Trump Tariff on India effect: అమెరికాకు నగలేసుకె్ళ్తే అంతే సంగతులు - ఎయిర్‌పోర్టుల్లోనే నిలువుదోపిడీ - ఇలా జాగ్రత్తలు తీసుకోండి
Trump Tariffs: భారతీయులు చాలా మంది అమెరికాకు వెళ్తూంటారు. ఆర్నమెంట్స్ పెట్టుకుని వచ్చే వారికి ఇప్పుడు భారీగా పన్నులు కట్టాల్సి వస్తుంది. అది కూడా కొత్తగా కొనుగోలు చేసినంత అవుతుంది.

Gold troubles for Indians: భారతీయులు బంగారం ప్రియులు. బంగారం పెట్టుబడి పెట్టడం కాదు ఒంటిపై వేసుకుని మురిసిపోతూంటారు. అమెరికా వెళ్లే వాళ్లు కూడా ఆభరణాలు ధరిస్తారు. తమ గోల్డ్ ను తీసుకెళ్తూంటారు. ఇప్పుడు అలా పెట్టుకుని చిన్న ఉంగరం తీసుకెళ్లాలన్నా ఆలోచించాల్సిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై విధించిన 25 శాతం అదనపు టారిఫ్‌లు బంగారు ఆభరణాల దిగుమతులపై మొత్తం సుంకాన్ని 57 శాతానికి పెరిగేలా చేశాయి.
బంగారు ఆభరణాలు భారత్ అమెరికాకు చేసే ప్రధాన ఎగుమతి వస్తువులలో ఒకటి. అమెరికా భారత ఆభరణ ఎగుమతులలో సుమారు 30 శాతం వాటాను కలిగి ఉంది. 2024లో దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు ఈ విభాగంలో జరిగాయి. ఇప్పుడు సుంకాల కారణంగా అలాంటి వాటి దిగుమతులపై పన్నులు భారీగా పెరిగాయి. భారత బంగారు ఆభరణాలపై మొత్తం సుంకం 57 శాతానికి చేరాయి. సాధారణంగా బంగారు ఆభరణాలపై 5-7 శాతం, వెండి ఆభరణాలపై 13.5 శాతం టారిఫ్ ఉంది. వీటికి అదనంగా 50 శాతం పన్ను విధించారు ట్రంప్. గతంలో కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్‌పై సున్నా సుంకం ఉండేది. అలాగే స్టడెడ్ బంగారు ఆభరణాలపై 5.5 శాతం , సాదా బంగారు ఆభరణాలపై 7 శాతం , ప్లాటినం ఆభరణాలపై 5.5 శాతం , వెండి ఆభరణాలపై 13.5 శాత ఉండేది.
అయితే కేవలం వ్యాపారపరమైన దిగుమతులే కాదు.. భారతదేశం నుండి బంగారు ఆభరణాలను తీసుకువచ్చే అమెరికా నివాసితులు వాటి విలువపై 57 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 20,000 డాలర్ల విలువైన నెక్లెస్‌పై 57 శాతం సుంకంతో ధర 31,400 డాలర్లు చెల్లించాలి. అదే సమయంలో అమెరికా నుంచి భారత్ కు వెళ్లి మళ్లీ పాత ఆభరణాలను తిరిగి అమెరికాకు తీసుకువచ్చే వారు ఆ ఆభరణం అమెరికాలో కొనుగోలు చేశామని.. లేదా భారత్‌కు వెళ్లే ముందు కూడా తమ దగ్గర ఉందని రుజువు చూపించాలి. లేకపోతే 57 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
అమెరికాలో భారతీయ బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే వారు కూడా ఈ అదనపు సుంకం కారణంగా ఎక్కువ ధరలు చెల్లించాల్సి ఉంటుంది. బంగారు ఆభరణాలు, కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ అత్యధికంగా 12.8 శాతం ఎగుమతలను కలిగి ఉన్నాయి. కొత్త టారిఫ్‌లతో, ఎగుమతులు 30 నుంచి 50 శాతం తగ్గవచ్చని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంటే ఇప్పుడు అమెరికాకు వెళ్లే వారు ఒంటి మీద గ్రాము కూడా బంగారం లేకుండా వెళ్లాలి.. ఒక వెళ్లి.. తాము మళ్లీ వెనక్కి తెచ్చుకుంటామన్నా కుదరదు. అంటే ఉంగరాలు, చెయిన్లకు కూడా ట్యాక్స్ కట్టించుకుంటారు. టూరిస్టులమని.. మళ్లీ వాటిని వెనక్కి తీసుకెళ్తామన్నా ఒప్పుకోరు. అలాగే అమెరికాలో ఉండేవారు.. స్వదేశానికి రావాలనుకుంటే.. మొత్తం అమెరికాలోనే దాచి పెట్టుకుని రావాలి. అమెరికాలో స్థిరపడేందుకు వెళ్లిన వారు తమ బంగారం ఇండియాలో ఉంటే.. అక్కడే ఉంచుకోవాలి. అమెరికాకు తీసుకెళ్లాలంటే మళ్లీ కొన్నంత ఖర్చుపెట్టారు. అలాగని అమెరికాలోనూ కొనుక్కోలేరు. ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ కావడంతో రేట్లు కూడా ఊహించనంతగా పెరిగిపోతాయి మరి.





















