Viral video: రోడ్డుపై రావణుడి బ్రేక్ డ్యాన్స్- 'ఆదిపురుష్'లో అవకాశం ఇవ్వండయా!
Viral video: రావణాసురుడి గెటప్‌లో ఓ వ్యక్తి రోడ్డుపై స్టైల్‌గా డ్యాన్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![Viral video: రోడ్డుపై రావణుడి బ్రేక్ డ్యాన్స్- 'ఆదిపురుష్'లో అవకాశం ఇవ్వండయా! Viral video man dressed as Raavan dancing to Haryanvi song on street Watch Viral video: రోడ్డుపై రావణుడి బ్రేక్ డ్యాన్స్- 'ఆదిపురుష్'లో అవకాశం ఇవ్వండయా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/36928672b6797217aee3820c7edb21c41665047672520218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Viral video: 'ఆదిపురుష్' సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్స్ నడస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి రావణుడి గెటప్‌లో డ్యాన్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇరగదీశాడు!
రావణుడి గెటప్‌లో ఓ వ్యక్తి రోడ్డుపై అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు. హర్యాన్వి సాంగ్‌కు ఆ వ్యక్తి మంచి గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నాడు. అతని పక్కన ఫ్యాన్సీ డ్రెస్‌లో మరో వ్యక్తి అతడితో కలిసి చిందేశాడు.
गर्ल्स : अरे यार कल मेरा इंटरव्यू है, बहुत फीयर्स लग रहा है 😭
— Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) October 5, 2022
बॉयज ( जलने से पहले) : pic.twitter.com/u9oYP86Dwj
రావణుడి వేషంలో ఉన్న వ్యక్తి డ్యాన్స్ మూమెంట్స్ మాత్రం అదిరిపోయాయి. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దసరా వేడుకల సందర్భంగా ఈ డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో తెగ నచ్చేయడంతో కొంతమంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
'ఆదిపురుష్'లో సైఫ్ స్ధానంలో రావణుడిగా ఇతడిని తీసుకోండని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి రావణుడిగా ఇతడి గెటప్ బావుందని ప్రశంసించాడు.
వైరల్
ఈ మధ్య డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల కొంత మంది విదేశీ పిల్లలంతా కలిసి డ్యాన్స్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది. అందులో ఏముంది అనుకుంటున్నారా.. వాళ్లు స్టెప్పులేసింది ఓ బాలీవుడ్ పాటకు. ఈ మధ్య యూట్యూబ్ షాట్స్, ఇన్‌స్టా రీల్స్, పెళ్లిల్లు, సంగీత్‌లు ఇలా ఎక్కడ చూసినా.. క్రికెటర్ల నుంచి సామాన్యుల వరకు ఇదే పాటకు స్టెప్పులేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ స్టెప్పులతో ఉర్రూతలూగించిన "కాలా చష్మా" పాట అందరినీ ఓ ఊపు ఊపేసింది. అదే పాటకు నైజీరియన్ పిల్లలు వేసిన అదిరిపోయే స్టెప్పులకు ఫిదా అయిన కేటీఆర్.. ఆ వీడియోను ఇటీవల ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
This is Wow! Indian soft power. pic.twitter.com/DsGQWTsnF5
— Aviator Anil Chopra (@Chopsyturvey) August 25, 2022
Also Read: Thailand Mass Shooting: చైల్డ్ కేర్ సెంటర్‌పై దుండగుడి కాల్పులు- 34 మంది మృతి!
Also Read: North Korea Missile Test: ఆ దేశాల అండతో రెచ్చిపోతున్న కిమ్- మరో 2 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)