Top Headlines Today: ఎమ్మెల్యే జగన్‌కు న్యాయం చేయాలన్న నాగబాబు, తెలంగాణ అసెంబ్లీలో "పవర్" ఫుల్ స్పీచ్ వార్- నేటి టాప్ న్యూస్
Andhra Pradesh News Today | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జులై 29న జరిగిన ప్రధాన ఘటనలు, వార్తలు ఒకేచోట ఇక్కడ అందిస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా నడుస్తోంది.
Telangana Assembly Sessions | 'పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కు న్యాయం చేయాలి' - కూటమి ప్రభుత్వానికి జనసేన నేత నాగబాబు విజ్ఞప్తి
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు న్యాయం చేయాలంటూ జనసేన నేత నాగబాబు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 2019కి ముందు జగన్‌పై జరిగిన కోడికత్తి దాడికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఆయన సెటైర్లు వేశారు. అప్పటి ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కుదర్లేదని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిపై విచారించి అమాయకుడైన జగన్‌కు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ - ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం
ఏపీ రాజకీయాల్లో సోమవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy).. వైఎస్ విజయమ్మతో (YS Vijayamma) భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లిన ఆయన ఆమెతో సమావేశమయ్యారు. విజయమ్మ ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అరగంట పాటు వీరి సమావేశం జరగ్గా.. ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని.. మామూలుగానే కలిశారనే జేసీ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఇళ్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ - 4 లక్షలు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటన
సొంతింటి కళను సాకారం చేసుకోవాలనుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్తను చెప్పాయి. నిరుపేదలు ఇళ్ల నిర్మాణానికి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని భారీగా పెంచనున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద 2024-25 ఏడాదిలో నిర్మించనున్న ఇళ్లకు సంబంధించిన విధి, విధానాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. తాజా మార్గదర్శకాలను అనుసరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులను తప్పనిసరిగా కేటాయించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌ను ఎన్నికల ముందే రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం పంపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ అసెంబ్లీలో జగదీష్‌రెడ్డి వర్సెస్ వెంకట్ రెడ్డి- రాజకీయాల నుంచి తప్పుకుంటామంటూ సవాళ్లు
తెలంగాణ అసెంబ్లీలో పవర్‌ఫుల్‌పైట్ హోరాహోరీగా సాగింది. సవాళ్లు ప్రతిసవాళ్లతో సభ హీటెక్కింది. జగదీష్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ఇరు పక్షాలు చాలా హాట్ హాట్‌గా కనిపించారు. దేనిపై చర్చ జరగాలే ఇప్పటి వరకు తమకు బుక్ ఇవ్వలేదని దేనిపై మాట్లాడాలో అర్థం కాలేదన్నారు జగదీష్ రెడ్డి. పదిరోజుల ముందు సభలలో పెడితే వచ్చి నష్టమేంటని ప్రశ్నించారు. ఒకే రోజు 19పద్దులపై చర్చ పెట్టడం సరికాదన్నారు. మీటర్ల విషయంలో కూడా సభను సీఎం రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కోట్లు దోచి సత్యహరిశ్చంద్రుల వారసులమని చెప్పుకుంటున్నారు: రేవంత్
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై వాడీవేడీ చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ సంస్కరణల పేరుతో అప్పనంగా ప్రభుత్వం సొమ్మును దొచుకున్నారని అటెండర్ ఉద్యోగాన్ని కూడా తమ వాళ్లకే ఇచ్చుకొని విద్యుత్ శాఖనే సర్వనాశనం చేశారని ఆరోపించారు. ప్రతి ప్రాజెక్టులో బీనామీలతో టెండర్లు పిలిచి వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు రేవంత్. ఇంత చేసినా నిజాయితీపరులు మాదిరిగా మాట్లాడుతున్నారని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి