అన్వేషించండి

Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !

Elon Musk Starlink India: భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశంపై ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం కౌంటర్ ఇచ్చింది. నిబంధనల అమలులో ఎలాంటి వివక్ష లేదని .. అందరికీ ఒకే రూల్స్ ఉంటాయని స్పష్టం చేసింది.

 Starlink Spectrum Allocation : భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విడుదలకు స్థానిక బిలియనీర్లు ,  ఆలిగార్క్‌లు అడ్డుపడుతున్నారంటూ టెక్ దిగ్గజం, స్టార్ లింక్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన సంచలన ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న ఈ ఆరోపణలు, కథనాలను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ  తీవ్రంగా ఖండించింది. భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులతో సహా అన్ని రకాల టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, వివక్ష లేని  పారదర్శక నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది.

శాటిలైట్ ఇంటర్నెట్ విభాగానికి సంబంధించి జీఎంపీసీఎస్  పరిధిలో ఇప్పటివరకు మొత్తం మూడు దిగ్గజ సంస్థలకు టెలికాం లైసెన్సులు మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నాన్-జియోసింక్రోనస్ శాటిలైట్ ఆర్బిట్  ఆధారిత సేవలు అందించడానికి ఈ మూడింటికీ సమాన ప్రాతిపదికనే అవకాశాలు కల్పించామని పేర్కొంది. దేశంలో అత్యుత్తమ శాటిలైట్ సేవలను అందుబాటులోకి తేవాలనే కట్టుబాటుతోనే ఈ లైసెన్సింగ్ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించింది.

అయితే, లైసెన్స్ పొందిన ఏ సంస్థ అయినా సేవలను ప్రారంభించే ముందు భారత జాతీయ భద్రతా నిబంధనలకు  లోబడి ఉందో లేదో నిరూపించుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. వినియోగదారుల డేటా భద్రత, దేశ రక్షణ , డిజిటల్ భద్రతా ప్రమాణాలను కాపాడటమే ఈ నిబంధనల అసలు ఉద్దేశమని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం లైసెన్స్ పొందిన మూడు సంస్థలకు సంబంధించి ఈ భద్రతా తనిఖీలు, అంచనా ప్రక్రియ  పురోగతిలో ఉందని సవివరంగా తెలిపింది.   

జాతీయ భద్రతా తనిఖీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాతే ఆయా సంస్థలు తదుపరి దశ అయిన  స్పెక్ట్రమ్ కేటాయింపు  కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం అనుమతులు పొందిన మూడు సంస్థలు  ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌తో సహా  నిబంధనల ప్రకారం ఒకే రకమైన రెగ్యులేటరీ దశలో ఉన్నాయని, ఏ ఒక్క సంస్థకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం లేదా వివక్ష చూపడం జరగలేదని తేల్చిచెప్పింది.

కాబట్టి, భారత రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ లేదా దాని అమలు తీరు పక్షపాతంగా, అన్యాయంగా ఉందంటూ ప్రచారం చేయడంలో ఏమాత్రం నిజం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ఇటువంటి వాదనలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. ఎలాన్ మస్క్ ట్వీట్ ఆధారంగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేంద్రం ఇచ్చిన ఈ వివరణతో నిబంధనల అమలులో అందరికీ ఒకే రూల్ వర్తిస్తుందనే సంకేతం గట్టిగా వెళ్లింది.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Tirumala Darshan Tickets: తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల షెడ్యూల్‌ ప్రకటించిన టీటీడీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల షెడ్యూల్‌ ప్రకటించిన టీటీడీ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Embed widget