Covid 19 Update: కోబ్రా బెటాలియన్ క్యాంపులో కరోనా కలకలం... 38 మంది జవాన్లకు కరోనా పాజిటివ్

ఛత్తీస్ గడ్ సుక్మా జిల్లాలో 38 మంది జవాన్లకు కరోనా సోకింది. కోబ్రా బెటాలియన్ కు చెందిన క్యాంప్ నుంచి సెలవులపై వెళ్లి వచ్చిన మొత్తం 75 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 38 మందికి పాజిటివ్ వచ్చింది.

FOLLOW US: 

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్-హిట్ సుక్మా జిల్లాలో సీఆర్ఫీఎఫ్ జంగిల్ వార్‌ఫేర్ యూనిట్ కోబ్రా దళానికి చెందిన 38 మంది జవాన్లు కరోనా వైరస్ బారినపడ్డారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లోని ఎలైట్ వింగ్ అయిన కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) 202వ బెటాలియన్‌కు చెందిన సిబ్బందికి కరోనా సోకింది. సుక్మా జిల్లాలోని తేమెలవాడ క్యాంపులో 75 మంది సిబ్బందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించారు. వారిలో 38 మందికి పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత వారిని తమ శిబిరంలో క్వారంటైన్ చేశామని సుక్మా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ బన్సోద్ తెలిపారు. మిగిలిన జవాన్ల స్వాబ్ నమూనాలను RT-PCR పరీక్షల కోసం జగ్దల్‌పూర్‌కు పంపారు. పాజిటివ్ కోబ్రా సిబ్బంది కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టామని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కోబ్రా 202వ బెటాలియన్‌కు చెందిన ఈ దళాలు ఆదివారం సుక్మా చేరుకున్నాయని సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ శర్మ తెలిపారు. తేమెల్‌వాడలోని తమ యూనిట్ క్యాంపులో జవాన్లు తిరిగి విధుల్లో చేరారు. కోవిడ్-19 సంబంధిత ప్రోటోకాల్‌ ప్రకారం కోవిడ్ పరీక్షలు చేశామని ఆయన తెలిపారు. కరోనా సోకిన జవాన్లను శిబిరంలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు శర్మ తెలిపారు. 

Also Read: కరోనా హై అలర్ట్.. మొత్తం 157 మంది వైద్యులకు పాజిటివ్

157 వైద్యులకు సోకిన కరోనా

బంగాల్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కర్ మెడికల్ కళాశాల, ఆసుపత్రిలో 70 మంది వైద్యులు, నర్సులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. బిహార్​ పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో(ఎన్ఎంసీహెచ్​) 87 మంది వైద్యులు కూడా కరోనా బారినపడడం కలకలం సృష్టించింది. ఇటీవల జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సే ఈ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది. వీరిలో చాలా మందికి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. మరికొంతమందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వీరంతా ఆస్పత్రి క్యాంపస్​లో ఐసొలేషన్​లో ఉన్నట్లు పట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఎన్ఎంసీహెచ్​లో మొత్తం 194 నమూనాలకు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించగా అందులో శనివారం 12 మందికి కరోనా సోకినట్లు తేలగా మరో 75 మందికి ఆదివారం వైరస్​ నిర్ధరణ అయింది. 

Also Read: WHO on Covid 19: 2022లో కొవిడ్ అంతం.. కానీ అలా చేస్తేనే సాధ్యం: డబ్ల్యూహెచ్ఓ

Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Jan 2022 10:53 PM (IST) Tags: Covid news corona updates Cobra jawan 38 jawans tested positive

సంబంధిత కథనాలు

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే

PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్

PM Modi Telangana Tour: మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్

IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి

IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి

Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్‌ - ఓ రేంజ్‌లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు

Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్‌ - ఓ రేంజ్‌లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KKR Vs LSG Highlights: అయ్యో రింకూ - థ్రిల్లర్‌లో విన్నర్‌గా నిలిచిన లక్నో!

KKR Vs LSG Highlights: అయ్యో రింకూ - థ్రిల్లర్‌లో విన్నర్‌గా నిలిచిన లక్నో!

Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత

Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత

LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్‌, డికాక్‌

LSG vs KKR:  తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్‌, డికాక్‌

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి