Central Cabinet decisions: 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన - కేంద్రం నిర్ణయం - ఎవరి కోసమంటే
Central Cabinet : కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 100 జిల్లాలను కవర్ చేసేలా ఆరు సంవత్సరాల కాలానికి “ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన”ను ఆమోదించింది.

Dhan Dhaanya Krishi Yojana: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం 100 జిల్లాలను కవర్ చేసేలా ఆరు సంవత్సరాల కాలానికి “ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన” పథకాన్ని అమలు ఆమోదించింది. 2025-26 నుండి 100 జిల్లాలను కవర్ చేసేలా 2025-26 నుండి ప్రారంభమయ్యే "ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన"ను ఆమోదించారు.
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యీకరణ , స్థిరమైన వ్యవసాయ పద్ధతులను స్వీకరించడం, పంచాయతీ , బ్లాక్ స్థాయిలో పంటకోత తర్వాత నిల్వను పెంచడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక రుణ లభ్యతను సులభతరం చేయడం ఈ పథకం లక్ష్యం. "ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన" కింద 100 జిల్లాలను అభివృద్ధి చేయడానికి 2025-26 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఇది ఉంది. ఈ పథకం 11 విభాగాలు, ఇతర రాష్ట్ర పథకాలు , ప్రైవేట్ రంగంతో స్థానిక భాగస్వామ్యాలతో ఉన్న 36 పథకాల కలయిక ద్వారా అమలు చేస్తారు. తక్కువ ఉత్పాదకత, తక్కువ పంట తీవ్రత మరియు తక్కువ రుణ పంపిణీ అనే మూడు కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తిస్తారు.
ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో జిల్లాల సంఖ్య నికర పంట విస్తీర్ణం , కార్యాచరణ హోల్డింగ్‌ల వాటా ఆధారంగా ఉంటుంది. అయితే, ప్రతి రాష్ట్రం నుండి కనీసం 1 జిల్లాను ఎంపిక చేస్తారు. ప్రభావవంతమైన ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ కోసం జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. జిల్లా ధన్ ధాన్య సమితి ద్వారా జిల్లా వ్యవసాయం , అనుబంధ కార్యకలాపాల ప్రణాళికను ఖరారు చేస్తారు, ఇందులో ప్రగతిశీల రైతులు కూడా సభ్యులుగా ఉంటారు. పంట వైవిధ్యీకరణ, నీరు , నేల ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయం, అనుబంధ రంగాలలో స్వయం సమృద్ధి అలాగే సహజ , సేంద్రీయ వ్యవసాయ విస్తరణ అనే జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది.
#Cabinet approves a special exemption for NLC India Limited (NLCIL) from the prevailing investment guidelines applicable to Navratna Central Public Sector Enterprises (CPSEs).
— PIB India (@PIB_India) July 16, 2025
➡️ This strategic decision enables NLCIL to invest Rs.7,000 Crore in its wholly owned subsidiary, NLC…
ఈ 100 జిల్లాల్లో లక్ష్య ఫలితాలు మెరుగుపడటంతో, దేశానికి కీలక పనితీరు సూచికలతో పోలిస్తే మొత్తం సగటు పెరుగుతుంది. ఈ పథకం అధిక ఉత్పాదకత, వ్యవసాయం , అనుబంధ రంగాలలో విలువ జోడిస్తుంది. స్థానిక జీవనోపాధి సృష్టిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ సాధించడానికి ఉపోయగపడుతుదని కేంద్రం నిర్ణయించింది. అలాగే NTPC రిన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, దాని ఇతర జాయింట్ వెంచర్స్/సబ్సిడియరీలలో పెట్టుబడుల కోసం NTPC లిమిటెడ్‌కు అధికారాలను కల్పిచారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు రూ. 20,000 కోట్ల పెట్టుబడిని ఆమోదించారు. అలాగే NLC ఇండియా లిమిటెడ్ (NLCIL)కు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు అధికారం ఇచ్చారు.





















