Bus Accident In UP: ఘోర ప్రమాదం- ఒకదానికొకటి ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సులు, 8 మంది మృతి!
Bus Accident In UP: ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.
Bus Accident In UP: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందారు. 16 మంది వరకు గాయపడ్డారు.
8 killed, 16 injured as 2 double-decker buses collide in UP's Barabanki
— ANI Digital (@ani_digital) July 25, 2022
Read @ANI Story | https://t.co/jeYkhVpFHE#Barabankiaccident #PurvanchalExpresswayaccident pic.twitter.com/RWOhNpJNHF
ఇదీ జరిగింది
కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ్‌పుర్ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. రెండు ప్రైవేట్ బస్సులు బిహార్ నుంచి దిల్లీకి వెళుతుండగా ఢీకొన్నాయి. ఓ బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో వేగంగా వచ్చిన రెండో బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను లఖ్‌నవూ ట్రామా సెంటర్‌కు తరలించారు.
సీఎం దిగ్భ్రాంతి
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటాబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికాలుకు ఆదేశించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలో కారు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స కోసం చంబా మెడికల్ కాలేజీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో మృతులు చంబాకు చెందిన రాకేష్ కుమార్, అమర్ జీత్ సింగ్, మనోహర్, రాజీవ్ శర్మ, హేమ్ సింగ్‌లుగా గుర్తించారు. కారు వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. లోయ ప్రాంతాల్లో వెళ్లేటప్పుడు వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు కోరుతున్నారు. లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 16,866 మందికి వైరస్
Also Read: Droupadi Murmu President of India: నా ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీక: రాష్ట్రపతి తొలి ప్రసంగం