By: ABP Desam | Updated at : 04 Jun 2023 02:45 PM (IST)
లైఫ్‌లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే
Youngest Billionaire Cam Moar: సామాన్యుడి నుంచి సిల్వర్ స్పూన్‌తో పుట్టిన వ్యక్తి వరకు అందరికీ ఉన్న కామన్ నీడ్ 'మనీ'. ధనవంతుడిని కావాలని ప్రతి సగటు మనిషి కోరుకుంటాడు. కలను సాకారం చేసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా, ఉద్యోగస్తులు చాలా కష్టపడి పని చేస్తారు. వీలైనంత వేగంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సాధిస్తారు. మీరు కూడా ఇదే రూట్‌లో ప్రయత్నిస్తుంటే, 23 ఏళ్ల శ్రీమంతుడు చెప్పిన మాటను మీరు విని తీరాల్సిందే. ఆ కుర్రాడు సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణంగా ఎదిగాడు. కెరీర్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సిన వయసులోనే కోట్లకు యజమాని అయ్యాడు. ప్రపంచ యువ మిలియనీర్ల జాబితాలో (youngest billionaires list) తన పేరు కూడా కనిపించేలా చేశాడు.
9 టు 5 జాబ్ చేయవద్దని సలహా
దక్షిణ ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఆ కుర్రాడి పేరు క్యామ్ మోర్ (Cam Moar). ఇతను కూడా గతంలో ఉద్యోగం చేశాడు. రోజుకు 12 గంటల షిఫ్ట్‌లో కష్టపడ్డాడు. జాబ్ నుంచి ఏమీ సంపాదించలేమని కొన్ని రోజుల అనుభవంతోనే తెలుసుకున్నాడు. ఆ తర్వాత, సొంతంగా ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. వ్యాపారం ప్రారంభించిన కొన్నాళ్లకే బాగా సంపాదించడం ప్రారంభించాడు. ఆ తర్వాత, యంగెస్ట్ మిలియనీర్స్ లిస్ట్‌లోకి ఎక్కాడు.
ధనలక్ష్మి తనంతట తానుగా వెదుక్కుంటూ వచ్చేలా చేయాలన్నది క్యామ్ మోర్ చెప్పే మాట. '9 టు 5' జాబ్స్‌లో కష్టపడి పనిచేయడం వల్ల ఎప్పటికీ ధనవంతులు కాలేరన్నారు. ఉద్యోగాలు ప్రజల జీవితాలను పాడు చేస్తాయని, యజమానులకు మాత్రమే యమా లాభసాటిగా ఉంటాయని అతను అంటాడు.
రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే
2020 సంవత్సరంలో ఉద్యోగాన్ని విడిచిపెట్టిన మోర్, ఈ-కామర్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఏ పని చేసినా తనకు గుర్తింపు వచ్చేలా పెద్దగా చేయాలని నిర్ణయించుకున్నాడు, అందుకు తగ్గట్లుగా రిస్క్ తీసుకున్నాడు. లైఫ్‌లో రిస్క్ తీసుకోకపోతే మిగిలేది రస్కేనని నిరూపించాడు. మోర్ ఎత్తుగడ ఫలించింది, తెగువకు తగ్గ ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు, ఈ 23 ఏళ్ల వయస్సున్న కుర్రాడు ప్రతి నెలా రూ. 2 కోట్లకు తక్కువ కాకుండా సంపాదిస్తున్నాడు. తన వ్యాపారం కోసం చాలా రిస్క్ తీసుకున్నానని చెబుతున్న మోర్, అన్నింటినీ తానే స్వయంగా చేశానని చెప్పుకొచ్చాడు.
గొర్రెల మంద మనస్తత్వం మానుకోవాలి
చదువు పూర్తయిన తర్వాత, మనలో చాలామంది గొర్రెల మంద మనస్తత్వంతో ఉంటారని మోర్ చెబుతున్నాడు. అంటే... ఉద్యోగం చేయడం, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కార్, ఇల్లు కొనుక్కోవడం, ఆ రుణం తీర్చడానికి జీవితాంతం గొడ్డులా చాకిరీ చేయడం.. ఇలా సాగుతున్నారన్నది మోర్ మాట. ఈ రకమైన మెంటాలిటీకి దూరంగా ఉండాలని సలహా ఇచ్చాడు. రిస్క్ చేసిన మొదట్లో తాను కూడా కొంచెం ఇబ్బంది పడినా, వాటన్నింటినీ తట్టుకుని గట్టిగా నిలబడ్డానని, బాగా డబ్బు సంపాదించడం ప్రారంభించాక ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదని చెప్పాడు.
ప్రస్తుతం, మోర్ రూ. 6.46 కోట్ల విలువైన ఇంట్లో నివసిస్తున్నారు. అతని దగ్గర BMW M5 కారు ఉంది. పనితో పాటు వెకేషన్‌ను కూడా ఎంజాయ్ చేస్తుంటాడు. సెలవులు తీసుకుని ప్రపంచంలోని అనేక ప్రాంతాలు చుట్టి వస్తుంటాడు.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: మే నెలలో ట్రెండ్ రివర్స్, డాలర్ల వరద పారించిన ఫారినర్లు
సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?
Petrol-Diesel Price 23 September 2023: స్వల్పంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు- ఈ ప్రాంతంలో మాత్రం తగ్గుదల
Gold-Silver Price 23 September 2023: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్- మీ నగరాల్లో గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి టైం
2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!
Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
/body>