అన్వేషించండి

ఫేక్‌ న్యూస్‌కి చెక్ పెట్టనున్న కేంద్రం, ఐటీ చట్టంలో సవరణలు - ఫ్యాక్ట్‌ చెకింగ్‌ కోసం స్పెషల్ ఏజెన్సీ

Centre Amends IT Rules: వదంతులు వ్యాప్తి చెందకుండా ఫ్యాక్ట్ చెకింగ్ చేసేందుకు ఐటీ చట్టంలో కేంద్రం సవరణలు చేసింది.

 Centre Amends IT Rules:


చట్టంలో సవరణలు..

ఎన్నో సమావేశాలు, చర్చల తరవాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టం 2021లో  సవరణలు చేసింది. వదంతులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేసే విధంగా మార్పులు చేర్పులు చేసినట్టు వెల్లడించింది. ఇకపై తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నియంత్రించనుంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి సమాచారాన్నీ ఫ్యాక్ట్ చెక్ చేసే విధంగా మార్పులు చేసినట్టు వివరించారు. 

"ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి సంబంధించిన కంటెంట్‌ను ఫ్యాక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు చేశాం. ఈ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రక్రియ కేవలం ప్రభుత్వానికి సంబంధించిన సమాచారానికి మాత్రమే అమలవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఏజెన్సీ పని చేయనుంది."

- రాజీవ్ చంద్రశేఖర్,ఐటీ మంత్రి 

సోషల్ మీడియాపై నిఘా..

ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఓ ప్రత్యేక ఏజెన్సీ ఫ్యాక్ట్‌ చెక్ చేయనుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించి ఇష్టమొచ్చినట్టు షేర్ చేయడానికి వీల్లేకుండా కట్టడి చేయనున్నారు. ఇకపై సోషల్ మీడియాపై పూర్తి స్థాయి నిఘా ఉండనుంది. వదంతులు, తప్పుడు సమాచారాలు వ్యాప్తి చేయడాన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్టు రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. సాధారణ సమాచారం కన్నా వదంతులు 20రెట్ల వేగంతో అందరికీ చేరువవుతాయని అన్నారు. ఇలా చేయడం ఇంటర్నెట్ క్రిమినాలిటీ కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ఈ కొత్త ఐటీ రూల్స్‌తో ఇకపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ జాగ్రత్తగా ఉండక తప్పదు. ముఖ్యంగా మెటా, ట్విటర్, షేర్‌ చాట్‌పై దృష్టి సారించింది కేంద్రం. ఈ విషయంలో తప్పులు జరిగితే తమను తాము డిఫెండ్ చేసుకోడానికి వీల్లేకుండా చాలా కచ్చితంగా వ్యవహరించనుంది ప్రభుత్వం. దాదాపు దశాబ్ద కాలంగా ఇలాంటి తప్పుడు సమాచారాలు వ్యాప్తి చెందుతున్నాయని అసహనం వ్యక్తం చేస్తోంది. అయితే...ఈ విషయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఇంకా క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం తమను కట్టడి చేసేందుకు చూస్తోందని గతంలోనే అసహనం వ్యక్తం చేశాయి పలు సంస్థలు. ఇప్పుడు రూల్స్ కూడా మార్చేయడం వల్ల కేంద్రానికి ఆ ప్లాట్‌ఫామ్స్‌పై పూర్తి పట్టు దొరికినట్టే అవుతుంది. 

మోదీకి శాంతి బహుమతి అంటూ ప్రచారం..

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్ర‌ధాన‌ పోటీదారుగా ఉన్నారంటూ వార్తలు వెల్లువెత్తాయి. భారత పర్యటనలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతికి అతిపెద్ద పోటీదారు అని అస్లే టోజే మాట్లాడినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిపై అస్లే టోజే క్లారిటీ ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతికి మోదీ అతిపెద్ద పోటీదారు అని తాను అనలేదని స్ప‌ష్టంచేశారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధాన్ని నిలువరించడానికి మోదీ కృషి చేశారని, దీనికోసం ఆయన ఆ రెండు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్‌స్కీతో పలుమార్లు ఫోన్ లో సంభాషించారంటూ వార్తలొచ్చాయి. ఈ కృషిని నోబెల్ కమిటీ గుర్తించిందని, ఇక ఆయనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి అందుతుందంటూ అటు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు కనిపించాయి. అయితే.. నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ  పేరును నోబెల్ కమిటీ పరిశీలిస్తోందన్న వార్తలు పూర్తిగా అస‌త్య‌మ‌ని, నిరాధారమని ఆస్లే టోజే స్పష్టం చేశారు.

Also Read: దుబాయ్‌లో ఘోర ప్రమాదం, గాయపడిన భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
YS Jagan News: ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్లకు పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్లకు పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
KTR Comments On Revanth Reddy: ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
BCCI Desicion On Seniors: రోహిత్ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!
రోహిత్ వాదనను పట్టించుకోని బీసీసీఐ.. సీనియర్లపై వేటుకు రంగం సిద్ధం!
Embed widget