అన్వేషించండి

Chapra Hooch Tragedy: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం అలాంటి మరణాలు లేవా - బిహార్ సీఎం నితీష్ కుమార్

Chapra Hooch Tragedy: మద్య నిషేధం రాష్ట్రంలో కచ్చితంగా అమలవుతోందని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.

Chapra Hooch Tragedy: 

అసెంబ్లీలో రగడ..

బిహార్‌లోని చప్రాలో కల్తీ లిక్కర్ తాగి పలువురు మృతి చెందిన ఘటన...అసెంబ్లీని ఊపేస్తోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 39కి పెరిగింది. బీజేపీ నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడుతోంది. మద్య నిషేధం సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి మరణాలు నమోదవుతున్నాయని విమర్శిస్తోంది. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే...దీనిపై సీఎం నితీష్ కుమార్ స్పందించారు. దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట ఇలా కల్తీ లిక్కర్ తాగి ప్రాణాలు కోల్పోతున్న వారున్నారని అన్నారు. బిహార్‌లో మాత్రం మద్య నిషేధం చాలా పక్కాగా అమలవుతోందని, కల్తీ మందు తాగిన ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు.  బిహార్‌లో మద్య నిషేధం అమలుపై ప్రస్తావన రాగా...నితీష్ కుమార్ సమాధానమిచ్చారు. "అన్ని పార్టీల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ దీని అమలు కోసం కట్టుబడి ఉన్నారు. కానీ... మనం  ఎంత మంచి చేసినప్పటికీ ఎవరో ఒకరు చెడు చేయాలని చూస్తారు. నేరాలు అడ్డుకోటానికే కదా మనం చట్టాలు చేసుకుంది. కానీ...హత్యలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనిబీజేపీ చెబుతోంది. కానీ చాలా మంది లబ్ధి పొందారని మేం కచ్చితంగా చెప్పగలం" అని వెల్లడించారు నితీష్ కుమార్. రాష్ట్రంలో చాలా మంది మద్యం సేవించడం మానేశారని, భర్త తాగుడు మానాడన్న ఆనందం ఎంతో మంది మహిళల్లో ఉందని తెలిపారు. మద్యం సేవించడం మానేసి కుటుంబ బాధ్యతలు పంచుకుంటున్నారని చెప్పారు. "మద్యం మానేసి సాధారణ జీవితం గడుపుతున్న వాళ్లెందరో ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఘటనను మాత్రం అసలు ఉపేక్షించం. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారెవరైనా సరే వారిని పట్టుకుంటాం. కఠినంగా శిక్షిస్తాం" అని తేల్చి చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కల్తీ మందు తాగి చనిపోతున్న వారు లేరా అని ప్రశ్నించారు. 

ఫైర్ అయిన నితీష్..

దీనిపై బీజేపీ సభలో పదేపదే వాదనకు దిగింది. ఇదే కంటిన్యూ అవుతుండటం వల్ల నితీష్ కుమార్ సహనం కోల్పోయారు. ఉన్నట్టుండి సీట్‌లో నుంచి లేచి మైక్ అందుకుని గట్టిగా మాట్లాడారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. కళ్లురుముతూ బీజేపీ నేతలకు వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు "అరవకండి" అంటూ నినదించినా...నితీష్ కుమార్ అస్సలు ఆగలేదు. "మద్య నిషేధం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అంతా మద్దతిచ్చారు కదా. అందుకు మీరే సాక్ష్యం కదా. మరి ఇప్పుడు ఇలా రివర్స్‌లో మాట్లాడటమేంటి..? అప్పుడు అంగీకరించిన వాళ్లంతా ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నారు. ఇంకా లిక్కర్ విక్రయాలు జరుగుతున్నాయని ఎలా ఆరోపిస్తున్నారు..? చెత్త రాజకీయాలు చేయకండి. ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోండి" అని విరుచుకుపడ్డారు. దీనిపై..బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. మాజీ డిప్యుటీ సీఎం, బీజేపీ నేత తారాకిషోర్ ప్రసాద్ స్పందించారు. "మద్య నిషేధానికి మేం సపోర్ట్ చేశాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మేం ఆ బిల్లుకి 
మద్దతునిచ్చాం. కానీ...ఈ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది" అని విమర్శించారు. 

Also Read: Bengaluru News: పెళ్లయిన 3 నెలలకే- భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య!

టాప్ హెడ్ లైన్స్

KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
AP Economic Regions: ఏపీ అభివృద్ధికి మూడు ఎకనమిక్ రీజియన్లు.. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
ఏపీ అభివృద్ధికి మూడు ఎకనమిక్ రీజియన్లు.. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Jasprit Bumrah Milestone:  శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget