Madras High Court: ఆయుర్వేద వైద్యులూ అలోపతి ప్రాక్టీస్ చేయొచ్చు - తేల్చి చెప్పిన మద్రాస్ హైకోర్టు
Madras High Court: క్వాలిఫైడ్ ఆయుర్వేద, హోమియోపతి వైద్యులు అలోపతి ప్రాక్టీస్ చేసుకోవచ్చని మద్రాస్ హైకోర్ట్ స్పష్టం చేసింది.
సర్జరీలు కూడా చేసుకోవచ్చు..
మద్రాస్ హై కోర్టు కీలక తీర్పునిచ్చింది. క్వాలిఫైడ్ ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్యులు ఎవరైనా అలోపతి ప్రాక్టీస్‌కు కూడా అర్హులేనని వెల్లడించింది. తమ సంప్రదాయ వైద్య విధానాన్ని కొనసాగిస్తూనే...అలోపతి చికిత్స కూడా చేయొచ్చని వెల్లడించింది. కానీ... ప్రత్యేకంగా అలోపతి మాత్రమే ప్రాక్టీస్ చేయటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా జస్టిస్ ఆర్‌ఎమ్‌టీ టీకా రమణ్ 2010లో
తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్‌ను ప్రస్తావించారు. 2010లో తమిళనాడు సర్కార్ "క్వాలిఫైడ్" ఆయుర్వేద, యునానీ, హోమియోపతి వైద్యులు అలోపతి ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. నిజానికి అప్పట్లో ఈ ఆదేశాలు జారీ చేసే ముందు ఈ విషయమై పెద్ద వివాదమే చెలరేగింది. అప్పట్లో కొన్ని చోట్ల పోలీసులు అలోపతి ఆసుపత్రులపై దాడులు చేశారు. నిబంధనలు విరుద్ధంగా కొందరు ఆయుర్వేద
వైద్యులు అలోపతి చికిత్స చేస్తున్నారని వారిని అరెస్ట్ కూడా చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అరెస్ట్ అయిన వాళ్లు క్వాలిఫైడ్ వైద్యులని, వాళ్లు అలోపతి చేసుకునేందుకూ అనుమతి ఉంటుందని తెలిపింది. సర్జరీలు, గైనకాలజీ, అనెస్థీషియాలజీ, ENTలాంటి విభాగాల్లో సేవలు అందించవచ్చని తేల్చి చెప్పింది. అయితే అప్పటి నుంచి దీనిపై
భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అలోపతి వైద్యులు..ఇది సరికాదని వాదిస్తున్నారు. "ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి" నేర్చుకున్న వాళ్లు సర్జరీలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదానికి చెక్ పెట్టాలని భావించిన ఓ హోమియోపతి వైద్యుడు మద్రాస్ హైకోర్ట్‌లో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన సమయంలోనే హైకోర్టు "అలోపతి ప్రాక్టీస్‌కు అర్హులే" అని తీర్పునిచ్చింది.
వారిపై చర్యలు తీసుకోకూడదు..
ఈ తీర్పునిచ్చే సమయంలోనే ఓ పిటిషన్‌ను కొట్టివేసింది ఉన్నత న్యాయస్థానం. సేలంలోని పనమరతుపట్టిలో హోమియోపతి వైద్యుడు సెంథిల్ కుమార్...నిబంధనలకు విరుద్ధంగా అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నాడని ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్ట్...."ఇది చట్టపరమే" అని చెప్పింది. 2010లో తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్‌ను కోర్టులో ప్రవేశపెట్టి తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు సెంథిల్ కుమార్. TN బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్‌లో రిజిస్టర్ అయిన వాళ్లు ఆయుర్వేద, యునాని, హోమియోపతితో పాటు అలోపతి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చని అందులో స్పష్టంగా ఉంది. ఇదే విషయాన్ని కోర్టుకి వివరించాడు. ఇదే సర్కులర్‌లో మరో కీలక విషమయూ ఉంది. టీఎన్ సిద్ధ మెడికల్ కౌన్సిల్, టీఎన్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, టీఎన్ హోమియోపతి మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయిన వైద్యుల ప్రాక్టీస్‌లో జోక్యం చేసుకోకూడదని పోలీసులను విజ్ఞప్తి చేసింది. 2019 అక్టోబర్‌లో సేలమ్ పోలీసులు సోదాలు చేసి సెంథిల్ కుమార్ వద్ద ఉన్న అలోపతి మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా చేశారు. ఇప్పుడీ వివాదంపైనే మద్రాస్ హైకోర్టు ఇలా తీర్పునిచ్చింది.
Also Read: Jayasudha : హీరో పక్కవాళ్ళ డ్రామా ఎక్కువ, టాలీవుడ్‌లో వివక్ష ఉంది - జయసుధ షాకింగ్ కామెంట్స్
Also Read: Rashtrapatni row: రాష్ట్రపతి హోదాకు జెండర్‌కు సంబంధం లేదా? అప్పట్లో నెహ్రూ ఏం చెప్పారు?