసరం లేదు. మన ఐడియా అందరినీ అట్రాక్ట్ చేస్తే చాలు...పెద్దగా కష్టపడకుండానే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. చైనాలోని ఓ మహిళ ఈ స్ట్రాటెజీతోనే లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఆమె చేసేదేమిటో తెలుసా..? టైమ్‌ని అద్దెకివ్వడం. అర్థం కాలేదా..? అయితే కాస్త డిటైల్డ్‌గా చెప్పుకుందాం. సాధారణంగా కొంత మంది ఒంటరిగా షాపింగ్‌కి వెళ్లాలన్నా, మరేపనిమీద బయటకెళ్లాలన్నా పెద్దగా ఆసక్తి చూపించరు. బోర్ ఫీల్ అవుతారు. ఎవరైనా తోడుగా వస్తే బాగుండు అనుకుంటారు. అదిగో అలాంటి వాళ్లకు తన టైమ్‌ని అద్దెకి ఇస్తోంది 26 ఏళ్ల ఓ యువతి. భలే ఉంది కదా ఐడియా. అలా వాళ్లతో షాపింగ్‌కో, లేదంటే సరదాగా సినిమాకో వెళ్తుంది. ఫ్రీగా కాదు. గంటకు ఓ యువాన్ ఇచ్చుకోవాల్సిందే. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే రూ.11 అన్నమాట. అంటే గంటకు రూ.11 ఇస్తే చాలు ఎన్ని గంటలైనా మనతోపాటు ఉంటుంది. 26 ఏళ్ల పెగ్గీ అనే యువతి ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో ఓ సంచలనం. గత నెలలోనే ఈ కొత్త ఐడియాను ఇంప్లిమెంట్ చేసింది. ఈ వింత వ్యాపారానికి ఫుల్ డిమాండ్ పెరిగిపోయిందట. "ఒంటరిగా వెళ్లలేని వాళ్లకు, అలా వెళ్లేందుకు భయపడే వాళ్లకు నేను తోడుగా ఉంటాను. అదే నా జాబ్" అని వివరిస్తోంది పెగ్గీ. అలా చేయడం వల్ల అవతలి వాళ్లు ఒంటరితనం నుంచి బయటపడతారని తన ఐడియా వెనక ఉన్న ఫిలాసఫీనీ చెబుతోంది.
కంఫర్ట్ లేకపోతే వెళ్లదట..
ఈ మధ్యే ముగ్గురు గ్రాడ్యుయేట్‌లు తన ఐడియాకి అట్రాక్ట్ అయ్యి రెంట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారట. వాళ్లతో కలిసి ఎంచక్కా ట్రెకింగ్ కూడా వెళ్లొచ్చింది. పార్క్‌లో ఒక్కడే నిలబడి బెలూన్స్ అమ్ముకుంటున్న కుర్రాడికీ కంపెనీ ఇచ్చింది. జస్ట్ లంచ్‌కో, డిన్నర్‌కో పిలిస్తే మాత్రం వెళ్లదట. ఆ పనిలో పర్పస్ ఉండాలట. అప్పుడే కంపెనీ ఇచ్చేందుకు వెళ్తుందట. పెగ్గీ డ్రెసింగ్ స్టైల్ నచ్చిన వాళ్లు "షాపింగ్ చేయాలనుంది. మాతో పాటు వచ్చి కాస్త డ్రెస్‌లు సెలెక్ట్ చేస్తారా" అని అడుగుతున్నారట కొందరు అమ్మాయిలు. అలా చాలా మంది పిలిస్తే వెళ్లి వాళ్లకు షాపింగ్ చిట్కాలు ఇచ్చి వచ్చింది పెగ్గీ. ఇక్కడ మరో విషయం ఏంటంటే...పెగ్గీ టైమ్‌ని రెంట్‌కి తీసుకున్న వాళ్లు రోజంతా ఏ ఖర్చులు అయినా వాళ్లే భరించుకోవాలి. ఒకవేళ ఇద్దరూ కలిసి ఐస్‌క్రీమ్ తింటే...ఆ అమ్మాయి డబ్బులు కూడా రెంట్ తీసుకున్న వాళ్లే ఇవ్వాలన్నమాట. ఆ కండీషన్‌కి ఒప్పుకుంటేనే వస్తానని తేల్చి చెబుతోంది పెగ్గీ. తనకు కంఫర్ట్ లేకపోతే మాత్రం అసలు వెళ్లదు. ఇదన్నమాట పెగ్గీ స్టోరీ. ప్రస్తుతానికి ఈ సర్వీస్‌కి డిమాండ్ పెరుగుతోంది. టైమ్‌ని మేనేజ్ చేసుకుంటూ అందరికీ కంపెనీ ఇస్తోంది ఈ యువతి. ఎందుకిదంతా అంటే..."ఎవరూ లోన్‌లీగా ఫీల్ అవద్దు" అని అంటోంది. అవతలి వాళ్ల ఒంటరితనాన్ని పోగొట్టి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చని అదిరిపోయే ఆలోచన చేసిన ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతోంది.
Also Read: Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్ బిలియనీర్ సలహా