By: ABP Desam | Updated at : 25 Jan 2022 03:09 PM (IST)
విద్యారంగానికి లభించే ప్రాధాన్యత ఎంత ?
2022-23 కేంద్ర బడ్జెట్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమయింది. అన్ని వర్గాలూ బడ్జెట్‌లో తమకేం వస్తాయి... ఏం తీసుకుంటారు అన్న టెన్షన్‌తో గడుపుతున్నారు. అదేవిధంగా వివిధ రకంగాల కేటాయింపులుఎలా ఉంటాయని ఆయా రంగాల ప్రముఖులూ చర్చించుకుంటున్నారు. దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన రంగాల్లో ఒకటి విద్యారంగం. ఈ సారి విద్యారంగానికి కేంద్రం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందనేది నిపుణుల్లో చర్చనీయాంశం అయింది. దీనికి కారణం గత ఏడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమే.
కరోనా కారణంగా మారిపోయిన విద్యారంగ ముఖ చిత్రం !
కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థపై, ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఎక్కువ మంది ఆన్ లైన్ క్లాసుల బాట పట్టారు. దీంతోసరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో దేశంలో విద్యా ప్రమాణాలు పడిపోయాయన్న ప్రచారం ఉంది. ఇక ప్రైవేటు స్కూళ్లూ కూడా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని పన్ను మినహాయింపులు కోరుతున్నారు. విద్యా సేవలు 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించాలని కోరుతున్నారు. కేంద్రం కూడా ఈ దిశగా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సారి బడ్జెట్ కేటాయింపులు గతం న్నా పది శాతం మేర పెరిగే అవకాశం ఉందని విద్యారంగ ప్రముఖులు భావిస్తు్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్య విషయంలో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం అంతటా వినిపిస్తోంది.
Also Read: సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్‌లో మార్పులకు కేంద్రం సిద్దం - వ్యతిరేకిస్తూ కేసీఆర్ లేఖ !
మరుమూల ప్రాంతాలకు ఆన్ లైన్ విద్యను చేర్చాల్సిన ఆవశ్యకత !
కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రమాణాలు పెంచాల్సి ఉంది. స్కూల్స్ నిర్వహణ కష్టతరమవుతున్న పరిస్థితుల్లో విద్యార్థులలో పఠనాశక్తి తగ్గిపోకుండా ఉండటానికి ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు ప్రారంభించినా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపే ధైర్యం చేసేలా పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలను కనుగొనాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విద్యా రంగం నిరంతరం నెట్ కనెక్షన్ ఉండి.. స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఉన్న వర్గాల పిల్లలకే పరిమితమైంది. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడానికి కేంద్రం ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది.
గతేడాది వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన నిధులను 6 శాతం తగ్గించింది. ఈ కోత తర్వాత బడ్జెట్‌లో విద్యా రంగానికి మొత్తం రూ.93,223 కోట్లు కేటాయించారు. అంతకుముందు ఏడాది విద్యారంగానికి రూ.99,311 కోట్ల బడ్జెట్ కేటాయించారు. 2022-23 బడ్జెట్ సమయంలో కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఈ ఏడాది దాదాపు 10 శాతం కేటాయింపులను పెంచవచ్చని అంచనా. అలా చేస్తేనే భావి భారత పౌరుల భవిష్యత్‌కు గ్యారంటీ ఉంటందని విద్యారంగ నిపుణులు నమ్మకంగా చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో దారుణం- నిప్పంటించుకొని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి
Bhadradri Kottagudem News : లవర్ ను గర్భవతి చేసిన యువకుడు, అబార్షన్ వికటించి యువతి మృతి
రామాంతాపూర్‌లో పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని, ప్రిన్సిపాల్‌ను గట్టిగా పట్టుకున్న విద్యార్థి
Munavar Vs Raja Singh : మునావర్ షోకు అనుమతి - రాజాసింగ్ హౌస్ అరెస్ట్ ! సీరియస్ మ్యాటర్‌గా స్టాండప్ కామెడీ !
Bilkis Bano Case: వాళ్లు సంస్కారవంతులు, అందుకే విడుదల చేశాం - గుజరాత్ భాజపా ఎమ్మెల్యే కామెంట్స్
BJP Strategy In Telangana: తెలంగాణలో త్రిపుర తరహా వ్యూహం, తమ సక్సెస్‌పై ధీమాగా కమలనాథులు
ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!
వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!
Karthikeya 2:‘కార్తికేయ-2’ దర్శకుడికి సర్ ప్రైజ్.. బిగ్ బీ పిలిచి ఏమన్నారంటే..?