By: ABP Desam | Updated at : 19 Jan 2022 12:44 PM (IST)
చంద్రబాబు (ఫైల్ ఫోటో)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబంలో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇద్దరూ ఒకరోజు తేడాతో కరోనా పాజిటివ్ అని తేలిందని ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఇద్దరూ హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య చికిత్సను తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ బారిన పడ్డ చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థనలు చేశారు.
ఆ మరుసటి రోజే- చంద్రబాబు నాయుడు కూడా మహమ్మారి బారిన పడ్డారు. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు కూడా కోవిడ్ సోకింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ బారిన పడ్డ చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థనలు చేశారు.
చంద్రబాబుకు కరోనా రావడం పట్ల తాజాగా భారత్‌లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు తనకు తెలిసిందని లేఖలో అన్నారు. త్వరగా ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ లేఖను తెలుగు దేశం పార్టీ నాయకులు తమ అధికారిక సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేశారు.
ట్వీట్ చేసిన జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం జగన్ కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నుంచి చంద్రబాబు వేగంగా రికవరీ కావాలని కోరారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వైఎస్ జగన్ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు చంద్రబాబును కూడా ట్యాగ్ చేశారు.
Also Read: TS High Court: తెలంగాణ సీఎస్‌పై హైకోర్టు ఫైర్, మార్చి 14 వరకూ డెడ్ లైన్.. లేదంటే..
Also Read: రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ తల్లిదండ్రులపై కేసు ? విచారణకు రావాలని విజయవాడ పోలీసుల నోటీసులు !
Also Read: ఇండస్ట్రీకి మంచి రోజులు ముందున్నాయి... జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన నాగార్జున
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Breaking News Live Updates : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి