![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chamchagiri Remark: రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు- మహిళా కమిషన్ సీరియస్!
Chamchagiri Remark: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
![Chamchagiri Remark: రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు- మహిళా కమిషన్ సీరియస్! Chamchagiri remark Congress Leader Udit Raj Clarifies Comment On President Murmu After Outrage, NCW To Send Notice Chamchagiri Remark: రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు- మహిళా కమిషన్ సీరియస్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/882e7c09b0a1f2818d408fc654455b56166504074959725_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chamchagiri Remark: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్ చేస్తోంది. అయితే ఉదిత్ రాజ్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతిపై తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీతో సంబంధం లేదని ఆయన ట్వీట్ చేశారు.
మరో ట్వీట్
ఇదీ జరిగింది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 3న మన దేశంలో శ్వేత విప్లవం, ఉప్పు తయారీ గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడారు. పాల ఉత్పత్తి, వినియోగంలో భారత దేశం ప్రథమ స్థానంలో నిలిచిందని ఆమె అన్నారు. అదే విధంగా మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఉప్పులో 76 శాతం గుజరాత్‌లో ఉత్పత్తి అవుతోందన్నారు. గుజరాత్‌లో ఉత్పత్తి అవుతున్న ఉప్పును భారతీయులంతా తింటున్నారని రాష్ట్రపతి అన్నారు.
దీనిపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ట్విట్టర్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఎన్‌సీడబ్ల్యూ
ఉదిత్ రాజ్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ.. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్‌కు నోటిసులు పంపుతున్నట్లు తెలిపారు.
Also Read: Viral video: రోడ్డుపై రావణుడి బ్రేక్ డ్యాన్స్- 'ఆదిపురుష్'లో అవకాశం ఇవ్వండయా!
Also Read: Thailand Mass Shooting: చైల్డ్ కేర్ సెంటర్‌పై దుండగుడి కాల్పులు- 34 మంది మృతి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)