అన్వేషించండి

Chhattisgarh: చిట్టి రోబోతో బాలుడిని రక్షిస్తారట, బోర్‌వెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో కొత్త టెక్నాలజీ

ఛత్తీస్‌గఢ్‌లో బోర్‌వెల్‌లో బాలుడు పడిపోయాడు. రోబో సాయంతో బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

80 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో బాలుడు 

ఛత్తీస్‌గఢ్‌లోని జంగీర్ చంప జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ 11 ఏళ్ల బాలుడు 80 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో పడిపోయాడు. అప్పటి నుంచి బాలుణ్ని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందం రంగంలోకి దిగి ఎస్కేప్ టన్నెల్‌ తవ్వే పనిలో నిమగ్నమైంది. లోపలకు కెమెరా పంపించి బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు వైద్యులు. బోర్‌వెల్‌ ద్వారానే అరటిపండ్లు, బిస్కెట్లతో పాటు ఆక్సిజన్‌నీ అందిస్తున్నారు. మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఆ సమయంలోనే గుజరాత్‌ వాసి ఒకరు రోబోల సాయంతో బాలుడిని బయటకు తీసుకు రావచ్చని సూచించారు. ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్‌ల కోసమే తాను ప్రత్యేకంగా రోబోలను తయారు చేశానంటూ చెప్పారు. వెంటనే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ ఆయనను సంప్రదించారు. 


రోబో సాయంతో రక్షించేందుకు ప్రయత్నాలు 

గుజరాత్‌కు చెందిన రోబోటిక్ టీమ్ రంగంలోకి దిగి బాలుడిని సురక్షితంగా బోర్‌వెల్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. నిపుణుల సమక్షంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. నిజానికి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం బాలుడిని రక్షించేదే. కానీ ఎస్కేప్ టన్నెల్ కోసం తవ్వకాలు జరుపుతుండగా పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డు తగులుతున్నాయి. హ్యాండ్ కట్టర్ డ్రిల్ మెషీన్లు లేకపోవటమూ సమస్యగా మారింది. పెద్ద పెద్ద రాళ్లను కట్‌ చేయటం చాలా కష్టమవుతోంది. హెవీ మెషినరీతో పాటు రాక్ బ్రేకర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోబోటిక్ టీమ్‌ బోర్‌వెల్‌లోని స్థితిగతులను అంచనా వేస్తూ ఆపరేషన్ చేపడుతోంది. బాలుడిని బయటకు తీసుకు రావటానికి కనీసం 10-15 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. సీఎం భూపేశ్ బాగేల్ అధికారులతో చర్చిస్తూ వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. మరెక్కడ బోర్‌వెల్స్ ఉన్నా వాటిని సరైన విధంగా మూసివేయాలంటూ ఎస్‌పీలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అప్పటికప్పుడు హడావుడి చేస్తున్నారే తప్ప ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నియంత్రించటం లేదు. బోర్‌వెల్స్‌ని సరైన విధంగా కప్పి ఉంచాలన్న ఆదేశాలనూ ఎవరూ పట్టించుకోవటం లేదు. చిన్నారులు ఆడుకుంటూ ఇలా బోర్‌వెల్‌లో పడిపోయిన ప్రతిసారీ రెస్క్యూ ఆపరేషన్‌కు కనీసం రెండు, మూడు రోజులు పడుతోంది. కొన్ని సందర్భాల్లో అధునాతన సాంకేతికతను వినియోగించాలన్న ఆలోచన కూడా చేయటం లేదు. ఫలితంగా కొందరు చిన్నారులు బోర్‌వెల్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇప్పుడదే జరుగుతోంది. ఇప్పటికే రెండు రోజుల నుంచి సహాయక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ పురోగతి కనిపింౘలేదు. రోబో సాయంతోనైనా చిన్నారి సురక్షితంగా బయటపడతాడేమో చూడాలి. 


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Samantha: కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Samantha: కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
కపుల్ రిలేషన్ బ్రేకప్‌పై ఇన్ స్టా పోస్ట్ - లైక్ కొట్టిన సమంత
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Tesla Y in india: ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
Rambha: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ! - ఇండస్ట్రీకి దూరం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమాల్లోకి రంభ రీఎంట్రీ! - ఇండస్ట్రీకి దూరం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Embed widget