By: Ram Manohar | Updated at : 03 Feb 2023 04:36 PM (IST)
బైజుస్‌లో రెండో విడత లేఆఫ్‌లు కొనసాగనున్నాయి.
Byju's Lays Offs:
సెకండ్ ఫేజ్ లేఆఫ్‌లు..
లేఆఫ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. వరుసగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. కాస్ట్ కటింగ్‌లో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ Byjusకూడా ఇదే బాట పట్టింది. ఇప్పటికే ఓ విడత లేఆఫ్‌లు అమలు చేసిన ఈ కంపెనీ రెండో ఫేజ్‌నూ మొదలు పెట్టింది. ఈ సారి 1000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఓ నివేదిక అంచనా వేసింది. ఆర్నెల్ల కాలంలోనే ఈ కోతలు విధిస్తూ పోతోంది బైజూస్. డిజైన్, ప్రొడక్షన్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ సారి లేఆఫ్‌లు ఉండనున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలోని ఉద్యోగులకే ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ డిపార్ట్‌మెంట్‌లో కనీసం 300 మందికి పింక్ స్లిప్ చూపించనున్నారు. లాభాల్లో నడిచేందుకు వీలుగా..మొదటి విడతలో 2,500 మంది ఉద్యోగులను తొలగించింది బైజూస్. ఆపరేషనల్ కాస్ట్ తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని గతేడాది అక్టోబర్‌లో ప్రకటించింది యాజమాన్యం. బ్రాండ్ అవేర్‌నెస్‌ను పెంచడంపైనే తాము దృష్టి సారిస్తామని కోఫౌండర్ దివ్య గోకుల్‌నాథ్ వెల్లడించారు. రానున్న రోజుల్లో దాదాపు 10 వేల మంది టీచర్లను రిక్రూట్ చేసుకుంటామని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద Edtech స్టార్టప్‌గా రికార్డు సృష్టించింది బైజూస్.
టెక్ సెక్టార్‌లో లేఆఫ్‌లు కంటిన్యూ అవుతున్నాయి. ట్విటర్‌తో మొదలైన ఈ ట్రెండ్...అన్ని కంపెనీల్లోనూ నడుస్తోంది. అమెజాన్‌లో ఏకంగా 10 వేల మందిని తొలగిస్తున్నట్టు రిపోర్ట్‌లు తెలిపాయి. అమెజాన్ సీఈవో కూడా దీన్ని ధ్రువీకరించారు. అయితే..ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. 10 వేలకు బదులుగా ఏకంగా 20 వేల మందికి ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది. టెక్నాలజీ స్టాఫ్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ సహా మరి కొన్ని విభాగాల్లోని ఉద్యోగులను తొలగించనుంది అమెజాన్. మరి కొద్ది నెలల్లోనూ వీరందరినీ ఇంటికి పంపేయనుంది. గతంలోనే అమెజాన్ సీఈవో యాండీ జాసీ "భారీ లేఆఫ్‌లు" ఉంటాయని వెల్లడించారు. కానీ..ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం చెప్పలేదు. అప్పటికున్న సమాచారం ప్రకారం 10 వేల మందిని తీసేస్తారని కొన్ని నివేదికలు తెలిపాయి. కానీ..ఇప్పుడా సంఖ్య 20 వేలకు చేరుకుంది. సీనియర్ పొజిషన్‌లో ఉన్న వారినే "ఫైర్" చేయనుంది అమెజాన్. ఉద్యోగులక పనితీరుని సమీక్షించాలని..ఇప్పటికే మేనేజర్లకు
ఆదేశాలందాయి. ఈ రివ్యూ అయిపోయిన వెంటనే...లేఆఫ్‌లు మొదలు కానున్నాయి. కార్పొరేట్ స్టాఫ్‌లో 6% మందిని తొలగించనున్నారు.
2023 జనవరిలో ఇప్పటి వరకు, 166 టెక్ కంపెనీలు 65,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్‌లోని 10,000 మంది ఉద్యోగులను తొలగించడానికి ముందు, అమెజాన్ 1000 మంది భారతీయ ఉద్యోగులు సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 18000 మందిని కంపెనీ నుంచి పంపేసింది. ఉద్వాసనలు పలికిన కంపెనీల్లో భారత స్టార్టప్‌లు అత్యధికంగా ఉన్నాయి. షేర్‌చాట్ కంపెనీ తన వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం లేదా 500 మంది ఉద్యోగులను తొలగించింది. లే-ఆఫ్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం... 2022లో, 1,000కి పైగా కంపెనీలు 1,54,336 మంది ఉద్యోగులను తొలగించాయి.
Also Read: PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్ ర్యాంక్
కొత్త విధానంలో ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
TS Constable Technical Papers: నేడే కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ టెక్నికల్ పరీక్షలు!
Dogs Attack: రాత్రిళ్లు సంచరించే కుక్కలను పట్టుకోడానికి ప్రత్యేక టీంలు
Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
TS Police SI Exam: ఏప్రిల్ 3 నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ తుదిపరీక్ష హాల్‌టికెట్లు, పరీక్షలు ఎప్పుడంటే?
RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..
Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్
LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!
Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు