News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chandrayaan 3: 14 రోజుల తర్వాత చంద్రయాన్ 3 పరిస్థితి ఏంటి? ల్యాండర్‌, రోవర్‌ పనిచేస్తాయా?

జాబిల్లిపై భారత జెండా ఎగురవేసిన చంద్రయాన్‌-3 ప్రయోగం 14 రోజులేనా? ఆ తర్వాత ల్యాండర్‌, రోవర్‌ పనిచేస్తాయా? చేయవా? వాటి పరిస్థితి ఏంటి? ఇస్రో చెప్పిన వాస్తవాలేంటి?

FOLLOW US: 
Share:

చంద్రుడి రహస్యాలు ఛేదించే పనిలో ఉంది చంద్రయాన్‌-3. జాబిల్లిపై ల్యాండ్‌ అయిన విక్రమ్‌ ల్యాండర్‌, అందులో నుంచి దిగి... చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న  రోవర్‌.. శాస్త్రవేత్తలకు కావాల్సిన సమాచారం చేరవేస్తున్నాయి. ఇప్పటికే... చంద్రుడి ఉపరితలం ఫొటోలు, వీడియోలు కూడా పంపాయి. అయితే వాటి జీవితకాలం 14 రోజులు  మాత్రమే. ఆ తర్వాత పనిచేయవా అంటే..? అద్భుతం జరిగితే తప్ప... కుదరదని అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

చంద్రయాన్‌-3 జీవితకాలం 14 రోజులే. చంద్రుడిపై దిగిన ల్యాండర్‌... జాబిల్లిపై తిరుగుతున్న రోవర్‌... ఏ ప్రయోగాలు చేసినా.. ఏ ఫొటోలు, వీడియోలు తీసినా ఆ 14 రోజులే. ఏం  చేసినా... అప్పడే చేయాలి. 14 రోజులు దాటితే అంతా ప్రతికూలతే. ఎలా ఎందుకు? అసలు ఈ 14రోజుల టార్గెట్‌ ఏంటి? చంద్రుడి ఉపరితలంపై ఒక రోజు అంటే భూమిపై  సుమారుగా 28 రోజులతో సమానం. అంటే మన లెక్కప్రకారం 14 రోజులు చంద్రుడి ఉపరితలంపై పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఈ లెక్కన ఆగస్టు 23న చంద్రుడిపై పగలు మొదలైంది. ల్యాండర్‌ను సురక్షితంగా దించాలంటే సూర్యరశ్మి అవసరం. అందుకే 23వ తేదీని సాఫ్ట్‌ ల్యాండ్‌ చేసేందుకు ఇస్రో ఎంచుకుంది. మన లెక్కన 14 రోజుల పాటు  ల్యాండర్‌, రోవర్ చంద్రుడిపై పనిచేస్తాయి. అందుకే చంద్రుడిపై పగలు ఉండే 14 రోజులే వీటి జీవితకాలం అని ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత రాత్రి అవగానే ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ల్యాండర్, రోవర్‌లోని వ్యవస్థలు పని చేయవు. 

ల్యాండర్ గాని, రోవర్ గాని పనిచేయడానికి.. సేకరించిన సమాచారాన్ని భూమికి పంపడానికి విద్యుత్ అవసరం. వాటికి కావాల్సిన విద్యుత్ సూర్యకాంతి నుంచి  సేకరించుకుంటాయి. అందుకే చంద్రునిపై సూర్యోదయం అయ్యే సమయానికి ల్యాండర్‌ను ఇస్రో విజయవంతంగా ల్యాండ్ చేసింది. ల్యాండర్, రోవర్‌కు అమర్చిన సోలార్ ప్యానల్  సౌర శక్తిని స్వీకరించి విద్యుత్ శక్తిగా మార్చుకుంటాయి. ఆ శక్తి ద్వారా ల్యాండర్, రోవర్ పనిచేస్తాయి. చంద్రుడిపై సాధ్యమైనంత ఎక్కువ దూరం తిరిగి అక్కడి సమాచారాన్ని  భూమికి పంపుతాయి. దీని ఆధారంగా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడిపై మానవ జీవనం సాధ్యమవుతుందా లేదా అన్నది విశ్లేషిస్తారు. కాబట్టి.. 14 రోజుల తర్వాత అవి పని చేయడం దాదాపుగా అసాధ్యం.  అయితే ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడితే... 14 రోజుల రాత్రి తర్వాత ల్యాండర్, రోవర్ తిరిగి పని చేసే అవకాశం ఉంది. 

భూమిపై 14 రోజుల కాలం... చంద్రుడిపై ఒక్క పగలుతో సమానం. ఆ తర్వాత చంద్రుడిపై సూర్యుడు అస్తమిస్తాడు. వెంటనే చంద్రుడి ఉపరితలం అంతా చీకటిగా మారిపోతుంది.  దీంతో అక్కడ చిమ్మ చీకటి అయిపోతుంది. దీంతో పాటు ఉష్ణోగ్రత కూడా ఏకంగా మైనస్ 180 డిగ్రీలకు పడిపోతాయి. ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీలకు చేరుకుంటే చంద్రయాన్  రోవర్, ల్యాండర్ రెండూ గడ్డకట్టిపోవడం ఖాయం. తిరిగి మరో 14 రోజుల తర్వాత అంటే చంద్రుడిపై రాత్రి గడిచిన తర్వాత అక్కడ సూర్యుడి వెలుగు వస్తుంది. అప్పుడు మళ్లీ  ల్యాండర్, రోవర్ పై సూర్యకిరణాలు పడతాయి. అయితే అప్పటికే గడ్డకట్టుకు పోయిన ఈ రెండూ తిరిగి మంచును కరిగించుకుని తిరిగి పనిచేయగలిగితే... మరో అద్భుతం  జరిగినట్టే అని అంటున్నారు  ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్‌. 

Published at : 25 Aug 2023 02:18 PM (IST) Tags: Moon Chandrayaan 3 Lander Rover 14 days

ఇవి కూడా చూడండి

ప్రజల్లోకి నారా భువనేశ్వరి- త్వరలోనే బస్సు యాత్ర!

ప్రజల్లోకి నారా భువనేశ్వరి- త్వరలోనే బస్సు యాత్ర!

ABP Desam Top 10, 2 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 2 October 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gold-Silver Price 02 October 2023: వెలవెలబోతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 02 October 2023: వెలవెలబోతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Chandrababu Hunger Strike: నేడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ నిరాహార దీక్ష - భువనేశ్వరి సైతం!

Chandrababu Hunger Strike: నేడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ నిరాహార దీక్ష - భువనేశ్వరి సైతం!

టాప్ స్టోరీస్

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!