Elon Musk Starlink India Oligarchs: భారత్‌లో స్టార్‌లింక్‌కు అడ్డుకట్ట - ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు .. పేర్లు బయటపెట్టాలన్న కేటీఆర్!
Starlink India Launch Delay: భారత్‌లో స్టార్‌లింక్ రాకను బడా పారిశ్రామిక వేత్తలు అడ్డుకుంటున్నారంటూ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. వారు ఎవరో బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Indian Telecom Monopoly: టెక్ దిగ్గజం, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విడుదలకు గుత్తాధిపత్యానికి అలవాటుపడిన పారిశ్రామికవేత్తలు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. భారత ప్రజలపై తమ ఏకఛత్రాధిపత్యం, మార్కెట్ మోనోపోలీ కొనసాగించడం కోసమే స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించారు. వారు ఎవరో మీరే ఊహించుకోవచ్చని వ్యాఖ్యానించిన ఆయన, ఇది భారత ప్రజల పట్ల జరుగుతున్న ఒక నేరమని అభివర్ణించారు.
సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక సుదీర్ఘ చర్చకు స్పందిస్తూ ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ కోట్లాది మంది ఇంటర్నెట్ సౌకర్యానికి దూరంగా ఉన్నారని వచ్చిన కథనాలపై స్పందించిన మస్క్, నాణ్యమైన బ్రాడ్‌బాండ్ సేవలను ప్రజలకు అందించకుండా బడా వ్యాపారవేత్తలు అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. భారత్‌లో టెలికాం మార్కెట్‌ను శాసిస్తున్న కొద్దిమంది బడా పరిశ్రమల అధిపతులను ఉద్దేశించే మస్క్ ఈ ఆరోపణలు చేశారని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.
Unfortunately, we are being blocked by certain oligarchs in order to maintain their monopolistic chokehold on the Indian people. You can guess who they are … This is a crime against the people of India!
— Elon Musk (@elonmusk) October 7, 2026
ఈ సంచలన ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సోషల్ మీడియా వేదికగా తక్షణమే స్పందించారు. భారత మార్కెట్‌లో స్వతంత్రమైన పోటీని దెబ్బతీస్తూ, స్టార్‌లింక్ ప్రవేశానికి అడ్డంకులు సృష్టిస్తున్న ఆ ఆలిగార్క్‌లు ఎవరో నేరుగా పేర్లు బయటపెట్టాలని కేటీఆర్, ఎలాన్ మస్క్‌కు సూచించారు. దేశ ప్రజల ప్రయోజనాలను, వినియోగదారుల హక్కులను దెబ్బతీస్తున్న వారి అసలు రూపాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Elon, Name and shame the Oligarchs The Nation (India) wants to know who is got this stranglehold on our Government
— KTR (@KTRBRS) October 7, 2026
ఈ వివాదం భారత కార్పొరేట్ , డిజిటల్ వర్గాల్లో కలకలం రేపుతోంది. దేశీయ టెలికాం దిగ్గజాలు, స్పెక్ట్రమ్ కేటాయింపులు , శాటిలైట్ కమ్యూనికేషన్స్ అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల వెనుక బడా పారిశ్రామికవేత్తల ఒత్తిడి ఉందనే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మస్క్ నేరుగా క్రైమ్ ఎగైనెస్ట్ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని అభివర్ణించడంతో అంతర్జాతీయ మీడియా దృష్టి కూడా ఈ అంశంపై పడింది.
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కాకపోవడానికి ప్రధానంగా మూడు రకాల ప్రతిబంధకాలు ఉన్నాయి. మొదటిది, *జాతీయ భద్రత, డేటా లోకలైజేషన్. భారతదేశానికి చెందిన వినియోగదారుల డేటాను దేశ పరిధిలోనే భద్రపరచడం, సెక్యూరిటీ నెట్‌వర్క్ ఆపరేషన్ సెంటర్లను స్థానికంగా ఏర్పాటు చేయడం, అత్యవసర సమయాల్లో సిస్టమ్‌పై నియంత్రణ సాధించేలా కఠినమైన భద్రతా అనుమతులను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రెండోది, దేశీయ టెలికాం దిగ్గజాల పోటీ. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి దేశీయ కంపెనీలు తమ బిజినెస్ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు స్పెక్ట్రమ్ కేటాయింపు నిబంధనలు , ధరల నిర్ణయంపై కఠినమైన విధానాలు ఉండాలని మొదటి నుంచీ ఒత్తిడి తెచ్చాయి. మూడోది, స్పెక్ట్రమ్ ధరల కేటాయింపు ఆలస్యం. పొందిన లైసెన్సుల ఆధారంగా స్పెక్ట్రమ్ కేటాయింపు , ట్రాయ్ నిర్దేశించే తుది నిబంధనలు, ధరల విధానం ఆమోదం పొందడంలో జరుగుతున్న జాప్యం కూడా స్టార్‌లింక్ ఇండియా ప్రవేశానికి పెద్ద అడ్డంకిగా మారింది.
స్టార్ లింక్ వస్తే దేశీయ టెలికాం రంగంలో పోటీ తత్వం తగ్గుతోందని, దీనివల్ల సాధారణ వినియోగదారులే నష్టపోతున్నారని డిజిటల్ హక్కుల కార్యకర్తలు భావిస్తున్నారు. ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం లేదా సదరు టెలికాం సంస్థలు ఎలా స్పందిస్తాయనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
ట్రెండింగ్ వార్తలు






















